'భారత్ను హిందూరాజ్యంగా ప్రకటిస్తేనే రక్షణ'
నెల్లూరు: భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటిస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందని ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. దేశంలో తీవ్రవాదాన్ని అణచివేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ - కశ్మీర్లో హిందువుల ఎందుకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో మరోసారి పునరాలోచించాలని ప్రవీణ్ తొగాడియా అన్నారు.