బంగ్లాదేశ్ భయానక పరిస్థితులు గమనిస్తుంటే దేశ విభజన నాటి గాయాలు గుర్తుకొస్తున్నాయి. రిజర్వేషన్ల ముసుగులో ఆందోళన చేపట్టిన అల్లరి మూకలు హిందూ సంహారం కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు, యువకులు తమ ఉపాధి, ఉద్యో గాల కోసం చేస్తున్న పోరాటాలు హిందూ వ్యతి రేకతే లక్ష్యంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువుగా పుట్టడమే పాపం అయిపోయింది. మైనారిటీలు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు)గా జీవించడమే శాపం అయిపోయింది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందాల్సిన వారు హిందువులను వెంటాడి వేటాడితే రిజర్వేషన్లు లభిస్తాయా? హిందూ దేవాల యాలను ధ్వంసం చేస్తేనో, హిందూ అమ్మా యిలపై అత్యాచారం చేస్తేనో, హిందువులను చంపితేనో కొలువులు వస్తాయా? ఈ భూమిపై చిట్టచివరి హిందువును సైతం అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు అంటూ కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రకటించడం వెనుక భయంకర ఉపద్రవం దాగి ఉంది.
శత్రువులను సైతం స్వాగతించి అక్కున చేర్చుకోవడం హిందువుల స్వభావం. నాడు సామాజిక రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను బంగ్లా నుంచి తరిమేస్తే... భారత్ అక్కున చేర్చుకుంది. నేడు జిహాదీల హత్య నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన షేక్ హసీనాకు సైతం ఆశ్రయం ఇచ్చిన భారత్... శాంతి, సహనంతో ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
రక్షించాల్సిన పోలీసులే రజాకారులుగా మారణకాండను ప్రోత్సహిస్తున్నారు. న్యాయ స్థానా లను ఆశ్రయిద్దామంటే ఆందోళనకారులు జడ్జిలను కూడా వదలడం లేదు. కోర్టులను చుట్టుముట్టి న్యాయమూర్తులనే దిగిపోవాలని హుకుమ్ జారీ చేస్తుంటే, అక్కడి మైనారిటీలకు రక్షణ ఏది? ఆస్తులు, ఇళ్లు, పొలాలు వదిలి పారిపోవాలా? ప్రాణం కోల్పోవాలా? మతం మారాలా? అర్థం కాని స్థితిలో నరకం అనుభవించడం హిందువుల వంతయింది. ఏ తప్పు చేయకున్నా హిందువులు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడం నేటి మానవతా సమాజానికి మచ్చగా మారుతోంది.
హిందువు అనే ఒకే ఒక్క కారణంతో బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంటికి మంట పెట్టడం... భయంతో పారిపోతున్న సినిమా హీరోలను, నిర్మాతలను కొట్టి చంపడం, సాహిత్యకారులు, కళాకారుల ఇళ్లను వారి కార్యాలయాలను, కళాస్మృతులను ధ్వంసం చేయడంపై క్రీడాలోకం, చిత్ర, సాహిత్య లోకాలూ స్పందించకపోవడం బాధాకరం.
బంగ్లాకు–భారత్‌కు అనుసంధానంగా ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాన్ని ధ్వంసం చేస్తే... కనీసం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు స్పందించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? వారి మౌనం ఆందోళనకారులకు మద్దతి చ్చినట్లే భావించాలా? సమాజం ఆలోచించాలి.
ఇంత జరుగుతున్నా సినీనటులూ, కళాకారులూ, మానవహక్కుల సంఘాలవాళ్ల గొంతు పెగలక పోవడం బాధాకరం. భారతదేశంలో కుక్కలపై, పిల్లులపై దాడి జరిగితే గగ్గోలుపెట్టే గ్యాంగులు... హిందువుల ఊచకోతను కనీసం పత్రికా ముఖంగానైనా ఎందుకు ఖండించడం లేదు?
ఏది ఏమైనా ‘సేవ్ బంగ్లా’ అంటూ ప్రపంచంలోని హిందువు లంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయం. దీని గురించి రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి హిందువూ చర్చించడం స్వాగతించాల్సిందే. బంగ్లా విడిపోయిన సమయంలో 32 శాతం ఉన్న హిందూ జనాభా నేడు అక్కడ ఏడు శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూనే... ప్రతి హిందువూ తమ ఆత్మబంధు వేనని ముందుకు రావడం హిందూ ఐక్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు.
– పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రసార ప్రముఖ్; విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ 99129 75753
ఇంత జరుగుతున్నా నోరు మెదపరేం?
Published Wed, Sep 11 2024 12:15 AM | Last Updated on Wed, Sep 11 2024 12:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment