సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్‌లు సంయుక్తంగా శుక్రవారం మధ్యాహ్నం ఇందిరా పార్కు వద్ద ‘మహిళా గర్జన’ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి. సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోని 18 మంది మంత్రుల్లో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం, గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, శాసన మండలి ఎన్నికల్లో నిలబెట్టిన ఐదుగురు అభ్యర్థుల్లో ఒక్క మహిళ కూడా లేక పోవడం, అమరవీరుల తల్లులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించకపోవడానికి నిరసనగా ఈ మహిళా గర్జనను నిర్వహిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు.
కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా చేసి రాష్ట్రంలోని రెండు కోట్ల మహిళల సమర్థత, ఆత్మాభిమానాన్ని అవమానించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో తెలంగాణ మహిళా సమాజం తిరగబడవలసిన సమయం ఆసన్నమైందన్నారు.
నేడు మహిళా గర్జన: మంద కృష్ణమాదిగ
Published Fri, Jun 5 2015 3:32 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement