mahila garjana
-
‘లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు’
సాక్షి, చోడవరం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. గురువారం చోడవరంలో జరిగిన వైఎస్సార్ సీపీ మహిళ గర్జనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. వీధికో బార్, గ్రామల్లో విచ్చలవిడిగా వైన్ షాపులకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని, మహిళలను కించపరిచే టీడీపీ పాలనలో చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు. మహిళలకు మాంగల్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాత్రమే అన్నా అని పిలవగలమన్నారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకొని వైఎస్ జగన్ నవరత్నాలను రూపొందించారని అన్నారు. అమరావతిలో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అని, ఇంతకాలం ఎన్టీఆర్ భవన్ కూడా అమరావతిలో ఏర్పాటు చేయని చంద్రబాబు ...ఎన్నికల తర్వాత ఏపీని వదిలి వెళ్లాల్సిందేనని అన్నారు. జగన్ అమరావతిలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందన్న ఆమె... చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొడితే ఏపీకి హోదా వస్తుందన్నారు. ఇక చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు అని ఎద్దేవా చేశారు. తండ్రి గుడిని మింగితే కొడుకు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని వ్యాఖ్యానించారు. చీరలు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్న చంద్రబాబుని మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఇవ్వకపోగా తన కోడలు బ్రహ్మణీకి మాత్రం హెరిటేజ్ కంపెనీ ఇచ్చారని ఆమె విమర్శించారు. పోస్ట్ డేటెడ్ చెక్‌లు ఇవ్వాలన్న ఆలోచన అవుట్ డేటెడ్ చంద్రబాబుది అని, డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు కూడా లేవా అని ప్రశ్నలు సంధించారు. ఈ చెక్కులు ద్వారా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ చెక్కులు చెల్లవని చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. వైఎస్సార్ సీపీ మహిళ గర్జనలో అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, పీలా వెంకటలక్ష్మి, వరలక్ష్మి, కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఏపీని వదిలి వెళ్లాల్సిందే
-
నేడు మహిళా గర్జన: మంద కృష్ణమాదిగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్‌లు సంయుక్తంగా శుక్రవారం మధ్యాహ్నం ఇందిరా పార్కు వద్ద ‘మహిళా గర్జన’ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి. సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోని 18 మంది మంత్రుల్లో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం, గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, శాసన మండలి ఎన్నికల్లో నిలబెట్టిన ఐదుగురు అభ్యర్థుల్లో ఒక్క మహిళ కూడా లేక పోవడం, అమరవీరుల తల్లులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించకపోవడానికి నిరసనగా ఈ మహిళా గర్జనను నిర్వహిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా చేసి రాష్ట్రంలోని రెండు కోట్ల మహిళల సమర్థత, ఆత్మాభిమానాన్ని అవమానించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో తెలంగాణ మహిళా సమాజం తిరగబడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. -
మహిళలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వరా ?
రంగారెడ్డి (ఘట్కేసర్) : జనాభాలో 3 శాతం ఉన్న రెడ్డి, వెలమలకు 10 మంత్రి పదవులు కేటాయించారని, 50 శాతం ఉన్న మహిళలకు మాత్రం ఒక్క పదవీ కేటాయించకుండా వారిని అవమానిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనూతుల నాగేష్‌మాదిగ అన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమానికి నాగేష్‌మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనాభాలో సగం ఉన్న మహిళలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటులేకుండా చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాలని కోరుతూ నగరంలోని ఇందిరాపార్కు దగ్గర జూన్ 5వ తేదీన చేపట్టనున్న మహిళా గర్జనకు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంగి జగన్‌మాదిగ ఆధ్వర్యంలో మహిళా గర్జన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. -
కేసీఆర్‌తో తేల్చుకుంటాం
వరంగల్(హన్మకొండ): మహిళలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా మహిళా తిరుగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి వర్గంలో ఆరుగురు మహిళలకు అవకాశముందని చెప్పారు. చట్టసభలో సభ్యులు కాని నాయిని, తెలంగాణ వ్యతిరేకి తుమ్మల నాగేశ్వర్రావును మంత్రి వర్గంలో తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ర్ట సాధనకు ఉద్యమించిన మహిళా లోకం పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ అంశలో కేసీఆర్‌తో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ క్రమంలోనే జూన్ 5వ తేదీన హైదరాబాద్‌లో మహిళా గర్జనను నిర్వహించనున్నామని తెలిపారు. మంత్రి వర్గంలో మహిళల ప్రాతినిథ్యంపై ఇతర రాజకీయ పార్టీలోని మహిళా విభాగం నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పిస్తానని చెప్పిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికైనా మౌనం వీడాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యక్రమాల అమలులోనూ వర్గీకరణ అమలు కావడం లేదన్నారు. కడియం శ్రీహరి సాంఘీక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోనూ అమలు చేయడం లేదని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. -
కళ్యాణదుర్గంలో మహిళాగర్జన