అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా శిలాసేకరణ ప్రారంభిస్తామని మంగళవారం విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది.
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మా ణం కోసం దేశవ్యాప్తంగా శిలాసేకరణ ప్రారంభిస్తామని మంగళవారం విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. మందిర నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ సృష్టించొద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేసింది. రామ మందిర నిర్మాణానికి మొత్తం 2.25 లక్షల నలుచదరపు శిలలు అవసరమవుతాయని, వాటిలో 1.25 లక్షల శిలలు ప్రస్తుతం వీహెచ్‌పీ ప్రధాన కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని, మిగతా లక్ష శిలలను సంవత్సరం లోగా హిందూ భక్తుల నుంచి సేకరిస్తామని వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్ తెలిపారు.
అయోధ్యలో రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యుల భేటీ అనంతరం సింఘాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలు శాంతియుతంగా జీవించాలంటే అయోధ్య, మథుర, కాశి పుణ్యక్షేత్రాలపై వారు తమ వాదనలను వదులుకోవాలన్నారు.