'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ' | VHP Leader Rama Raju condemn MIM Attack on Congress Leaders | Sakshi
Sakshi News home page

'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ'

Published Wed, Feb 3 2016 1:28 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ' - Sakshi

'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ'

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం నేతలు దాడి చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత రామరాజు ఖండించారు. ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ లాంటిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న పదవుల కోసం మజ్లిస్.. టీఆర్ఎస్ తో జత కడుతోందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సందర్భంగా మంగళవారం పాతబస్తీలో పలు చోట్ల మజ్లిస్ నేతలు దౌర్జన్యాలు, దాడులకు దిగారు. అధికార, విపక్ష అభ్యర్థులను భయపెట్టారు.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీపై దాడి చేశారు. ఆజంపుర ప్రాంతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement