mim attack
-
'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం'
హైదరాబాద్: తమ పార్టీ నేతలపై దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోదీ కూడా కలుస్తామని అక్బరుద్దీన్ అనడం మజ్లిస్ అవకాశవాద రాజకీయలకు పరాకాష్ట అన్నారు. ఒవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు. ఒవైసీ సోదరులను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ ను వాడుకుని వదిలేసినట్టే రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని, దీనికి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇక నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ను తామే నడుపుకుంటామని హనుమంతరావు పేర్కొన్నారు. -
'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ'
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం నేతలు దాడి చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత రామరాజు ఖండించారు. ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ లాంటిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న పదవుల కోసం మజ్లిస్.. టీఆర్ఎస్ తో జత కడుతోందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా మంగళవారం పాతబస్తీలో పలు చోట్ల మజ్లిస్ నేతలు దౌర్జన్యాలు, దాడులకు దిగారు. అధికార, విపక్ష అభ్యర్థులను భయపెట్టారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఆజంపుర ప్రాంతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై మలక్పేట ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. -
నేడు ఎమ్మార్వో కార్యాలయాల బంద్
హైదరాబాద్: హైదరాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయాలు గురువారం బోసిపోనున్నాయి. బహదుర్ పురా ఎమ్మార్వోపై ఎంఐఎం కార్యకర్తల దాడికి నిరసనగా ఎంఆర్వోల సంఘం గురువారం హైదరాబాద్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలోని 16 మండల కార్యాలయాల్లో విధులకు ఆటంకం ఏర్పడనుంది. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్వోలు ధర్నా నిర్వహించనున్నారు.