'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం' | hanumantha rao slams own party leaders over Majlis attack | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం'

Published Thu, Feb 4 2016 2:05 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం' - Sakshi

'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం'

హైదరాబాద్: తమ పార్టీ నేతలపై దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోదీ కూడా కలుస్తామని అక్బరుద్దీన్ అనడం మజ్లిస్ అవకాశవాద రాజకీయలకు పరాకాష్ట అన్నారు.

ఒవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు. ఒవైసీ సోదరులను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ ను వాడుకుని వదిలేసినట్టే రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు.

పీసీసీ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని, దీనికి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇక నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ను తామే నడుపుకుంటామని హనుమంతరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement