
ఏసీపీ కార్యాలయం ఎదుట టీమాస్ కార్యకర్తల ధర్నా
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దళితులపై దాడి చేశారు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంక్రాంతి పండగ సందర్భంగా 14న చిన్నకందుకూరులో దళితులు అర్ధరాత్రి గోవును కోస్తున్న క్రమంలో 30 మంది ఆర్‌ఎస్‌ఎస్, గోరక్షక్, వీహెచ్‌పీ కార్యకర్తలు బైక్‌లపై వచ్చారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ జిందాబాద్ అంటూ కర్రలతో దాడి చేశారు. దీంతో ఎర్ర చంద్రయ్య, ఎర్ర ఉప్పల య్య, బొల్లారం యాదయ్య, ఎర్ర పోచయ్య, ఎర్ర మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గోవును వధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దళితులపై కేసులు నమోదు చేశారు.
నిందితులను శిక్షించాలి: టీమాస్
విషయం తెలుసుకున్న టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీ, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌లు బాధితులను శనివారం పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయా లని యాదగిరిగుట్ట ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment