లవ్ జీహాద్.. ఇప్పుడీ పదం చాలామంది నోళ్లలో నానుతోంది. తారా సచ్దేవ్ సంఘటన తర్వాత దీని గురించి అందరికీ తెలిసింది. ఈసారి జార్ఖండ్ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో ఈ తరహా సంఘటన జరిగింది. తానెవరన్న విషయం చెప్పకుండా ఓ యువకుడు వేరే వర్గానికి చెందిన యువతిని మోసగించాడు. ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆమెతో గతవారం ఆ కుర్రాడు పారిపోయాడు. దాంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు న్యాయం చేయాలని, ఇది మరో లవ్ జీహాద్ కేసేనని బీజేపీ, వీహెచ్పీ కార్యకర్తలు మండిపడ్డారు.
బాలిక తండ్రి తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదు చేశారని, దాంతో ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపామని ఛాత్రా ఎస్పీ ప్రశాంతకుమార్ కర్ణ్ తెలిపారు. అతడు తనపేరు సోనుకుమార్ అని అతడు చెప్పుకొన్నాడని, నుదుటన బొట్టు కూడా పెట్టుకునేవాడని, ఓ ప్రైవేటు బస్సులో కండక్టర్గా పనిచేస్తూ ప్రతిరోజూ ఆమె కాలేజీకి వెళ్లేటప్పుడు వెంటపడేవాడని వీహెచ్పీ నాయకుడు విజయ్ పాండే తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.
మరో లవ్ జీహాద్ కేసు!!
Published Sat, Aug 30 2014 11:06 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement
Advertisement