తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకి విదేశీ పర్యటనలపై ఉన్నంత శ్రద్ధ... శ్రీకాళహస్తి రాజగోపురం పునర్నిర్మించటంలో లేదని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. తిరుమలో గురువారం కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపుల ప్రవీణ్ తొగాడియా మాట్లాడారు. శ్రీకాళహస్తి రాజగోపురం కుప్పకూలి ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. శ్రీకాళహస్తి రాజగోపురాన్ని వెంటనే నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'బాబుకు విదేశీ పర్యటనలపైనే శ్రద్ధ'
Published Thu, May 7 2015 8:58 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement
Advertisement