ఐదుగంటలపాటు దారుణం
న్యూఢిల్లీ: కేరళలో దారుణం చోటుచేసుకుంది. తమ తోటి విద్యార్థి అని కూడా చూడకుండా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వాళ్లు చేసిన ర్యాగింగ్ కారణంగా కిడ్నీలు కూడా పనిచేయని పరిస్థితికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ర్యాగింగ్ భూతంపై ప్రతి ఏటా ప్రతి విద్యాలయంలో, సమాజంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కేరళలోని త్రిశూర్‌లో ఓ 22 ఏళ్ల యువకుడు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. అతడిని మరో ఎనిమిది మంది విద్యార్థులను పిలిచి వారి బట్టలు విప్పేసి చేయకూడని పనులు చేశారు.. కొన్ని వారితో చేయించారు. 22 ఏళ్ల విద్యార్థికి మాత్రం దాదాపు ఐదుగంటలపాటు ఓ రకంగా శిక్ష మాదిరిగా అమలు చేశారు. దీంతో అది కాస్త కిడ్నీపై ప్రభావం చూపించి ఆస్పత్రి పాలయ్యాడు. ర్యాగింగ్ కారణంగా ఆ విద్యార్థి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయని వైద్యులు తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.