కోచి: ర్యాగింగ్ వికృత క్రీడకు ఓ విద్యార్థి బలయ్యాడు. విద్యార్థులు విచక్షణ మరచి ఉన్మాదంతో జూనియర్ను తీవ్రంగా గాయపరిచారు. తలకు బలమైన గాయాలు కావడంతో కేరళకు చెందిన 21 ఏళ్ల అహబ్ ఇబ్రహీం అనే విద్యార్థి మరణించాడు. బెంగళూరులోని ఓ కాలేజీలో ఈ సంఘటనకు జరిగింది.
బెంగళూరులోని ఆచార్య కాలేజీ ఆఫ్ టెక్నాలజీ పాలిటెక్నిక్లో రెండో సంవత్సరం డిప్లొమా చదివేవాడు. ఇటీవల ఆరుగురు సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు భాదితుడి బంధువులు చెప్పారు. వారు కూడా కేరళకు చెందినవారే. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీం కాలేజీ హాస్టల్లో అపస్మారక పరిస్థితిలో ఉండగా, గమనించిన సహచర విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. జనవరి 27న ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి ఇబ్రహీం కోమాలోనే ఉన్నాడు. బెంగళూరు చికిత్స చేయించి అనంతరం అతన్ని స్వరాష్ట్రం కేరళకు తరలించారు. కాలేజీ యాజమాన్యం మెరుగైన వైద్యం చేయించినట్టయితే ఇబ్రహీం బతికేవాడని, కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు తిరస్కరించారని అతని బంధువులు ఆరోపించారు. కోచిలో ఇబ్రహీం బంధువుల ఫిర్యాదు మేరకు అసహజమైన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు పరారీ ఉన్నారు. ఇదిలావుండగా, గుజరాత్లో ఇటీవల ర్యాంగిగ్కు పాల్పడ్డ ఎనిమిది మెడికల్ విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.