ఫినాయిల్ కేసులో.. ముగ్గురు అమ్మాయిలు అరెస్టు | Forced phenyl drinking case, Three senior female students arrested | Sakshi
Sakshi News home page

ఫినాయిల్ కేసులో.. ముగ్గురు అమ్మాయిలు అరెస్టు

Published Sat, Jun 25 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

ఫినాయిల్ కేసులో.. ముగ్గురు అమ్మాయిలు అరెస్టు

ఫినాయిల్ కేసులో.. ముగ్గురు అమ్మాయిలు అరెస్టు

గుల్బార్గా: కేరళకు చెందిన ఫస్టియర్ దళిత బాలికకు ర్యాగింగ్ పేరిట ఫినాయిల్ తాగించిన కేసులో.. ముగ్గురు సీనియర్ విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేశారు. గుల్బర్గాలోని నర్సింగ్ కళాశాలలో 19 ఏళ్ల అశ్వథిపై ర్యాగింగ్ పేరిట సీనియర్ విద్యార్థినులు దుర్మార్గానికి పాల్పడిన సంగతి తెలిసింది. అశ్వథికి బలవంతంగా ఫినాయిల్ తాగించడంతో తన ఆరోగ్యం విషమించింది.

కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ ర్యాగింగ్ కేసులో లక్ష్మి, అధీర, విష్ణుప్రియా అనే విద్యార్థినులను అరెస్టుచేసి జుడ్యీషియల్ కస్టడీకి తరలించినట్టు  కలాబురుగి ఎస్పీ ఎన్ శశికుమార్ తెలిపారు. మే 9న ఆల్ కమాల్ నర్సింగ్ కళశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనతో అశ్వథి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె కడుపులోని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అశ్వథి ఆస్పత్రిలో కోలుకుంటున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement