
‘కాల్ నాగుల్’ అరెస్ట్
ఖమ్మం: కాల్ మనీ వ్యవహారంలో పలు కేసులు నమోదు చేయబడి పలుమార్లు అరెసై్టన మాజీ పోలీస్ కానిస్టేబుల్ నాగులును మెదక్ జిల్లా సంగారెడ్డి పోలీసులు శనివారం అరె‹స్ట్ చేశారు. జిల్లాలోని తల్లాడ మండల కేంద్రానికి చెందిన నాగులు 1989 బ్యాచ్‌కు చెందిన సివిల్ కానిస్టేబుల్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. అయినా అతనిలో మార్పు రాకపోవటంతో పోలీసులు సర్వీస్ నుంచి తొలగించారు.
ఆ తర్వాత రియల్ వ్యాపారం చేసిన నాగులు కాల్‌మనీ దందాకు తెరదీశాడు. జిల్లాకు చెందిన రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు వ్యాపారం నిమిత్తం రూ.24 లక్షలు నాగులు వద్ద అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ కింద రూ.కోటి వరకు చెల్లించాడు. అయినా మరో కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తుండటంతో గత్యంతరం లేక హైదరాబాద్ వెళ్లిపోయాడు.
అయినా వదలకుండా తన మనుషులతో హైదరాబాద్ వెళ్లి మరీ బెదిరిస్తుండటంతో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చే శాడు. కాల్ మనీ కింద నాగులుపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతని కోసం వెదుకుతుండగా మెదక్ జిల్లా సంగారెడ్డి పోలీసులకు శనివారం చిక్కాడు. నాగులుపై ఖమ్మం వన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం అతనిపై ఆరు కేసులున్నట్లు తెలిసింది.