
అందుకే కోస్టార్స్‌తో ఆ పని చేయలేదు: హీరోయిన్
ముంబై: బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. బోల్డ్‌గా మాట్లాడటం ఆమె నైజమని తెలిసిన వారు చెప్తారు. తాజాగా నేహా ధూపియా షోలోనూ తన అభిప్రాయాలతో సోనం దుమ్మురేపింది. నేహా వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. వాటికి ఏమాత్రం తొణకకుండా బోల్డ్ గా సమాధానం చెప్పింది.
'సావన్' మ్యూజిక్ యాప్ కోసం నేహా ధూపియా "#నోఫిల్టర్‌నెహా' షోను నిర్వహిస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ తో నిర్వహించిన తొలి ఎపిసోడ్‌తోనే ఈ షో దుమ్మురేపింది. 26 ఏళ్ల వయస్సులో వర్జినిటీ కోల్పోయానని చెప్పిన కరణ్.. రాఖీ సావంత్ ను కారిక్యేచర్ అని ఎందుకన్నానో వంటి వివాదాస్పద ప్రశ్నలెన్నింటికో సమాధానం ఇచ్చారు. అదేవిధంగా రెండో ఎపిసోడ్‌లో సోనంను హాట్ హాట్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ను నేహా అడిగింది. వీటికి అంతేబోల్డ్ గా సోనం సమాధానమిచ్చింది. శృంగారమంటే తనకు ఇష్టమేనని, కానీ సినీ పరిశ్రమలో ఎవరి పట్ల తాను ఆకర్షితురాలు కాలేదని, అందుకే వారితో శృంగారంలో పాల్గొనలేదని చెప్పింది.
మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటి? అని అడుగగా.. 'నేను ఇప్పిటికీ ఒంటరినే. సహ నటులు ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. వారు బాగుంటారు. కానీ, వారితో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడలేను. దాంతోపాటు నా సహనటులకు నేనెప్పుడూ ఆకర్షితురాలవ్వలేదు. వారితో శృంగారంలో పాల్గొనలేదు. అందుకే వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి' అని సోనం స్పష్టం చేసింది. అయితే, తన సోదరి రెయా, 'మీర్జ్యా' సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన సోదరుడు హర్ష గురించి తాను ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. ఆలియా భట్ ఇప్పటికే 'వర్జినల్' అనీ, సోనాక్షి తన స్టైలిష్ట్ ను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సోనం నాటీ కామెంట్స్ చేసింది.