ఆగస్టు 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Celebrities buying a birthday celebration on August 27 | Sakshi

ఆగస్టు 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Aug 26 2015 11:01 PM | Updated on Sep 3 2017 8:10 AM

ఆగస్టు  27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఆగస్టు 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న దలీప్ సింగ్ రాణా (ద గ్రేట్ కాళి) (రెజ్లర్), నేహా ధూపియా (నటి)
 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. ఈ సంవత్సరం సృజనాత్మక రంగంలో ఉన్న వారికి, రచనారంగం, టీవీ, మీడియా, సినీరంగంలోని వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ చదువు, విదే శీ ఉద్యోగం కోసం కంటున్న కలలు నెరవేరతాయి. డాక్టర్లు, ఫార్మశీ, దైవసంబంధమైన కార్యాలలో ఉన్న వారి కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది. సన్మానాలు జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిత్రుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించకుండా, తగాదాలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ఈ రోజు పుట్టిన తేదీ 27 కాబట్టి కుజుని ప్రభావం వల్ల ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, సమాజం పట్ల అంకిత భావం వంటి మంచి లక్షణాలుంటాయి.

సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు కొంచెం సంయమనం పాటించాలి. అలాగే అహంభావం, దూకుడు తగ్గించుకోవడం మంచిది.
 లక్కీనంబర్స్: 1,2,6,7, లక్కీ డేస్: ఆది, సోమ,  మంగళ, శుక్రవారాలు లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, గ్రే. సూచనలు: కేతుగ్రహజపం, సుబ్రహ్మణ్యాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, వికలాంగులకు సేవ చేయడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement