
నా భార్యతో గొడవపడితే.. దాదాపు 15 రోజుల పాటు మాట్లాడను అంటున్నారు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నేహా ధూపియా వ్యాఖ్యతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరాయ్యరు షాహిద్ కపూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దంపతులన్నకా గొడవలు సహజం. అది మంచిది కూడా. ఒకరితో ఒకరం విభేధించడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థం అవుతుంద’న్నారు.
‘ఇక మా విషయానికోస్తే రెండు మూడు నెలలకోసారి మేం గొడవ పడుతుంటాం. పోట్లాడుకున్నప్పుడు దాదాపు 15 రోజుల పాటు మేం మాట్లాడుకోం. తర్వాత తనో, నేనో సర్దుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలవుతుంద’న్నారు. ప్రస్తుతం షాహీద్ కపూర్ కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.