![Shahid Kapoor, Mira Rajput Luxurious Villa In Maldives - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/16/mira-rajput.gif.webp?itok=aW0TRZxx)
Shahid Kapoor Wife Mira Rajput Share Video: బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్ భార్య సతీమణి మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. నాకెంతో ఇష్టమైన మాల్దీవుల్లో మా విహార యాత్రను చూసేయండి అంటూ వారి హాలీడే ట్రిప్ విశేషాలను పంచుకుంది. ఈ వీడియోలో తీరంలోని అందమైన విల్లాను చూపిస్తూ తాము బస చేసింది అక్కడేనని చెప్పకనే చెప్పింది. అలాగే తీరం తనకు ఎంతో దూరంలో లేదని చెప్తూ సముద్ర అలలను సైతం షూట్ చేసింది.
ఈ వీడియోలో ఆమె చూపించిన విల్లాలో ఉండాలంటే ఒక్క రాత్రికే సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందట! ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ మళ్లీ ఆ రోజులు కావాలని, ఆ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్లాలని ఉందంటూ ఊహల్లో తేలిపోయింది మీరా. కాగా గత నెలలో షాహిద్ కుటుంబం మాల్దీవులను చుట్టేసిన విషయం తెలిసిందే. ట్రిప్‌ను ఎంజాయ్ చేసి తిరిగి వచ్చినప్పుడు మీరా డ్రెస్సింగ్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇదిలా వుంటే షాహిద్, మీరా 2015లో జూలై 7న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016 ఆగస్టు 26న కూతురు మిషా జన్మించగా 2018 సెప్టెంబర్ 5న కొడుకు జైన్ జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment