ప్రేమించినవాళ్ల కోసం చిన్నచిన్న దొంగతనాలు చేసిపెట్టడం అబ్బాయిలకు మామూలే. యంగ్‌హీరో ఇషాన్ ఖట్టెర్ కూడా శ్రీదేవిగారి అమ్మాయి జాహ్నవికోసం చిన్నపాటి దొంగతనం చేశాడు. అయితే ఆమె మీద ప్రేమతో ఆ దొంగతనం చేశాడా, లేక.. తన దొంగతనాన్ని గులాబీ పువ్వులా ఆమెకు అందజే సి ఇన్‌డైరెక్టుగా తన ప్రేమను జాహ్నవికి చెప్పాలనుకున్నాడా అన్నది తెలీదు. నటి నేహా ధుపియా చాట్ షోలో ఇషాన్ ఈ సంగతి చెప్పాడు. సినిమా షూట్ కోసం ఒమన్ వెళ్లినప్పుడు అక్కడి హోటల్‌లో కనిపించిన ఒక అందమైన దిండును దొంగిలించి ఎవరికీ కనిపించకుండా ప్యాక్ చేసి జాహ్నవికి గిఫ్టుగా ఇచ్చాడట.
‘‘ఎందుకు చేశావ్ ఆ పని!’’ అని నేహ అడిగితే.. ‘‘తను చెయ్యలేదుగా..’’అని చాట్ షోలో కూర్చొని ఉన్న జాహ్నవి వైపు చూసి నవ్వాడు. ‘‘సారా అలీఖాన్, జాహ్నవీ.. వీళ్లిద్దరిలో నీకు ఎవరి యాక్టింగ్ ఇష్టం?’’ అని నేహ ఇంకో ప్రశ్న అడిగింది. సారా అక్కడే ఉంది. అయినా.. ‘‘జాహ్నవి’’ అనే చెప్పాడు ‘‘జాహ్నవి యాక్టింగ్ ఇష్టమా? జాహ్నవి ఇష్టమా?’’ అని నేహ ఇంకో ప్రశ్నేమీ వెయ్యలే దు. అప్పటికే కుర్రాడు తడబడుతున్నాడు మరి. జాహ్నవి తొలి చిత్రం ‘ధడక్’లో హీరో అతడే.
తాకితే చాలు
పిల్లల్తో పాటు ఒక పిల్లీ ఇంట్లో ఉంటే భలే సందడిగా ఉంటుంది. అయితే ముద్దొచ్చిప్పుడే దాన్ని చేతుల్లోకి తీసుకుందామంటే ఒప్పుకోదు. తనకు ఇష్టమైనప్పుడు కూడా మనకు ముద్దు రావాలి. మామూలు పిల్లులతో ఇది అయ్యే పనేనా! అందుకే ‘ఎలిఫెంట్ రోబోటిక్స్’ అనే చైనా స్టార్టప్ కంపెనీ ఓ పిల్లి రోబోను తయారు చేసింది. దానికి ‘మార్స్ క్యాట్’ అని పేరు పెట్టి.. ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శిస్తోంది. ‘రన్’ అంటే పరుగెత్తడం, ‘కమ్ íß యర్’ అంటే దగ్గరకు రావడం.. ఇవి మాత్రమే ఆ పిల్లి రోబో ప్రత్యేకతలు కాదు.
పక్కింట్లోంచి చుట్టపు చూపుగా వచ్చి వెళుతుండే నిజమైన పిల్లులతోటీ ‘మ్యావ్ మ్యావ్’మంటూ మాటలు కలుపుతుంది. వాటితో కలిసి ఆడుతుంది. బొమ్మల్తో కూడా బొమ్మలా కలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనం కమాండ్స్ ఇవ్వకుండానే! అది యాక్టివేట్ అవడానికి చిన్న టచ్ చాలు. ముందు ముందు ఈ పిల్లిరోబో యజమానులు (రోబోను కొనుక్కున్నవారు) ఇచ్చే సూచనలు, సలహాలతో మార్స్ క్యాట్‌ని మరింత ఇంటెలిజెంట్ ఫోలోని చేయబోతున్నాం అని కంపెనీ వాళ్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment