బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది | deepak sivadasani julie sequal with raai laxmi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది

Published Tue, Sep 15 2015 11:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

deepak sivadasani julie sequal with raai laxmi

రాయ్లక్ష్మీగా పేరు మార్చుకున్న తరువాత లక్ష్మీరాయ్ కి బాగానే కలిసొస్తున్నట్టుగా ఉంది. ఇన్నాళ్లు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాంచన మాల కేబుల్ టివి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ భామ, సక్సెస్ కోసం చాలా కాలం పాటు ఎదురుచూసింది. ఇటీవల లక్ష్మీరాయ్ కాస్తా రాయ్ లక్ష్మీగా మారిన తరువాత వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.

ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్ ను కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నసర్థార్ గబ్బర్ సింగ్ లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ భామ కొన్ని సీన్స్ లో కూడా కనిపించనుందట.  ఈ సినిమాతో పాటు కోలీవుడ్ లో మరో అరడజను సినిమాలతో యమా బిజీగా ఉంది లక్ష్మీ.

ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అందాల భామకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ దీపక్ శివదాసని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వల్ మూవీ జూలి సినిమాలో లీడ్ రోల్ కు లక్ష్మీ రాయ్ ని ఎంపిక చేశారు. 2004లో రిలీజ్ అయిన తొలి భాగంలో నేహాదూపియ నటించిన ఈ పాత్రలో సీక్వల్ కోసం లక్ష్మీరాయ్ నటించనుంది. గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉండే సినిమా కోసం పర్ఫెక్ట్ ఫిగర్ లో కనిపించాలని బరువు తగ్గే పనిలో పడింది రాయ్ లక్ష్మీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement