
నెహా ధూపియా
ముంబై: మాజీ మిస్ ఇండియా నెహా ధూపియా 'జూలీ' సీక్వెల్లో నటించడానికి ఇష్టపడటంలేదు. 2004లో విడుదలైన జూలీ చిత్రంలో నెహా తన అందాలను అతిగా ఆరబోసి సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో ఆమె వ్యభిచారిగా నటించింది. ఇప్పుడు ఆదే చిత్రం సీక్వెల్లో నటించమంటే ఆమె తిరస్కరించారు.
''అవును జూలీ 2లో నటించమని నన్ను అడిగారు. అయితే ప్రస్తుతం తాను ఆ చిత్రంలో నటించాలని అనుకోవడంలేదు. అందువల్ల తిరస్కరించాను'' అని ఈరోజు ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో నెహా ధూపియా చెప్పారు. డిఫరెంట్గా ఉండే కథా చిత్రాలలో నటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను త్వరలో ఒక హాస్య కథా చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.
మూస చిత్రాలలో కాకుండా డిఫరెంట్గా ఉండే సినిమాలలో నటించాలని తనకు ఉంటుందని తెలిపారు. జూలీలో నటించినప్పుడు కూడా అలానే అనుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు అటువంటి చిత్రాలలో నటించాలని అనుకోవడంలేదని నెహా చెప్పారు.
**