When Dia Mirza Complained About Her Crush To The School Principal After He Did This - Sakshi
Sakshi News home page

Dia Mirza: స్కూల్ రోజుల్లో లవ్.. కానీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను కూడా: దియా మీర్జా

Published Thu, Jun 8 2023 2:09 PM | Last Updated on Thu, Jun 8 2023 3:11 PM

Dia Mirza Complained About Her Crush To The School Principal - Sakshi

బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా దియా మీర్జా పరిచయం అక్కర్లేని పేరు.  మోడల్, నటి, నిర్మాతగా రాణించింది.  మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్‌ను కూడా గెలిచింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా.. దియా మీర్జా ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. రహ్నా హై తేరే దిల్ మే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆమె ఆర్ మాధవన్ సరసన నటించింది. ఆ తర్వాత సంజు, తప్పడ్, భీడ్ లాంటి చిత్రాల్లో కనిపించింది.

(ఇది చదవండి: నటుడితో విభేదాలు.. మరొకరితో లవ్‌లో పడ్డ నవాజుద్దీన్‌ భార్య!)

కాగా.. 2019లో నిర్మాత సాహిల్‌ సంఘాను దియా మీర్జా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులిచ్చింది. ఫిబ్రవరి 15, 2021లో వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ అబ్బాయి జన్మించారు. దియా చివరిసారిగా భీఢ్‌ చిత్రంలో కనిపించింది. అయితే వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా మీర్జా స్కూల్ డేస్‌లో జరిగిన మొదటి క్రష్‌ గురించి వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన దియా.. స్కూల్లో భాయ్‌ ఫ్రెండ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. తనను మోసం చేసినందుకు స్కూల్ ప్రిన్సిపాల్‌కి  ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

దియా మాట్లాడుతూ.. 'నా సీనియర్ స్కూల్‌లో నాకంటే రెండేళ్లు పెద్ద. నేను అతనిపై విపరీతమైన ప్రేమ. కానీ ఈ విషయాన్ని అతనికి  చెప్పలేదు. నేను అతన్ని ఇష్టపడ్డానని ఎలా తెలిసిందో నాకు తెలియదు. ప్రతి రోజూ మా ఇంటికి ఫోను చేసి ఐ లవ్ యు చెప్పడానికే కాల్ చేశా అనేవాడు. అది విని చాలా సంతోషించా. అతను నన్ను కూడా ప్రేమిస్తున్నాడని అనుకున్నా. మేము స్కూల్లో ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవాళ్లం. కానీ అతను నా బెస్ట్ ఫ్రెండ్‌తో కూడా అదే పని చేస్తున్నాడని తెలిసింది. దీంతో మేం నేరుగా ప్రిన్సిపాల్ కార్యాలయానికి వెళ్లాం. అతనిపై ఇద్దరం ఫిర్యాదు చేశాం.' అంటూ తెలిపింది.  కాగా.. దియా ప్రస్తుతం తరుణ్ దూదేజా దర్శకత్వం వహించిన ధక్ ధక్‌లో నటిస్తోంది. ఇందులో రత్న పాఠక్ షా, ఫాతిమా సనా,  సంజన సంఘీ నటిస్తున్నారు. 

(ఇది చదవండి: ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్‌?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement