‘స్వచ్ఛ సాథీ’ ప్రచారకర్తగా దియా మీర్జా
ముంబై: ‘స్వచ్ఛ భారత్’ అనుబంధ యువత కార్యక్రమం ‘స్వచ్ఛ సాథీ’కి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియా మీర్జా నియమితులయ్యారు. ఈ కార్యక్రమం కింద 2 వేలకు పైగా విద్యార్థులను నియమించుకుంటారు. వీరు 10 వేల స్కూళ్లను సమన్వయపరుస్తారు. అక్కడి విద్యార్థులచే పరిశుభ్ర భారత్ కోసం ప్రమాణం చేయిస్తారు.
ప్రచారకర్తగా దియా... అవగాహన కార్యక్రమాలు, స్ఫూర్తినిచ్చే వీడియోల ద్వారా విద్యార్థులతో మాట్లాడుతారు. ‘దియా యువతకు స్ఫూర్తి ప్రదాత. స్వచ్ఛ భారత్‌లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. మరింత యువతకు చేరువయ్యేందుకు ఆమె సాయం కీలకం కానుంది’’ అని స్వచ్ఛ భారత్ డెరైక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు.