దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. మొదట్లో వ్యాక్సిన్‌పై అపోహలు వచ్చినప్పటికీ ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. ప్రజలు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీనీ, క్రీడా ప్రముఖులు వరుసగా వాక్సీన్ తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా ట్వీటర్ ద్వారా వ్యాక్సిన్ గురించి ఓ ఆసక్తికర సమాచారాన్ని అందించింది.
గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. విదేశాల్లో తీసుకుంటున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం ఇంత వరకు గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దియా మీర్జా ట్విటర్ వేదికగా తనకు తెలిసిన సమాచారాన్ని అందించారు. గర్బవతులు వ్యాక్సిన్ తీసుకోకూడదని ఆమె సూచించారు. ప్రెగ్నెంట్స్ కాకుండా పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని కోరారు.
ప్రెగ్నెంట్, పాలిచ్చే మాతృమూర్తులకు చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న వ్యాక్సిన్లను గర్భవతులు, పాలిచ్చే తల్లులపై క్లినికల్ ట్రయల్స్ జరుగలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యేంత వరకు వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అంటూ దియా మిర్జా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే దియా మీర్జా గర్భవతిగా ఉన్నట్లు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు.
This is really important. Must read and also note that none of the vaccinations currently being used in India have been tested on pregnant and lactating mothers. My doctor says we cannot take these vaccines until required clinical trials have been done. https://t.co/eDtccY54Z1
— Dia Mirza (@deespeak) May 16, 2021
Comments
Please login to add a commentAdd a comment