Pregnant womens
-
నీళ్లోసుకుంటే ఈ మాత్రేసుకోవద్దు!
గర్భధారణ జరిగాక సాధారణంగా పారాసిటమాల్ వంటి మందులు తప్ప మహిళలకు ఎలాంటి మందులూ ఇవ్వరు. కొన్ని రకాల మందులైతే అస్సలు ఇవ్వకూడదు కూడా. కొన్ని మందులు తీసుకోవడం వల్ల గర్భంలోని పిండంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్త. అలాంటి మందులేవో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండేందుకు ఉపయోగపడేదే ఈ కథనం...గర్భవతులు వాడకూడని మందులేమిటో పోరబాటున వాడితే వచ్చే ప్రతికూల ప్రభావాలెలా ఉంటాయో తెలుసుకుందాం. యాంటీకన్వల్సెంట్స్ : ఫిట్స్ వ్యాధి ఉన్నవారిలో సీజర్స్ తగ్గడానికి వాడే మందులివి. కార్బమాజిపైన్, సోడియం వాల్్రపోయిక్ యాసిడ్, ఫెనీటోయిన్ వంటి అన్ని యాంటీకాన్వల్సెంట్ మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో చెవి, ముఖానికి సంబంధించిన ఎముకల అపసవ్యత, న్యూరల్ ట్యూబ్ లో΄ాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఫిట్స్ రావడంతో మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫిట్స్ కోసం ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు దాన్ని కేవలం ఒకే ఒక టాబ్లెట్‌కు పరిమితం చేసుకుని, ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకుని, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కా΄ాడుకుంటుంటే నిరభ్యంతరంగా గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కానీ తల్లి వాడే కొన్ని రకాల ఫిట్స్ మందులు పిండంపై దుష్ప్రభావం చూపవచ్చు. అలాంటప్పుడు బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా, గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ΄ాలెట్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) వంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఫిట్స్ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేలా మోతాదులు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ΄్లాన్ చేయాలి. యాంటిసైకోటిక్ : ఇవి మానసిక çసమస్యలకూ, మనసు నిలకడగా ఉండటానికి వాడతారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి రోజుల్లో ఇచ్చే లిథియమ్ వల్ల గుండెకు సంబంధించిన ఎబ్స్టైన్ అనామలీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మానసిక సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ΄్లానింగ్ చేసుకోకూడదు. యాంటీమైగ్రెయిన్ మందులు : ఎర్గోటమైన్, మెథీజరిజడ్ వంటి మందుల్ని తలనొప్పి తగ్గడానికి ఇస్తారు. వీటి వల్ల సమయానికి ముందే ప్రసవం అయి΄ోయే అవకాశాలెక్కువ. కాబట్టి మైగ్రేన్ మందులు వాడుతుంటే గైనకాలజిస్టుకు ఆ విషయం చె΄్పాలి. యాంటీ బయాటిక్స్ : ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వాడే ఈ మందులు బిడ్డలో అనేక దుష్ప్రభావాలు కలగజేయవచ్చు. ఉదా: టెట్రాసైక్లిన్స్ వల్ల దంతాల రంగుపోవడం, ఎముకల ఎదుగుదలకు అడ్డంకులు వంటి సమస్యలు రావచ్చు. సల్ఫోనమైడ్స్ అనే మందుల వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే కామెర్లూ, స్ట్రె΄్టోమైసిన్ వాడటం వల్ల చెవుడు వచ్చే అవకాశాలెక్కువ. యాంటీకోయాగ్యులెంట్స్ : రక్తం గడ్డకట్టడంలో లోపాలుంటే ఇచ్చే వార్‌ఫేరిన్ డైఫినాడైయాన్ గ్రూపుకు చెందిన ఈ మందుల వల్ల ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతిలో రక్తస్రావం, కంటి అపసవ్యతలు ఏర్పడటం, తల పెరగకుండా ఉండటం, ఫలితంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలెక్కువ. యాంటీ డయాబెటిక్ : మధుమేహానికి వాడే మందులైన క్లోరో్రపోమైడ్ వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే చిన్నారి తాలూకు రక్తంలో గ్లూకోజ్ తగ్గడం (హైపోగ్లైసీమియా) వంటి కండిషన్లు ఏర్పడవచ్చు. విటమిన్–ఎ అనలాగ్స్ : ఈ మందుల్ని మొటిమలు (యాక్నే) చికిత్సలో వాడతారు. ఎట్రటినేట్, ఐసోట్రెటినోయినిన్లాంటి మందులతో చెవులు చిన్నగా ఉండటం, గుండె సమస్య, మెదడులోకి నీరు చేరడం, అబార్షన్ కావడం, ముఖాకృతిలో తేడాలు రావడం వంటివి జరగవచ్చు. డయాగ్నస్టిక్ రేడియోలజీ : గర్భం ధరించిన తొలిరోజుల్లో ఎక్స్–రే తీయించిన కేసుల్లో... చిన్నారి పుట్టిన తొలి ఏళ్లలో లుకేమియా వంటి రక్త సంబంధిత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలెక్కువ. అందుకే గర్భవతులు రేడియేషన్‌కు ఎక్స్΄ోజ్ కావద్దంటూ ఎక్స్‌రే రూమ్‌ల ముందు స్పష్టంగా హెచ్చరిక రాసి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు వాడినప్పటికీ చిన్నారి మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. ఏ మందు ఎంత సురక్షితమో లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి గర్భవతులు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే వారు డాక్టర్‌ను తప్పక సంప్రదించాకే వాడాలని గుర్తుంచుకోండి. డాక్టర్లు సైతం ఆ మందుల అవసరాన్ని, బిడ్డపై పడే ప్రభావాల్ని జాగ్రత్తగా బేరీజు వేశాకే తల్లికి ప్రిస్క్రయిబ్ చేస్తారు. -
3 గంటల ముందే లైట్లార్పితే.. గర్భిణుల్లో మధుమేహానికి చెక్! కీలక విషయాలు
న్యూఢిల్లీ: గర్భిణులు పడుకోవడానికి కొద్ది గంటల ముందే ఇంట్లో లైట్లను పూర్తిగా ఆర్పేయడమో, బాగా తగ్గించడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల వెలుతురు కూడా ఈ ఆర్పేయాల్సిన లైట్ల జాబితాలోకే వస్తుంది! అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీ తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. నిద్రకు ముందు చాలాసేపు లైట్ల వెలుగులో గడిపితే గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం పడుతుందని అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మింజీ కిమ్ తెలిపారు. ‘‘741 మంది గర్భిణులపై చేసిన ప్రయోగంలో ఇది నిర్ధారణ అయింది. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్‌గా మార్చుకోవాలి’’ అని సూచించారు. నిద్రకు ముందు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తికడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుందని కూడా హెచ్చరించారు! -
పోలీసు ఉద్యోగాల భర్తీలో గర్భిణులకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పించే గడువును ఈనెల 28 వరకు పెంచారు. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళా అభ్యర్థుల్లో గర్భిణులు, బాలింతలకు ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరుకాకుండానే నేరుగా తుది రాత పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు దేహదారుఢ్య పరీక్షలను పూర్తి చేస్తామని రాతపూర్వకంగా అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అయితే తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ అండర్ టేకింగ్ ఇచ్చేందుకు గడువు జనవరి 31 వరకు మాత్రమే ఇచ్చింది. తుది గడువును ఈనెల 28కు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, ఇటీవలే డెలివరీ అయిన అభ్యర్థులకు ఒకసారి మినహాయింపుగా అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు చైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పార్ట్–2 దరఖాస్తును పూర్తి చేసిన అభ్యర్థులకే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో సూచించిన ఫార్మాట్లోనే అండర్ టేకింగ్ పత్రాలను పంపాలని, అలాగే వైద్య ధ్రువీకరణ పత్రాలను జత చేసి లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ఇన్వర్డ్ సెక్షన్లో అందజేయాలని సూచించారు. -
గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ‘కేసీఆర్ కిట్’ స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. అదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఆదిలాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ములుగులో సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్‌లో సబిత ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పుడు 1.25 లక్షల మంది గర్భిణులకు ఇది ఉపయోగపడనుందని అంచనా. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. రక్తహీనత నుంచి విముక్తి రక్తహీనత గర్భిణుల పాలిట శాపంగా మారుతోంది. దీనివల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్న ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో విజయవంతమైంది. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృ మరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని అమలు చేస్తోంది. అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 83 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిçÙన్ కిట్ల లక్ష్యం. ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.1,962 వెచ్చిస్తోంది. 13–27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్ చెకప్ సమయంలో ఒకసారి, 28–34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్ చెకప్ సమయంలో రెండోసారి కిట్‌ను ఇస్తారు. 9 జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాలు, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. తల్లీబిడ్డల సంరక్షణకు ఎక్కడా లేని పథకాల అమలు :హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ‘తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుంది. అందుకే తల్లీబిడ్డల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు’అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్.. పౌష్టికాహారాన్ని అందించి, తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనుందని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
ఏజెన్సీలో మరో 32 గర్భిణీ వసతి గృహాలు
సాక్షి, అమరావతి: కొండలు, కోనల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయాల్లో డోలీలు, మంచాలపై మోసుకెళ్లకుండా వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించి, ముందుగానే ఆస్పత్రులకు తరలించేందుకు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ వసతి గృహాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్–బీడబ్ల్యూహెచ్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి 45 ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనల మేరకు మరో 32 గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో మొత్తం వీటి సంఖ్య 77కు పెరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు తక్షణ వైద్య సేవలు అందించి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ వసతి గృహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో 1818 మారుమూల ప్రాంతాలున్నాయి. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేరులు తదితర మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గతంలో వైద్యం గగనమే అయ్యేది. దీంతో మరణాలూ అధికంగానే ఉండేవి. గర్భిణుల అవస్థలు చెప్పనలవి కాదు. సరైన వైద్యం అందక, ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులకు ఈ అవస్థలు తప్పించి, వారికి మంచి వైద్య సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఆ ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచేందుకు గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. గిరి రక్షక్ పేరుతో ఏర్పాటు చేయనున్న బైక్ అంబులెన్స్‌లు నెలలో 25 రోజులపాటు ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ఏఎన్ఎం దగ్గర్నుంచి మండల స్థాయి వైద్యాధికారి, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణులతోపాటు అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు చేపడుతుంటారు. ప్రతి గురువారం గ్రామ సచివాలయ బృందం అన్ని మారుమూల (డోలీపై ఆధారపడిన) ప్రాంతాలను సందర్శిస్తుంది. ప్రతి శనివారం (పలకరింపు) వైద్య బృందం వెళ్లి అక్కడి వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటారు. డోలీ మరణాల నివారణకు మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను డాక్టర్ నిర్ధారించిన ప్రసవ సమయానికి నెల రోజుల ముందుగానే సురక్షిత రవాణా వ్యవస్థ (108 అంబులెన్స్, ఫీడర్అంబులెన్స్, బైక్ అంబులెన్స్) ద్వారా బర్త్ వెయిటింగ్ హోమ్‌కు తరలిస్తారు. ఈ గృహాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు. నిత్యం పోషకాహారాన్ని, మందులను అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రాథమిక, సామాజిక, జనరల్ ఆసుపత్రులకు తరలిస్తారు. -
తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్... ఆందోళనలో శాస్త్రవేత్తలు
తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్‌ని గుర్తించింది ఇటాలియన్ పరిశోధక బృందం. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా ఈ పాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ పాల వల్ల ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరితగతిన పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించాం అన్నారు. అవన్నీ ల్యాబ్‌లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో... గర్భిణి మహిళ గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు సీ ఫుడ్ తీసుకునేటప్పుడూ, పాలు తీసుకునేటప్పుడూ కాస్త జాగురకతతో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల కంటే తల్లి పాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యుడు నోటార్స్టెషానో చెబుతున్నారు. అంతేగాదు కాలుష్యాన్ని నియంత్రించే చట్టాలను ప్రోత్సహించేలా రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అలాగాని పిల్లలకు బాటిల్ పాలను అలవాటు చేయడం మంచిద కాదని, పైగా దానివల్ల వారు మరింత ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరెక్ట్‌గా వెళ్లే ప్రమాదం ఎక్కువ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్‌లు, సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణి స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహలు, సూచనలు ఇస్తున్నారు. (చదవండి: 7 ఖండాలు కాదు ఏక ఖండమే..!) -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చిన్నారులకు మాత్రమే భోజనం వండి పెట్టేవారు. ఈ నెల 1 నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,389 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు 17,660, బాలింతలు 17,318, ఏడాదిలోపు పిల్లలు 16,732, మూడేళ్లలోపు చిన్నారులు 57,072, ఆరేళ్లలోపు వారు 48,233 మంది ఉన్నారు. వీరిలో రక్తహీనత నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. మెనూలో సమూల మార్పులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న సమయంలో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. భోజనం తర్వాత తల్లులకు 200 మి.లీ.పాలు, పిల్లలకు 100 మి.లీ. పాలు అందించాలని నిర్ణయించారు. నాణ్యమైన పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రంలో భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించడం చిన్నారుల ఎదుగుదలకు దోహద పడుతుంది. కరోనా సమయంలో నిలుపుదల చేసిన ఈ విధానం తిరిగి ఈ నెల 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. వేడి భోజనం అందించడం సంతోషదాయకం. – జి.గౌరి, గర్భిణి, కడప రోజూ గుడ్డు, పాలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పోషకాహారం అందిస్తుండటం సంతోషదాయకం. మాలాంటి వారికి ఎంతో ప్రయోజనకరం. మెనూలో రోజూ కోడిగుడ్డు, పాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, దానిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం హర్షించదగ్గ విషయం. –కె.శ్రుతి, బాలింత, కడప సద్వినియోగం చేసుకోవాలి గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నాం. దీనిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎంఎన్ రాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్, కడప -
లబ్ధిదారుల ఇంటికెళ్లి పలకరించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడమే కాదు.. వారి ఇళ్లకే వెళ్లి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పలకరించనున్నారు. పోషణ్ అభియాన్ 2.0 స్కీమ్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరగడం (విజిట్) లేదని పేర్కొంది. ఇకపై రోజుకు నాలుగు ఇళ్లకు తిరిగి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని కేంద్రం అదనపు మార్గదర్శకాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల యోగక్షేమాలు చూడడంతోపాటు వారి ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు. వారి ఇళ్లకే వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకోవడం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఎవరైనా రాకపోయినా, వారికి ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కనీసం ఒక గర్భిణి, ఓ బాలింత, రెండేళ్లలోపు వయసు గల ఇద్దరు పిల్లల ఇళ్లకు విజిట్‌కు వెళ్లాలి. రోజుకు నాలుగు ఇళ్ల చొప్పున నెలలో 25 రోజులపాటు వంద విజిట్లు పూర్తి చేయాలి. కనీసం 60 శాతం అయినా వాటిని పూర్తి చేయాలనే నిబంధన విధించారు. అలా చేయకపోతే ఇన్సెంటివ్‌లు ఇవ్వకూడదని కేంద్ర ఆదేశాల్లో పేర్కొంది. ఈ హోం విజిట్‌కు సంబంధించిన అంశాలను ఐసీడీఎస్‌ల పరిధిలోని అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనితోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల చేపట్టిన ‘గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్’నూ సమర్థవంతంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
అనంతపురం సెంట్రల్/ రాయదుర్గం: అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేవలం చిన్నారులకే భోజనం వడ్డిస్తున్నారు. శుక్రవారం నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,079 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గర్భిణులు 21,480 మంది, బాలింతలు 19,870, ఏడాది లోపు పిల్లలు 20,728, ఏడాది నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,960 , మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,140 మంది ఉన్నారు. రక్తహీనత నివారించడం కోసం వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారం అందిస్తున్నారు. నాణ్యమైన భోజనం సరఫరా.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రభ్తుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న సమయంలో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు కూడా రుచికరమైన భోజనం అందించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు చేరాయి. పాల కొరత ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భోజనం తర్వాత తల్లులకు 200 మిల్లీలీటర్లు పాలు, పిల్లలకు 100 ఎంఎల్ పాలు తప్పనిసరిగా అందించాలని నిర్ణయించారు. -
వారికి స్వేచ్ఛ లేదా?
దాదాపు అర్ధశతాబ్దం క్రితం అమెరికా అంతటా మహిళలకు దక్కిన వరం అది. 1973లో ‘రో వర్సెస్ వేడ్’ కేసులో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ఆ దేశమంతటా గర్భస్రావం చట్టబద్ధమైంది. అలా 22 నుంచి 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవడానికి దక్కిన హక్కు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయంతో మహిళలకు దూరమవుతోంది. ఈ తిరోగమన చర్యతో లావోస్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, ఇరాక్‌ల దోవలో గర్భస్రావాన్ని చట్టవిరుద్ధం చేసిన దేశాల జాబితాలో అమెరికా చేరింది. ఇప్పుడిక అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గర్భస్రావ హక్కుపై సొంత నిర్ణయాలు తీసుకొనే వీలు చిక్కింది. జూన్ 24న కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం స్త్రీ స్వేచ్ఛనూ, సొంత శరీరంపై స్త్రీలకున్న సహజమైన హక్కునూ కాలరాయడమే అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చ. గర్భస్రావాలపై నిషేధం లైంగిక సమానత్వానికీ, మహిళల మానవహక్కులకూ గొడ్డలిపెట్టు అని ఐరాస సహా అంతర్జాతీయ మహిళా సంఘాలు ఎలుగెత్తుతున్నాయి. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ‘కోర్టు తాజా నిర్ణయం దురదృష్టకరం, ఇది దేశానికి దుర్దినం’ అన్నారంటే విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా కోర్టు 6–3 మెజారిటీతో ఇచ్చిన ఆదేశాన్ని ఆసరాగా చేసుకొని, అక్కడ 50 రాష్ట్రాల్లో కనీసం 26 రాష్ట్రాల్లో గర్భస్రావంపై నిషేధాలొచ్చే సూచనలున్నాయి. రిపబ్లికన్ల హయాంలోని రాష్ట్రాలు తక్షణమే గర్భస్రావాన్ని నిషేధించడమో, లేదంటే బోలెడన్ని ఆంక్షలు విధించడమో చేయనున్నాయి. మరోపక్క డెమోక్రాట్ల సారథ్యంలోని పలు రాష్ట్రాలేమో మహిళల గర్భస్రావ హక్కును కాపాడే చర్యలకు సిద్ధమవుతున్నాయి. వెరసి, అమెరికాలో ఆ యా రాష్ట్రాలలోని పాలకపార్టీని బట్టి స్త్రీ స్వేచ్ఛ ఉండే పరిస్థితి వచ్చిందన్న మాట. అయితే, కొత్త నియంత్రణల దెబ్బతో ఇక ఎవరూ గర్భ స్రావం చేయించుకోకుండా ఆగిపోతారని అనుకుంటే అమాయకత్వమే. దొంగచాటు గర్భస్రావాలు పెరిగి, గర్భిణుల ప్రాణాలకే ప్రమాదం పెరిగే అవకాశాలెక్కువ. ఐరాస ప్రతినిధుల అభిప్రాయమూ అదే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గర్భస్రావాల్లో నూటికి 45 గర్భస్రావాలు సురక్షితమైనవి కావు. అవి గర్భిణుల మరణానికి దారి తీస్తున్నాయని సాక్షాత్తూ ఐరాస పాపులేషన్ ఫండ్ లెక్క. నిజానికి, కోర్టు తాజా నిర్ణయం తాలూకు ముసాయిదా మే నెలలోనే బయటకు పొక్కింది. అమెరికన్ స్త్రీలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓ ప్రాథమికమైన హక్కుకు ముప్పు వాటిల్లనుందని అప్పటి నుంచీ చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కోర్టు నిర్ణయం అధికారికంగా వచ్చేసింది గనక, అటు రాజకీయంగానూ, ఇటు ప్రభుత్వ విధానపరంగానూ బైడెన్ వ్యూహాలు పరీక్షను ఎదుర్కోక తప్పదు. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనను రాజకీయంగా ఉపయోగించుకొని, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బైడెన్, ఇతర డెమోక్రాట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గర్భస్రావ హక్కు కల్పించేలా చేయడం కష్టమే కానీ, వివిధ రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయాలు సాధిస్తే గనక రిపబ్లికన్ల గర్భస్రావ నిషేధ యత్నాలను కొంత నియంత్రించవచ్చు. బైడెన్ వర్గం ఆ మాటే ప్రచారంలో పెట్టనుంది. కానీ, మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికన్ పార్లమెంటులోని రెండు సభల్లోనూ రిపబ్లికన్లదే మెజారిటీ కావచ్చని ఓ అంచనా. ఛాందస సంప్రదాయవాది అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ అధ్యక్షులైనా ఆశ్చర్యం లేదని వార్త. అంటే, గర్భస్రావమే కాదు... ఇంకా అనేక అంశాల్లో అమెరికా పాత కాలపు దురభిప్రాయాల్లోకి తిరోగమిస్తుందా? గర్భస్రావ హక్కుపై పోరు అమెరికాలో ఓ భావోద్వేగభరిత సైద్ధాంతిక యుద్ధం. కొన్ని దశాబ్దాలుగా కన్జర్వేటివ్‌లు గర్భస్రావ హక్కు నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగతావాళ్ళు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. తీరా కోర్టులో కన్జర్వేటివ్‌ల ఆధిక్యంతో ఇప్పుడు గర్భస్రావ హక్కును తొలగించేందుకు సందు చిక్కింది. ఇదంతా ఘనత వహించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చలవే. ఎందుకంటే, ఆయనే తన హయాంలో ముగ్గురు కన్జర్వేటివ్ సుప్రీమ్ కోర్టు జడ్జీలను నియమించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ ముగ్గురూ తాజాగా గర్భస్రావ హక్కును కొట్టిపారేసేందుకు ఓటేశారట. కేవలం ఆరే ఆరుగురు జడ్జీలు మొత్తం అమెరికన్ స్త్రీ జాతి శారీరక స్వేచ్ఛపై సమ్మెట దెబ్బ వేసి, వారి తలరాతను మార్చేయడం అత్యంత విషాదం. అమానవీయం. లైంగిక, పునరుత్పాదక ఆరోగ్యం, హక్కులనేవి ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ సమానత్వానికీ, స్వేచ్ఛకూ, ఎంపిక హక్కుకూ సంబంధించిన అంశాలు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే అమెరికాలోనే ఆ హక్కులపై నియంత్రణ పెట్టారంటే ఏమనుకోవాలి! ఎవరైనా సరే తుపాకీలు యథేచ్ఛగా కొనుక్కోవడానికి అవకాశమిస్తున్న అగ్రరాజ్యం... తీరా గర్భాన్ని కొనసాగించాలా, వద్దా అని నిర్ణయించుకొనే హక్కు మాత్రం స్త్రీలకు లేదనడమే విరోధాభాస. ఇంకా చెప్పాలంటే, ఒక దేశం ఆర్థిక పురోగమించినంత మాత్రాన ఆ దేశంలో పౌర స్వేచ్ఛ, హక్కులు పరిరక్షితమవుతాయని అనుకుంటే పొరపాటే అని మరోమారు ఋజువైంది. ఆదర్శంగా నిలవాల్సిన భారీ ప్రజాస్వామ్య దేశంలోని వ్యవహారం రేపు మిగతా ప్రపంచమూ ఆదర్శంగా తీసుకుంటే, అది మహిళలకు జరిగే మహాపచారం. అందుకే, పాశ్చాత్య ప్రపంచం తిరోగమిస్తుంటే, మన దేశం మాత్రం గర్భస్రావం, అద్దె గర్భం, బాల్యవివాహాల నిరోధం లాంటి అంశాల్లో మెరుగైన చట్టాలతో పురోగమిస్తోందని కేంద్ర పాలకులు జబ్బలు చరుచుకోవడం అర్థం చేసుకోదగినదే! -
గాలి సరిపోక.. ఉక్క తట్టుకోలేక..
ఖమ్మం : వేసవిలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్న సమయాల్లో జిల్లాలోని జనం ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యాన ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రి మాతా,శిశు కేంద్రంలోని ప్రసూతి వార్డులో బాలింతలు, చిన్నారులు ఉక్కపోతకు తల్లడిల్లిపోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఫ్యాన్ల గాలి సరిపోకపోవడంతో బాలింతల ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తీసుకొచ్చి ఇదిగో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. కొందరు విద్యుత్‌తో నడిచేవి తీసుకొస్తే.. మరికొందరు సోలార్ పవర్, బ్యాటరీలతో నడిచే ఫ్యాన్లను తీసుకొచ్చి సేదదీరుతున్నారు. -
AP: ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’లు సిద్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలు.. మొత్తం 500 వాహనాలను విజయవాడలోని సిద్ధార్థ్ధ వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 1న విజయవాడ బెంజి సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ వీటిని ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులో ఈ వాహనాలను వరుస సంఖ్యలో ఉంచి, బెంజిసర్కిల్ మీదుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను అరబిందో ఫార్మా సంస్థ చూడనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.24 కోట్లు చెల్లిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి మూడు లక్షల దాకా ప్రసవాలు జరగనున్నాయి. ఈ వాహనాల ద్వారా గర్భిణులను ఉచితంగా ఆస్పత్రిలో చేర్చి.. ప్రసవం జరిగాక బాలింతలను తిరిగి ఉచితంగా ఇంటికి చేరుస్తారు. కాగా, డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్థానిక క్యాంప్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. ప్రతి ఐదు వాహనాలకు ఓ వీఆర్వో, ప్రతి జిల్లాకు సంబంధించిన వాహనాలను ఓ తహశీల్దార్ పర్యవేక్షించేలా ఉత్తర్వులివ్వాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. -
108లో ఇద్దరు గర్భిణులకు ప్రసవం
కొయ్యూరు/దేవరాపల్లి: అత్యవసర వైద్య సేవలందిస్తూ 108 అంబులెన్స్‌లు అపర సంజీవినిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులకు మరో జన్మ అందించడమే కాక పండంటి బిడ్డను చేతిలో పెడుతున్నాయి. విశాఖ జిల్లాలో ఆదివారం ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లికి చెందిన గిరిజన మహిళ తాంబేలు లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108లో రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఇక్కడ నుంచి నర్సీపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు. 108 సిబ్బంది లక్ష్మిని నర్సీపట్నం తీసుకెళ్తుండగా కృష్ణాదేవిపేట దాటిన తరువాత నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు వాహనంలోనే ప్రసవం చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న గొలుగొండ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ కె.వరప్రసాద్‌లను అందరూ అభినందించారు. అలాగే దేవరాపల్లి మండలం మామిడిపల్లికి చెందిన నెక్కెళ్ల రామలక్ష్మి 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. ఆమెకు ఆదివారం తెల్లవారుజాము 5 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. కె.కోటపాడుకు చెందిన 108 సిబ్బంది మామిడిపల్లి కి చేరుకొని కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ కాన్పు చేశారు. రామలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ప్రథమ చికిత్స అనంతరం తల్లీబిడ్డను కె.కోటపాడు సీహెచ్‌సీలో చేర్చారు. -
గర్భిణులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకున్న గర్భిణికి శిశు సంరక్షణ కిట్ పేరిట 2016 నుంచి 2019 వరకూ రూ.695 విలువ చేసే కిట్ ఇచ్చేవారని, ఇప్పుడు గర్భిణికి ప్రసవం అనంతరం ఆసరా కింద భారీగా నగదు ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రసవం అయితే రూ.5 వేలు, సిజేరియన్ అయితే రూ.3 వేలను 24 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆ మొత్తం నుంచే శిశువుల సంరక్షణకు కావాల్సినవి గర్భిణులే కొనుక్కుంటున్నారన్నారు. ‘శిశు సంరక్షణ కిట్లకు కటకట’ శీర్షికన కిట్ల పంపిణీని నిలిపివేసినట్టు ఓ పత్రిక రాసిందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కేవలం శిశు సంరక్షణ కిట్ మాత్రమే ఇచ్చి.. ఎలాంటి నగదు ఇచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు గర్భిణికి రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. ప్రసవం కాగానే ప్రతి ఒక్కరికీ నగదు జమ అవుతోందన్నారు. 46.79 శాతం మందికి రెండు డోసులూ పూర్తి రాష్ట్రంలో ఇప్పటివరకూ 46.79 శాతం మందికి కోవిడ్ టీకా రెండు డోసులూ పూర్తయినట్టు సింఘాల్ చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన 3.47 కోట్ల మంది టీకాకు అర్హులని గతంలో తాము అంచనా వేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్లుగా సమాచారం పంపించిందన్నారు. దీన్ని బట్టి ఇప్పటివరకూ 46.79% మందికి రెండు డోసులు టీకా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో 1,84,90,379 మందికి రెండు డోసులు వేశామన్నారు. 1,32,65,148 మందికి తొలి డోసు పూర్తయిందని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం చాలా ముందుందని తెలిపారు. కరోనా కేసులు తగ్గినా 104 కాల్‌సెంటర్‌ను కొనసాగిస్తున్నామని, ఎవరు ఫోన్ చేసినా సమాచారం వస్తుందన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు మొదలుకొని కొత్త మెడికల్ కాలేజీల వరకూ నిర్మాణం జరుగుతున్నాయని, ప్రణాళికాబద్ధంగా నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంచామని, గత 6 నెలల్లోనే రూ.1,013 కోట్లను ఆరోగ్యశ్రీ కింద వ్యయం చేశామన్నారు. -
రిమ్స్‌లో కాన్పు కష్టాలు
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అనస్తీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం కోసం చేరిన గర్భిణులు పురుటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 58 మంది గర్భిణులు ఉన్నారు. శుక్రవారం అనస్తీషియా (మత్తు) వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయాయి. అత్యవసరంగా ఏడుగురికి కాన్పులు జరగాల్సి ఉన్నా వైద్యులు స్పందించలేదు. దీంతో ముగ్గురిని వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో నలుగురు గర్భిణులు నొప్పులతో అవస్థలు పడుతూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. కాగా, దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డైరెక్టర్ కరుణాకర్‌ను సంప్రదించగా, ముగ్గురు మత్తు వైద్యులకు గాను ఇద్దరు అనారోగ్య కారణాలవల్ల సెలవులో ఉన్నారని, మరో వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్నారని తెలిపారు. పెద్ద ప్రాణానికి ఏమవుతుందో: షౌకత్ మాది నార్నూర్ మండల కేంద్రం. గర్భిణి అయిన నా భార్య హసీనాకు కడుపు నొప్పి రావడంతో గురువారం రిమ్స్‌కు తీసుకొచ్చాను. ఆస్పత్రిలో స్కానింగ్ చేయించాము. కడుపులోనే పిండం చనిపోయిందని వైద్యులు చెప్పారు. చనిపోయిన పిండాన్ని డాక్టర్లు ఆపరేషన్ చేసి ఇంకా బయటకు తీయలేదు. ఎప్పుడు ఆపరేషన్ చేస్తారని అడిగితే మత్తు డాక్టర్ ఎప్పుడు వస్తే అప్పుడే అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో పెద్ద ప్రాణానికి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. -
గర్భిణులకు వ్యాక్సిన్‌లో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గర్భిణులకు జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 20 లక్షల మంది తల్లులకు (ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు) వ్యాక్సిన్ వేశారు. అంతేకాదు రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. జూలై 30 రాత్రికి కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, 34,228 మందికి వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్ నోడల్ అధికారి చెప్పారు. -
ప్రసవానంతరం తల్లీబిడ్డలు సురక్షితంగా ఇంటికి..
సాక్షి, అమరావతి: గర్భిణులకు ఉచిత వైద్యసదుపాయం కల్పించడమేగాక ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటి వద్దకు పంపించే సేవలను కూడా ప్రభుత్వం సమర్థంగా నిర్వర్తిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమయ్యే మహిళల్లో ఎక్కువమంది ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకున్నారు. 2020–21 సంవత్సరంలో 2,20,731 మంది బాలింతలు అంటే మొత్తం డెలివరీల్లో 77.83 శాతం మంది తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. ప్రతి ఆస్పత్రిలోను బాలింతను డిశ్చార్జి చేసే సమయానికి వైద్యులే వాహనాలను సిద్ధం చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. ప్రసవానంతరం ప్రభుత్వం ఇచ్చే పోషకాహారాన్ని 2.66 లక్షల మంది బాలింతలు వినియోగించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులుగా నమోదు చేసుకుని ఉచిత వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు చేయించుకున్న వారు 2,67,069 మంది ఉన్నారు. ప్రసవానికి వెళ్లేందుకు ఉచిత రవాణా అంటే 108 వాహనాలను 48.45 శాతం మందే ఉపయోగించుకున్నారు. దీన్ని మరింతగా పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పురిటినొప్పుల సమయంలో 108కు కాల్చేస్తే 15 నిమిషాల్లోనే ఇంటిదగ్గరకు వస్తుందని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయ్యే మహిళలకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపించాలని ట్రస్ట్ సీఈవో అన్ని ఆస్పత్రులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రసవాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని కూడా ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. -
ఊరికో ‘పోషకాహార నిపుణురాలు’
సాక్షి, అమరావతి: పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచేలా వారిలో ఓ మహిళను ‘పౌష్టికాహార నిఫుణురాలి’గా ఎంపిక చేస్తారు. ఇలా గ్రామ సమైఖ్య (వీవో)కు ఒకరి చొప్పున నియమిస్తారు. ఆ పౌష్టికాహార నిపుణురాలి ద్వారా ఆ గ్రామ సమైఖ్య పరిధిలోని అన్ని పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలందరికీ పౌష్టికాహారం అవసరం ఏమిటి, పౌష్టికాహారం సమకూరాలంటే ఏ ఆహారం తీసుకోవాలి, వాటి తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో గ్రామ పౌష్టికాహార నిపుణురాలితో పాటు ఏఎన్ఎం కూడా పాల్గొంటారు. పొదుపు సంఘాల వారీగా మహిళలు ప్రతినెలా నిర్వహించుకునే సంఘ సమావేశాల్లో పోషకార నిపుణురాలు, ఏఎన్ఎం పాల్గొని పౌష్టికాహారంపై కొద్దిసేపు అవగాహన కలిగిస్తారు. గ్రామంలోని గర్భిణులు, చిన్న పిల్లల తల్లులతో పౌష్టికాహార నిపుణురాలు, ఏఎన్ఎం ప్రతి నెలా 5, 25వ తేదీల్లో గ్రామ సమైఖ్య ద్వారా సమావేశపరిచి వేర్వేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలకు ఒక విడత ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వారికి పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా గ్రామంలో ప్రతి కుటుంబానికి దీనిపై అవగాహన పెంచవచ్చని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉండే వాటితోనే.. గ్రామాల్లో అతి తక్కువ ధరకు దొరికే.. అందరికీ అందుబాటులో ఉండే వివిధ రకాల ఆహార దినుసుల్లో వేటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. ఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి.. వాటివల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చన్న అంశాలపై గ్రామాల్లోని మహిళలందరికీ తెలియజేస్తారు. విటమిన్లు, పోషకాలు గల కూరగాయలతో పాటు సజ్జలు, రాగులు వంటి వాటిని వినియోగించాల్సిన ఆవశ్యకతను చెబుతారు. వీలును బట్టి వాటిని ఇంటి పెరట్లోనే పండించుకునేలా ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో సంబంధిత విత్తనాలు, మొక్కలను అందించేలా తోడ్పాటునిస్తారు. గర్భిణికి తొమ్మిది నెలలు, ఆ తర్వాత 6 నెలల పాటు బాలింతగా, ఆ తర్వాత పసి పిల్లల తల్లిగా మొత్తం 1,000 రోజుల కాలంలో తల్లీ, బిడ్డ తొలి రెండున్నర ఏళ్ల కాలంలో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్నది ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు చేపడతారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని ఒకే విడతలో అమలు చేసేలా చర్యలు చేపడతారు. అయితే పౌష్టికాహారం తక్కువ తీసుకుంటున్నట్టు నిర్ధారించిన 218 మండలాల్లో ఫలితాల ప్రాతిపదికన ప్రత్యేకంగా దృష్టి పెడతారు. తొలి ఏడాది 218 మండలాల్లో.. అందులోనూ ప్రత్యేకించి 52 మండలాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. మరుసటి ఏడాది మరో వంద మండలాల్లో, మూడో ఏడాది మిగిలిన మండలాల్లో కార్యక్రమం ఫలితాల ప్రాతిపదికన ఫోకస్డ్గా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
ప్రెగ్నెన్సీ మహిళలు వాక్సిన్ తీసుకోవచ్చా?, బాలీవుడ్ భామ క్లారిటీ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. మొదట్లో వ్యాక్సిన్‌పై అపోహలు వచ్చినప్పటికీ ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. ప్రజలు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీనీ, క్రీడా ప్రముఖులు వరుసగా వాక్సీన్ తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా ట్వీటర్ ద్వారా వ్యాక్సిన్ గురించి ఓ ఆసక్తికర సమాచారాన్ని అందించింది. గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. విదేశాల్లో తీసుకుంటున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం ఇంత వరకు గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దియా మీర్జా ట్విటర్ వేదికగా తనకు తెలిసిన సమాచారాన్ని అందించారు. గర్బవతులు వ్యాక్సిన్ తీసుకోకూడదని ఆమె సూచించారు. ప్రెగ్నెంట్స్ కాకుండా పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని కోరారు. ప్రెగ్నెంట్, పాలిచ్చే మాతృమూర్తులకు చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న వ్యాక్సిన్లను గర్భవతులు, పాలిచ్చే తల్లులపై క్లినికల్ ట్రయల్స్ జరుగలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యేంత వరకు వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అంటూ దియా మిర్జా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే దియా మీర్జా గర్భవతిగా ఉన్నట్లు ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. This is really important. Must read and also note that none of the vaccinations currently being used in India have been tested on pregnant and lactating mothers. My doctor says we cannot take these vaccines until required clinical trials have been done. https://t.co/eDtccY54Z1 — Dia Mirza (@deespeak) May 16, 2021 -
అమ్మతనానికి ఎంత కష్టం!
సాక్షి, సిటీబ్యూరో: మాతృత్వాన్ని ఆస్వాదించే అరుదైన క్షణాల కోసం నిండు గర్భిణులు కంటున్న కలలను కరోనా మహమ్మారి చిదిమేస్తోంది. చివరికి తల్లి కాకుండానే మృత్యువు కబళిస్తోంది. ఫస్ట్‌వేవ్‌లో వందల మందికి పురుడు పోసి.. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సెకండ్ వేవ్‌లో మాత్రం కనీస రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా పలువురు గర్భిణులు మాతృత్వపు మధురిమల్ని అనుభవించకుండానే కన్నుమూస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 18 మంది గర్భిణులు కరోనా కారణంగా మృతి చెందగా.. తాజాగా శుక్రవారం కోవిడ్ అనుమానంతో పలు ఆస్పత్రుల్లో అడ్మిషన్ దొరక్క మల్లాపూర్‌కు చెందిన నిండుచూలాలు పావని (22) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహమ్మారి కోరల్లో చిక్కుకుని.. వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. సుమారు లక్షన్నర మంది జ్వర పీడితులున్నట్లు గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 50 వేల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే కోవిడ్ నిర్ధారణ అయినవారు 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు గర్భిణులకు నెలవారీ పరీక్షలు నిర్వహించిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆస్పత్రులు ప్రస్తుతం కోవిడ్ కేంద్రాలుగా మారాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షలతో పాటు టీకాల కార్యక్రమంతో బిజీగా మారుతున్నాయి. నెలవారీ పరీక్షలకు వచ్చే గర్భిణులు వైరస్ బారిన పడుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,160 మంది గర్భిణులు వైరస్ బారినపడి గాంధీలో చేరగా...ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే 15 వరకు 299 మంది గర్భిణులు వైరస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 18 మంది మృతి చెందడం కలవరపరుస్తోంది. ప్రస్తుతం గాంధీలో 45 మంది.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నాన్‌కోవిడ్ గర్భిణులకు సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, నిలోఫర్ సహా పలు ఏరియా ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా.. కోవిడ్ బారిన పడిన గర్భిణులకు మాత్రం గాంధీలో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క ఆస్పత్రిలోనే 45 మంది గర్భిణులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది డెలివరీలు జరుగుతున్నాయి. కేవలం 45 రోజు ల్లోనే 299 మంది గర్భిణులు కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. వీరే కాకుండా సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత కోవిడ్ నిర్ధారణ అయిన 16 మంది ఆ తర్వాత చికిత్స కోసం గాం«దీలో గైనకాలజీ వార్డులో చేరి వైరస్ నుంచి బయటపడ్డారు. గర్భిణులకు ప్రత్యేకంగా 95 పడకలు.. కరోనా వైరస్ బారిన పడిన గర్భిణులకు చికిత్సలు అందించేందుకు గాంధీ గైనకాలజీ విభాగంలో 95 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. కోవిడ్ నిర్ధారణ అయిన గర్భిణులంతా ప్రసవం కోసం ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది నుంచి పదిహేను డెలివరీలు చేస్తున్నాం. పది సహజ ప్రసవాలకు పట్టే సమయం.. ఒక్క కోవిడ్ డెలివరీకి పడుతుంది. ఫలితంగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగెత్తవద్దు. గాంధీ ఆస్పత్రికి రావాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించబోం. – డాక్టర్ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆస్పత్రి -
గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలి?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో కరోనా సోకిన ఓ మహిళా పీడియాట్రియన్ చనిపోయారు. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశాక ఆమె మరణించారు. తాజాగా జరిగిన ఈ సంఘటన గర్భవతులకు కోవిడ్ టీకా ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. మరోవైపు టీకా వేసుకోవడం వల్ల గర్భవతులకు ఎలాంటి నష్టం జరగదని ఇటీవల వెల్లడైన ఓ పరిశోధన స్పష్టం చేసింది. గర్భవతులకు కరోనా వైరస్ సోకడం ద్వారా వారి గర్భంలోని ప్లాసెంటా (మాయ)పై దుష్ప్రభావం చూపుతున్నట్లు గతేడాది మేలో ఓ అధ్యయనంలో తేలింది. మాయ ప్రాధాన్యం కలిగిన ఈ మాయకు వైరస్ నష్టపరుస్తుందన్న విషయం తెలిసింది. అంటే కరోనా సోకిన వారిలో అత్యంత రిస్క్ ఉన్న వారు గర్భిణులే అని చెప్పొచ్చు. మరి ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో.. గత ఏప్రిల్‌లో అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఓ పరిశోధన ప్రచురితమైంది. వ్యాక్సినేషన్ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలి్చంది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ పరిశోధనతో గర్భిణులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులు, వ్యాక్సిన్ అపోహలను కేర్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డా.కావ్య ప్రియ వజరాల నివృత్తి చేశారు. ఫస్ట్‌వేవ్ అనుభవాలే స్ఫూర్తి.. కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో పాజిటివ్ వచ్చి డెలివ రీ అయిన మహిళలకు పుట్టిన పిల్లల్లో ఎలాంటి అవయవ లోపం కని్పంచలేదు. పుట్టిన శిశువుల్లో యాం టీబాడీలు కూడా కని్పంచాయి. అంతేకాకుండా యూకే, అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇన్‌ఫెరి్టలిటీ, సీడీసీ, ఫాగ్సీ గైడ్‌లైన్స్ కూడా గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే భారత్‌లో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అయినా కూడా టీకా లభ్యతను బట్టి కాబోయే తల్లులు కోరుకుంటే ఇవ్వొచ్చు. గర్భం దాలి్చన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిది. అయినా పరిస్థితులను బట్టి వైరస్ విజృంభణ స్థాయిని బట్టి ఏ నెలలోనైనా ఇవ్వొచ్చు. జ్వరం వచి్చనా.. వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో కొందరిలో జ్వరం వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది సాధారణ వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన మాత్రమే. కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే అందరికీ ఇచి్చనట్లే గర్భిణులకు కూడా పారాసిటమాల్ ఇస్తే సరిపోతుంది. నీరు ఎక్కువ తాగాలని సూచించాలి. ఫ్లూ వ్యాక్సిన్‌తో పాటు కలపకూడదు.. తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని గర్భం దాలి్చన తర్వాత సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తుంటా రు. కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే.. ఒకేసారి ఈ రెండూ ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడానికి, కోవిడ్ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. ప్రసవం తర్వాత కూడా టీకా తీసుకోవచ్చు. c -
Corona Vaccine: గర్భంలోని మాయకు నష్టం లేదు
న్యూఢిల్లీ: కరోనా టీకాపై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రధానంగా గర్భిణులు ఈ టీకా తీసుకోవచ్చా? లేదా? అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌తో గర్భానికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. గర్భంలోని మాయకు (ప్లాసెంటా) ఏమాత్రం ఇబ్బంది ఉండదని, అనుమానాలు అక్కర్లేదని వెల్లడించింది. ఈ వివరాలను అబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. ‘ప్లాసెంటా అనేది విమానంలోని బ్లాక్‌బాక్స్ లాంటిది. గర్భంలో ఏవైనా పొరపాట్లు జరిగితే మాయలో మార్పులను గమనించవచ్చు. తద్వారా అసలేం జరిగిందో కనిపెట్టవచ్చు’ అని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ ఫీన్‌బర్గ్ స్కూల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫ్రీ గోల్ట్‌స్టీన్ చెప్పారు. కోవిడ్ టీకా ప్లాసెంటాను దెబ్బతీయదని అన్నారు. గర్భిణులు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించారు. తమ అధ్యయనం గర్భిణుల్లో కరోనా వ్యాక్సిన్ల పట్ల భయాందోళనలను దూరం చేస్తుందని భావిస్తున్నట్లు పరిశోధకుడు ఎమిలీ మిల్లర్ చెప్పారు. అధ్యయనంలో భాగంగా 84 మంది కరోనా టీకా (మోడెర్నా లేదా ఫైజర్ టీకా) తీసుకున్న గర్భిణులు, 116 మంది టీకా కోసం తీసుకోని గర్భిణుల్లోని ప్లాసెంటాను పరిశీలించారు. టీకా తీసుకున్న గర్భిణుల్లో ప్రతిరక్షకాలు (యాంటీ బాడీలు) వృద్ధి చెంది, మాయలోని పిండానికి కూడా బదిలీ అయినట్లు గుర్తించారు. అంటే కరోనా టీకాతో మాయలోని పిండానికి కూడా పూర్తి రక్షణ కలుగుతున్నట్లు నిర్ణయానికొచ్చారు. ఇక గర్భంతో ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకితే తల్లికి, గర్భంలోని బిడ్డకు మధ్య అసా«ధారణంగా రక్తప్రసారం జరుగుతున్నట్లు గమనించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందితే, రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తేల్చారు. కరోనా వ్యాక్సిన్‌తో తల్లికి, బిడ్డకు.. ఇద్దరికీ రక్షణే. సురక్షితమైన గర్భానికి వ్యాక్సిన్ దోహదపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. (చదవండి: మీ వద్ద కరోనా మందులు ఉన్నాయా.. మేము తీసుకుంటాం!) -
వలంటీర్లకు వందనం!
బొండపల్లి (గజపతినగరం): పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని స్వయంగా వలంటీర్లే డోలీలో 7 కి.మీ. మోసుకుంటూ 108 వాహనం వరకు తీసుకువచ్చిన ఘటన ఇది. నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన వలంటీర్ల పనితనానికి నిదర్శనమిది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గొల్లుపాలెం పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన ఏర్రోడ్ల పాలేనికి చెందిన గిరిజన మహిళ పంగి జానకమ్మకు శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె భర్త కామేశ్ 108కి ఫోన్ చేయగా వాహనం వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి గంధవరపు కృష్ణ వెంటనే స్పందించి తన ద్విచక్ర వాహనాన్ని గ్రామానికి పంపించగా గర్భిణి దానిపై కూర్చోలేకపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు శ్రీహర్ష, బాలాజీ డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లుపాలెం గ్రామానికి నడకదారిన మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేవరకూ ఏఎన్ఎం మమతావల్లి, ఆశ కార్యకర్త గర్భిణికి వెన్నంటే ఉండి సేవలు అందించారు. వారందరి సేవా భావానికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఏటా ప్రసవం.. అమ్మకు శాపం
వాళ్లకి ఆడ పిల్లలంటే చిన్నచూపు. మగబిడ్డ కోసం ఎంతమంది ఆడపిల్లల్ని అయినా కనేలా ఒత్తిడి చేస్తుంటారు. తొమ్మిది కాన్పుల వరకు మగబిడ్డ కోసం చూడటం.. అప్పటికీ పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమవడం మగవారికి సర్వసాధారణం. ప్రసవం కోసం గర్భిణుల్ని ఆస్పత్రి గడప తొక్కనివ్వవు వారి కట్టుబాట్లు. గత్యంతరం లేక ఇంట్లోనే ప్రసవాలతో మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా వెనుకబాటు తనం.. నిరక్షరాస్యత.. అధిక సంతానం.. అవగాహనా రాహిత్యం.. మూఢ నమ్మకాలు వెరసి ఆ పల్లెల బతుకు చిత్రాన్ని దయనీయంగా మార్చింది. దీనివల్ల ఎన్నెన్నో కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడున్నాయి. బుక్కెడు బువ్వ కోసం వలస బాట పడుతున్నాయి. ఆరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల తీర్చే జల వనరుల రాజధాని.. శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి పుణ్య క్షేత్రాలు గల ఆధ్యాత్మిక భూమి కర్నూలు పల్లెల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కౌతాళం మండలం హల్వి గ్రామానికి చెందిన ఈమె పేరు లలితమ్మ (వృత్తంలో). ముత్తన్న అనే వ్యక్తిని వివాహమాడింది. ఈమెకు 8 మంది ఆడపిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదని ప్రశ్నించగా.. ‘మగబిడ్డ కోసమయ్యా!’ అని బదులిచ్చింది. మద్యానికి బానిసైన ముత్తన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భారం లలితమ్మపైనే పడింది. అంతమంది పిల్లల్ని కంటే కుటుంబాన్ని పోషించడం కష్టం కాదా అని అడిగితే.. ‘ఏమో అయ్యా! సెప్పేవారెవరూ లేకపోతిరి. మాకు సదువు రాదు. అంతే!’ అంది. ఇదే మండలంలోని మరిలి గ్రామానికి చెందిన మరియమ్మకు ఏడుగురు ఆడ పిల్లలు. జమ్మాలదిన్నెకు చెందిన హైమవతికి నలుగురు ఆడ బిడ్డలు కాగా.. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అదే గ్రామంలోని శ్రీదేవికి ఐదుగురు ఆడబిడ్డలు, ముచ్చుగిరికి చెందిన మంగమ్మకు ఏకంగా 10 మంది సంతానం. వారిలో 9 మంది ఆడబిడ్డలే. ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి కుటుంబాలు భారీగానే ఉన్నాయి. సాక్షి ప్రతినిధి/కర్నూలు : తొలి కాన్పునకు పుట్టింటికి తీసుకెళ్లడం సార్వసాధారణం. కానీ.. కోసిగి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు మండలాలతో పాటు సమీపంలోని చాలా గ్రామాల్లో మహిళలు తొలి కాన్పు, బిడ్డ జననం పుట్టింట్లోనే జరగాలి. ఆస్పత్రికి వెళ్లకూడదనే నిబంధన పెట్టుకున్నారు. దీంతో గర్భిణులకు వైద్య పరీక్షలు ఉండవు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా.. లేదా, గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేవి పట్టించుకోరు. దీంతో బలహీనంగా, అనారోగ్య సమస్యలతో పుట్టే పిల్లలు కూడా ఎక్కువే. కాన్పు సమయంలో ఆస్పత్రికి వెళ్లకపోవడంతో ఇబ్బందిపడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇదేంటని ఆరా తీస్తే ‘ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ చేస్తారు. ఒకసారి ఆపరేషన్ అయితే సాధారణ కాన్పు జరగదు. పైగా ఒక బిడ్డకు మాత్రమే అవకాశం ఉంటుంది. తొలి ఇద్దరు ఆడపిల్లలైతే మళ్లీ కాన్పునకు అవకాశం ఉండదు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కాన్పు చేసుకుంటాం’ అని చెబుతున్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలు ఎంత అమాయకంగా, అనాగరికంగా అవగతం చేసుకోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడి ప్రజలను కలిసి.. వారికి ఆస్పత్రి, చికిత్స, ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. ఆస్పత్రులకు రప్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. నిరక్షరాస్యతలో మొదటి స్థానం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం నిరక్షరాస్యతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యతలో మొదటి 10 స్థానాల్లో ఉన్న మండలాలివీ.. సుగ్గికెళితే కొంచెం ఎక్కువ బిడ్డల చదువు విషయమై కొందరి తల్లులను అడగ్గా.. ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా. కూలికి పోతే నూట యాభై వస్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బెంగళూరు వలస (సుగ్గి) పోతున్నారు. అక్కడ ఇళ్లు, వీధుల్లో స్వీపర్లుగా.. భవన నిర్మాణ కూలీలుగా.. వృద్ధులైతే ఇళ్లు, దుకాణాల వద్ద వాచ్మన్లుగా పని చేస్తున్నారు. కొందరు మహిళలు వేరుశనగ, శనగ గుగ్గిళ్లను రైళ్లలో విక్రయిస్తున్నారు. కొందరు పిల్లలు భిక్షాటన కూడా చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్లో ఇలాంటి వారు కనీసం 600 మంది రైలు దిగుతుంటారు. ఆస్పత్రికి పోదామంటే డబ్బుల్లేవు నాకు నలుగురు బిడ్డలు. 3, 4వ సంతానమైన షర్మిల (7), దివ్య (5)మూగవారు. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే డబ్బుల్లేవు. ఏం సేస్తాం. మా బతుకులు ఇంతే. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు. అందుకే ఇలా ఉండిపోయినాం. – ప్రమీల, జమ్మాలదిన్నె, కోసిగి మండలం చెల్లి కోసం బడికెళ్ల లేదు ఊయల ఊపుతున్న ఈ చిన్నారి పేరు దీపిక. తలారి రామంజనేయులు, లక్ష్మీదేవి ఈమె తల్లిదండ్రులు. వీరికి నలుగురు ఆడపిల్లలు. దీపిక పెద్దమ్మాయి. మధ్యాహ్యం 12.50 గంటలకు ఇంటివద్ద ఇలా కన్పించింది. ‘బడికి వెళ్లలేదా తల్లీ’ అని అడిగితే.. ‘సెల్లిని సూసుండేందుకు ఇంటికాడే ఉంటన్నా’ అని సమాధానమిచ్చింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకునేందుకు పెద్ద పిల్లలు బడి వదిలేసి ఇంటి వద్దే ఉంటారు. ఇలా దీపిక మాత్రమే కాదు.. చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా చెల్లెళ్ల ఆలనా పాలన కోసం అక్షరాలకు దూరంగా భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. రైళ్లలోనూ ఇబ్బందులే నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడ బిడ్డలు. రెండెకరాల సేనుంది. వానల్లేక, పంటలు పండక శానా ఇబ్బంది పడుతున్నాం. కూలికి పోదామన్నా పని ఉండదు. రైళ్లలో పండ్లు అమ్ముకుంటాం. రైలులో శానా ఇబ్బంది. పరిమిషన్ లేదని టీసీలు దించేస్తారు. కిందమీద పడతా బతుకుతాండాం. – రాగమ్మ, కోసిగి తిండిలేక.. ఎదుగదల లేక పెండ్లయిన ఏడాదికే భర్త శీను ఇడిసిపెట్టి పోయినాడు. ఇల్లు లేదు. పొలం లేదు. బెంగళూరుకు సుగ్గి పోతాం. బిడ్డను చూసుకునేటోళ్లు లేక నాతోపాటు తీసుకుపోతా. దీంతో పాపకు సదువు పోయినాది. 11 ఏళ్ల బిడ్డయినా తిండిలేక ఎదుగుదల ఆగిపోయినాది. – భీమక్క, కర్నూలు పశ్చిమ ప్రాంతం చదువుకోవాలని ఉంది..కానీ నేను ఒకటో తరగతి సదివినా. ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అమ్మవాళ్లు సుగ్గికి పోతే బువ్వ ఒండేటోళ్లుండరు. అందుకే నేనూ వాళ్లతో సుగ్గికి పోతా. బడికి పోవాలి, మందితో సదువుకోవాలని ఉంటాది కానీ.. ఆ అవకాశం లేదు. – లక్ష్మి, దేవకోసిగి, కోసిగి మండలం నేనూ షాకయ్యాను నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టాక వైఎస్సార్ బడిబాట కోసం రిపోర్ట్ రప్పించుకుని చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉందనే విషయం అర్థమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, వలసలు, మూఢ నమ్మకాలు, మగబిడ్డ కోసం వరుస కాన్పులు చూసి షాక్ అయ్యాను. మంత్రాలయం నియోజకవర్గమే కాదు హాలహర్వి, హోళగంద, చిప్పగిరితో పాటు చాలా మండలాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాం. అందుకే ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకూ రుణాలిచ్చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. – వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు -
ఏపీఎంఎస్‌ఐడీసీకి కమీషన్ల జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో (ఏపీఎంఎస్ఐడీసీ) తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారాలు బయట పడుతున్నాయి. మందుల కొనుగోలు నుంచి సివిల్ నిర్మాణాల వరకూ ఆన్లైన్ టెండర్లకు వేదికైన ఈ సంస్థలో గత నాలుగున్నరేళ్లలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి, చికిత్స అందించేందుకు ఎనీమియా స్క్రీనింగ్ యంత్రాల (హిమోగ్లోబిన్ డిజిటల్ మెషీన్లు) కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్లకు కక్కుర్తి పడిన ఏపీఎంఎస్ఐడీసీ గత ఆరు నెలలుగా 164 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయలేదు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యంత్రాలను రాకుండా అడ్డుకున్నారంటే ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 3,150 యంత్రాల కొనుగోలుకు టెండర్లు రాష్ట్రంలో ఏటా 7.50 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో 60 శాతం మంది రక్తహీనత బాధితులే. పదేపదే సూదితో గుచ్చి రక్తం తీయడం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాథమికంగా 164 పీహెచ్‌సీలకు అత్యాధునిక హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మెషీన్లు ఉంటే గర్భిణులు, బాలింతలకు సూది గుచ్చాల్సిన అవసరం ఉండదు. కనురెప్పలు తెరిచి, ఆ మెషీన్‌తో చూస్తే శరీరంలో ఎంతమేరకు రక్త శాతం ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ మెషీన్‌కు బ్లూటూత్ పరికరం ఉంటుంది. వైద్యుడు సుదూర ప్రాంతంలో ఉన్నా అతడి సెల్‌ఫోన్‌కు ఈ హిమోగ్లోబిన్ సమాచారాన్ని పంపించి, సలహాలు సూచనలు పొందవచ్చు. మొత్తం 3,150 మెషీన్ల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడీసీ 2018 అక్టోబర్ 9న టెండర్లు పిలిచింది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల పరిశీలన తరువాత డెమో కూడా పూర్తయ్యింది. బయోసైన్స్ అనే సంస్థ ఒక్కో మెషీన్‌ను రూ.21 వేలకు కోట్ చేసి, టెండర్లలో ఎల్1గా నిలిచింది. ఎల్2గా నిలిచిన మాసిమో అనే సంస్థ ఒక్కో యంత్రానికి రూ.80 వేలు కోట్ చేసింది. దీంతో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు టెండర్ అప్పగించాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ ఆ పని చేయలేదు. కమీషన్ల బేరం కుదరకపోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అవినీతి వల్ల 2019 జనవరి నుంచి ఇప్పటివరకూ ఆ మెషీన్లు సరఫరా కాలేదు. బయోసైన్స్‌కు ప్రొడక్ట్ లైసెన్స్ లేదు ‘‘హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్ల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లలో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు ప్రొడక్ట్ లైసెన్స్ లేదని మాసిమో సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై వెరిఫికేషన్ చేశాం. ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించాం. ఈ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకున్నాం. టెండర్ రద్దయ్యింది’’ – సీహెచ్ గోపీనాథ్, ఎండీ, ఏపీఎంఎస్ఐడీసీ -
గర్భిణుల్లో అపోహలను తొలగించాలి
సాక్షి, భట్టిప్రోలు: గర్భిణుల్లో నెలకొన్న అపోహలను వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తొలగించాలని భట్టిప్రోలు పీహెచ్సీ డాక్టర్ ఎ.సీతాకుమారి సూచించారు. పీహెచ్సీలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాకుమారి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి గర్భిణుల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చూడాలని కోరారు. బాలింతలు ఈ సేవలు పొందేందుకు 102 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలి వెల్లటూరు పీహెచ్సీలో నిర్వహించిన ఆశాడే సమావేశంలో డాక్టర్ సీహెచ్ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్విహించనున్న సామూహిక పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. -
ప్రసవ వేదన
రక్తంలో హిమోగ్లోబిన్(హెచ్‌బీ) శాతం 11 గ్రాముల కంటే తక్కువగా ఉంటే రక్తహీనత(అనీమియా)గా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచిస్తోంది. అనంతపురం సర్వజనాస్పత్రిలో నెలకు 900 ప్రసవాలు జరుగుతుండగా.. అందులో 20 శాతం(7 గ్రాముల లోపు హెచ్‌బీ) తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇక 6 గ్రాముల హెచ్‌బీ ఉన్న కేసులు 25 శాతం వరకు నమోదువుతున్నాయి. 11 గ్రాముల హెచ్‌బీ కంటే తక్కువ ఉన్న కేసులు 60 నుంచి 70 శాతం ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాహారం, వైద్య సలహాలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికమే తల్లీబిడ్డల ప్రాణం మీదకు తెస్తున్నాయి. అనంతపురం న్యూసిటీ/సెంట్రల్ : మూఢనమ్మకాలు, పేదరికం, నిరక్ష్యరాస్యత...ఆచార వ్యవహారాలు గర్భిణులకు ప్రసవ వేదనను మిగిలిస్తున్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా.. వివిధ కారణాలతో చాలామంది మహిళలు దాన్ని పెద్దగా పాటించడం లేదు. ఫలితంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు తమ కలల పంటను కళ్లచూడలేకపోతున్నారు. ఒక్కోసారి ప్రాణమ్మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు మాతాశివు మరణాలు అరికట్టేందుకు, సుఖ ప్రసవాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక్క ఫిబ్రవరిలోనే అనంతపురంలోని సర్వజనాసుపత్రికి రక్తహీనత కేసులు 7 వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రూ.కోట్లు ఖర్చుచేస్తున్నా.... ఓ వైపు వైద్య ఆరోగ్యశాఖ, మరో వైపు మహిళా,శిశు సంక్షేమశాఖల అధికారులు గ్రామ స్థాయి నుంచి మాతాశిశు మరణాలు అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. వైద్య ఆర్యోగశాఖ తరఫున నెలనెలా వైద్య పరీక్షలు, కావాల్సిన ఐరన్ మాత్రలు అందజేస్తున్నారు. మహిళా,శిశు సంక్షేమశాఖ ద్వారా రక్తహీనత నిర్మూలించేందుకు పౌష్టికాహారం(కోడిగుడ్డు, మధ్యాహ్న భోజనం) అందిస్తున్నారు. ప్రతి రోజూ బరువును చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బాలింత సమయం ముగిసే వరకూ యోగా క్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీవర్కర్లపై ఉంటుంది. అయినా కూడా రక్తహీనత కేసులు వస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనత ఎందుకు వస్తుంది రక్తహీనతో అనర్థాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ–12, యూరిన్ ఇన్ఫెక్షన్, కడుపులో నులిపురుగులు ఏర్పడడం కారణంగా రక్తహీనత వస్తుంది. రక్తహీనతతో విపరీతమైన అలుపు, ఆయాసం, కాళ్ల వాపులు వస్తాయి. కడుపులో బిడ్డ ఎదుగుదల ఉండదు. సిజేరియన్ సమయంలో అధిక రక్తస్రావమై తల్లీబిడ్డ ప్రాణాలకే ముప్పు. పెరుగుతున్న రక్తహీనత కేసులు జిల్లాలో రక్తహీనత కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారుల సమన్వయలోపం తల్లీబిడ్డలకు శాపంగా మారుతోంది. గడిచిన రెండేళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2017–18లో రక్తహీనత కేసులు 74.27 శాతం ఉండగా... 2018–19లో 71.89 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అది మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వజనాస్పత్రిలోని గైనిక్ వైద్యులు చెబుతున్నారు. అందువల్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 10 శాతం ప్రసవాలు జరగడం లేదంటున్నారు. కొరవడిన పర్యవేక్షణ గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో పాటు ఐసీడీఎస్ సిబ్బంది గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలి. అయితే క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రక్తహీనత కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా యాంటినేటల్ చెకప్స్ చేస్తే హెచ్‌బీ, బీపీ సమస్యను తెలుసుకోవచ్చు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పోషకాహారం, వైద్య చికిత్సలు తీసుకునేలే చైతన్యం తీసుకురావచ్చు. రక్తహీనతకు ఇలా చెక్ గర్భం దాల్చినప్పటి నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అందుబాటులో ఉండే పండ్లు, ఆకుకూరలు, మాంసకృతులు తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదట వ్యక్తిగత శుభ్రత పాటించాలి. గోర్లు శుభ్రం తీసుకోవాలి. బాత్రూంకి వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. లైంగిక శుభ్రత పాటించాలి. దీని ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్, నులిపురుగుల సమస్య ఉండదు. ఇక ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ–12 లోపానికి పోషకవిలువలు అధికంగా ఉండే పప్పు, రాజ్మ, వేరశనక్కాయలు, బెల్లంతో చేసిన పాకంపప్పు, మునగాకు, వివిధ రకాల ఆకుకూరలు తీసుకోవాలి. దీని ద్వారా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.. రక్తహీనత కేసులు అధికమే సర్వజనాస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల్లో 70 నుంచి 80 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కొందరికి హెచ్‌బీ మరీ 4 గ్రాములే ఉంటోంది. అలాంటి కేసులు నెలకు పదుల సంఖ్యలోనే వస్తున్నాయి. వీరు ఎలాంటి ఆహారం, వైద్య చికిత్సలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల వారు గుడ్డు తింటే పుట్టే బిడ్డలు వెంట్రుకల్లేకుండా పుడతారని భావించి చాలా మంది తినడం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలు వీడేలా చైతన్యం తీసుకురావాలి. –డాక్టర్ సంధ్య, గైనిక్ –2 హెచ్ఓడీ, సర్వజనాస్పత్రి పౌష్టికాహారం అందించేందుకు కృషి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారించేందుకు కృషి చేస్తున్నాం. ‘అన్న అమృతహస్తం’ ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు అందజేస్తున్నాం. దీంతో పాటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో రక్తహీనత కేసులు నమోదవుతున్నాయో గుర్తించి.. ఆయా ప్రాంతాలల్లో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్తహీనత నివారణ కోసం కృషి చేస్తాం. – చిన్మయాదేవి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అవగాహన కల్పిస్తున్నాం గతంతో పోలిస్తే గర్భిణు, బాలింతలు, బాలికల్లో రక్తహీనత శాతం తగ్గింది. రక్తహీనతతో బాధపడేవారు గత ఏడాది 74 శాతం ఉంటే ఈ ఏడాది 71 శాతానికి వచ్చింది. పీహెచ్‌సీల్లో ప్రతి శుక్రవారం యాంటినేటల్ చెకప్స్‌తో పాటు మంచి పౌష్టికాహారం ఏర్పాటు చేస్తున్నాం. రక్తహీనత వల్లే కలిగే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. మాతా, శిశు మరణాల నివారణకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్(డీఎంహెచ్ఓ) -
బాలింత, పసికందును మధ్యలో దించేసిన వైనం
విశాఖపట్నం, పెదబయలు (అరకులోయ): ఏ వేళలో ఫోన్ చేసినా సకాలంలో వచ్చి.. బాధితులను ఆస్పత్రులకు చేర్చి.. అపర సంజీవనిగా పేరు తెచ్చుకున్న 108 వాహనాలు ఇప్పుడు ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి. సకాలంలో రాకపోవడంతోపాటు.. కొంతమంది సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 టెక్నీషియన్, పైలట్ ఓ ఆదివాసీ బాలింత, పసికందు పట్ల స్పందించిన తీరు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. బాధితులు తెలిపిన వివరాలివి.. మండలంలోని అరడకోట గ్రామానికి చెందిన కొర్రా బాలయ్య భార్య సుందరమ్మ వారం రోజుల క్రితం ప్రసవించిన బిడ్డకు వాంతులు, విరోచనాలు అవుతుండడంతో పెదబయలు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ స్టాఫ్ నర్స్ పరిశీలించి, పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు 108 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో వస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు. పెదబయలులోనే ఉండి తీరిగ్గా రాత్రి 9.30 గంటలకు వచ్చారు. అంతవరకు ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు ‘ఇంత ఆలస్యం అయితే ఎలా సార్.. పరిస్థితి విషమంగా ఉంది కదా’ అని 108 సిబ్బందిని ప్రశ్నించారు. దానికి వారు స్పందించి తీరు దారుణంగా ఉంది. ‘ప్రాణాలు పోతే పోనీయండి.. మేము భోజనం చేసి రావడంతో జాప్యం జరిగింది.. మీరు ఇలా అడిగితే ఎందుకు పాడేరు తీసుకుని వెళ్లాల’ని వారు దురుసుగా మాట్లాడారు. వాహనంలో ఎక్కించుకుని పీహెచ్సీ నుంచి మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్లి దించేశారు. దీంతో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులకు బాధితులు సమాచారం అందించారు. వారు వెంటనే పాడేరు ఐటీడీఏ పీవోతో మాట్లాడి పీహెచ్సీ అంబులెన్స్‌కు పంపించారు. పరిస్థితి విషమంగా ఉన్న పసికందును వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి ఉన్నా ఉన్న పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు నాగేంద్ర, సింగ్, పూర్ణయ్య కోరారు. పైలెట్ మద్యం సేవించి ఉన్నాడని బాధితులు ఆరోపించారు. -
బొబ్బర్లు... గర్భిణులకు మేలు!
బొబ్బర్లలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉన్నందున గర్భవతులు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. దాంతో పుట్టబోయే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా నివారించవచ్చు. ఇది మాత్రమే కాదు... వీటితో ఆరోగ్య ప్రయోజనాలెక్కువే. అందుకే బొబ్బర్లను తరచూ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బొబ్బర్లతో ఒనగూరే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... విటమిన్ బి కాంప్లెక్, విటమిన్–సి కూడా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని సమకూర్చి అనేక వ్యాధులను నివారిస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటానికీ, మలబద్దకాన్ని నివారించడానికి దోహదపడతాయి. అంతేకాదు పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. బొబ్బర్లలో పిండిపదార్థాలు చాలా ఎక్కువ. అయినప్పటికీ తిన్న తర్వాత జీర్ణమై ఒంటికి పట్టేటప్పుడు ఆ చక్కెరలు మెల్లగా రక్తంలోకి వెలువడతాయి.అందుకే డయాబెటిస్ రోగులకు మంచివి. పొటాషియమ్ పాళ్లు ఎక్కువగానే ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి. ప్రోటీన్లు కూడా ఎక్కువే. కండరాల రిపేర్లకు ఇవి తోడ్పడతాయి. గాయాలు త్వరగా తగ్గడానికి ఉపకరిస్తాయి. విటమిన్–ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటిచూపును కాపాడతాయి. అనేక నేత్రసంబంధ రుగ్మ తలను నివారిస్తాయి. జింక్, మెగ్నీషియమ్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలం. అందువల్ల మెరిసే ఒల్తైన జుట్టుకూ, దాని పెరుగుదలకు దోహదపడతాయి. అనేక చర్మసమస్యలనూ అరికడతాయి. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ పాళ్లు కూడా ఎక్కువే. అందువల్ల ఎముకలు బలంగా, పటిష్టంగా ఉంచడానికి బొబ్బర్లు ఉపయోగపడతాయి. -
400 ఏళ్లుగా ఊరి బయటే పురుడు..!
అమ్మాయికి పురుటినొప్పులు మొదలయ్యాయనగానే ఆ ఊరివారు∙చేసేపని..ఆమెను వెంటనే ఊరి పొలిమేరల్లోకి తరలించడమే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 130 కి.మీ దూరంలోని రాజ్గర్లోని శంక శ్యామ్‌జీ గ్రామంలో ఏకంగా నాలుగు వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇక్కడ గర్భిణులు ఇంటిలో పిల్లలకు జన్మనివ్వరు. వీలయితే ఆసుపత్రి లేదంటే ఊరి బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోనే జన్మనివ్వాల్సిందే! అది ఎర్రగా మండే ఎండాకాలంలో కానీయండి, భోరున వర్షాలు కురిసేపుడు అవనివ్వండి, గజ్జున చలి మెలిపెట్టేసే రోజుల్లో కానీయండి...ఎలాంటి మినహాయింపు లేదు. ఈ కట్టుబాటుకు సంబంధించి లిఖిత శాసనాలేమి లేకపోయినా, ఇక్కడ స్త్రీలు ప్రసవించడాన్ని మాత్రం అనుమతించరు. దీనికంతటికి ఓ మూఢవిశ్వాసమే కారణం...‘ 16వ శతాబ్దంలో ఈ గ్రామంలో ఓ గుడిని నిర్మిస్తున్న సందర్భంగా ఓ మహిళ గోధుమలతో పిండి పట్టించడం మొదలుపెట్టడంతో పనిచేసే వాళ్ల దృష్టి మళ్లి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. దాంతో దేవుళ్లకు కోపమొచ్చి ఈ గ్రామంపై శాపాలు కురిపించారు.. ఇక్కడ ఏ మహిళా బిడ్డకు జన్మనివ్వలేదంటూ శపించారు’ అంటూ ఈ ఊరి వయోధికులు వెల్లడించారు. ఈ మేరకు తమ గ్రామం శాపగ్రస్తమైందంటూ గ్రామస్థులు ఇప్పటికీ నమ్ముతున్నారు. దీనిని ఓ అంధ విశ్వాసంగా గ్రామస్థులు అంగీకరించరు. గతంలో అనుకోకుండా కొన్ని ప్రసవాలు జరిగినా వికలాంగులుగానో, మృతశిశువులో జన్మించిన సందర్భాలను తాము స్వయంగా చూశామని వారు చెబుతుంటారు. ఒకవేళ ఏ మహిళ అయినా గ్రామం లోపలే ప్రసవిస్తే తల్లి లేదా బిడ్డలలో ఒకరు మరణిస్తారని లేదా పుట్టిన శిశువులు వైకల్యంతో పుడతారని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అత్యవసర పరిస్థితులను మరింత మెరుగ్గా ఎదుర్కునేందుకు వీలుగా ఊరవతల ప్రసవాల కోసమే ఓ గదిని గ్రామస్థులు నిర్మించారు. ‘దాదాపు 90 శాతం వరకు ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. తప్పని పరిస్థితుల్లోనే గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన గదిలో పురుడుపోస్తుంటారు’ అని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్ పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పాలిచ్చే తల్లులకు మేలు చేసే జీలకర్ర
జీలకర్రను మనం కేవలం ఒక సుగంధ ద్రవ్యంలాగా వాడుతాం గానీ... దీనితో కేవలం మంచి వాసనే కాదు... మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుంది. జీలకర్రతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... ∙ గర్భిణులు, పాలిచ్చే తల్లులు జీలకర్ర ఉండే పదార్థాలను తరచూ తీసుకోవాలి. పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా పడేలా చేస్తుంది. థైమాల్ అనే పదార్థం ఇందుకు దోహద పడుతుంది. ∙ జీలకర్రలో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే, వారు కోల్పోయే ఐరన్ తేలిగ్గా భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్ ఎక్కువగా అవసరం కాబట్టి వారికీ జిలకర చాలా మంచిది. ∙ జీలకర్రలో ఐరన్‌తో పాటు చాలా ఎసెన్షియల్ ఆయిల్స్, విటమిన్–సి, విటమిన్–ఏ, ఇతర ఖనిజలవణాలు చాలా ఎక్కువ. ఇవన్నీ సంయుక్తంగా రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనేక వ్యాధులనుంచి నివారిస్తాయి. ∙ ఆస్తమా, బ్రాంకైటిస్ వంటివి రాకుండా నిరోధించే గుణం జీలకర్రకు ఉంది. శ్వాసవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ∙ జీలకర్రలో విటమిన్–ఇ ఎక్కువ. అందుకే ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు... చర్మం వదులు కావడం, ముడుతలు, ఏజ్ స్పాట్స్ వంటి వాటిని నిరోధిస్తుంది. -
ఐరన్ ఆకు
పుట్టబోయే బిడ్డలో ఎలాంటి అవయవలోపాలూ, ఆరోగ్యలోపాలూ రాకుండా చూసే శక్తి పాలకూరలో ఉంది. చాలామంది ఆకుకూరలు అంటే పెదవి విరుస్తారు కాబట్టి, అచ్చం పాలకూరలో ఉండే లాంటి పోషకాలతోనే రూపొందించిన ట్యాబ్లెట్లను గర్భవతులకు ఇస్తుంటారు. దీన్ని బట్టి చూసినా పాలకూర గొప్పదనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం గర్భవతులకు మాత్రమే కాదు... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు పాలకూరలో పుష్కలంగా ఉన్నాయి. పాలకూరతో సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని... పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు. కొందరికి ఐరన్ టాబ్లెట్లు సరిపడుకపోవచ్చేమోగానీ... పాలకూరతో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. అనీమియా (రక్తహీనత) ఉన్నవారు పాలకూరను తరచూ తీసుకుంటే త్వరలోనే అనీమియా సమస్య తగ్గిపోతుంది. పాలకూరలో ల్యూటిన్, జియాగ్జాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ పోషకాలు చాలా శక్తిమంతమైనవి కావడంతో ఎన్నో రకాల క్యాన్సర్ల బారి నుంచి అవి కాపాడుతుంటాయి. పాలకూరలో విటమిన్–ఏ పాళ్లు చాలా ఎక్కువ. కళ్లకు మేలు చేసి, చూపును పదిలంగా ఉంచుతుంది. పాలకూరలో విటమిన్–సి కూడా చాలా ఎక్కువ. క్రమం తప్పకుండా పాలకూర తినేవారికి మంచి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ∙పాలకూర క్రమం తప్పక తినేవారికి గుండెజబ్బులు, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు అంత తేలిగ్గా రావు. ∙పాలకూరలో పొటాషియమ్, మాంగనీస్, మెగ్నీషియమ్, కాపర్, జింక్ వంటి ఖనిజ లవణాలు, ఇతర పోషకాలు ఎక్కువ. మేనిని నిగారింపజేస్తూ... చర్మాన్ని చాలాకాలం యౌవనంగా ఉంచడానికి ఆ ఖనిజ లవణాలు దోహదం చేస్తాయి. -
గర్భిణులు తింటే మంచిది
అత్యంత తియ్యటి పండ్లలో సపోటా ఒకటి. చాలా భారతీయ ప్రాంతాల్లో దీన్ని చికూ అని అంటుంటారు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ కూడా కలిగి ఉండి తన తియ్యదనంతో ఎంతటి రుచిని ఇస్తుందో... తన పోషకాలతోనూ అంతే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సపోటాతో సమకూరే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి. గర్భిణులకు, బాలింతలకు, పాలిచ్చే తల్లులకు సపోటా ఎంతో మేలు చేస్తుంది. ఇక నెలతప్పిన వారిలో ఉండే వేవిళ్లు, వికారం, వాంతులను సపోటా సమర్థంగా అరికడుతుంది. సపోటాలో విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సపోటా.. జీర్ణవ్యవస్థలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, ఈసోఫేజైటిస్, ఎంటిరైటిస్, ఇరిటబుల్ బవెల్ సిడ్రోమ్ వంటి వ్యాధులను అరికడుతుంది. ఇందులో పీచు పుష్కలంగా ఉండటం వల్ల విరేచనం తేలిగ్గా అయ్యేలా చూస్తుంది. మలబద్దకం లేకుండా చేస్తుంది. సపోటాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ–రాడికిల్స్‌ను హరించి, వయసు పెరుగుదల వేగాన్ని మందగింపజేసి, చాలాకాలంపాటు యౌవనంగా ఉండేలా చేస్తాయి. మేని మీద ముడతలు రాకుండా కూడా చేస్తాయి ఈ యాంటీఆక్సిడెంట్స్. పాలసపోటా చర్మంలో పెరిగే చాలా రకాల ఫంగల్ పెరుగుదలను అరికడుతుంది. సపోటాలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది ఎముకలు పటిష్టంగా ఉంచడంలోనూ, వాటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక భూమిక వహిస్తుంది. -
ఇవి తింటే.. బిడ్డ తెలివి పెరుగుతుంది!
గర్భిణులు తమ కోలీన్ ఉన్న ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోవడం ద్వారా బిడ్డ మెదడు ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని అంటున్నారు కార్నెల్ యూనివర్విటీ శాస్త్రవేత్తలు. కోలీన్ ఏమిటి? దానికి బుర్రకు సంబంధం ఏమిటన్నది ఆలోచిస్తూంటే కొంచెం చదివేయండి. కోడిగుడ్డు సొన మొదలుకొని చేపలు, పాలు, పెరుగు, చిక్కుడు వంటి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు ఇప్పటికే తెలుసుగానీ.. గర్భిణులకు సంబంధించి ఇవి శిశువు మెదడు సామర్థ్యాన్ని పెంచేందుకూ పనికొస్తాయని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. చివరి మూడు నెలల్లో ప్రస్తుతం వైద్యులు సూచిస్తున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ కోలీన్ తినడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుందని మారీ కాడిల్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఎలుకల విషయంలో కోలీన్ జీవితాంతం ప్రభావం చూపుతుందని ఇప్పటికే రుజువైందని తెలిపారు. కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ వంటి అనేక కారణాలు చూపుతూ చాలామంది కోలీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తున్నారని, ఇదేమంత మంచి పరిణామం కాదని అన్నారు. తాము కొంతమంది గర్భిణులకు కోలీన్ మినహా మిగిలిన అన్ని రకాల పోషకాలను తగుమోతాదులో అందించి పరిశీలించినప్పుడు వారికి పుట్టిన బిడ్డల మేధోశక్తి పెరిగిందని 4, 7, 10, 13 నెలల్లో బిడ్డలను పరిశీలించి తామీ అంచనాకు వచ్చామని వివరించారు. -
చేపలతో పుట్టబోయే బిడ్డకు ఆస్తమా దూరం!
మీరిప్పుడు గర్భవతా, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? అయితే మీరు తీసుకునే ఆహారంలో పుష్కలంగా చేపలకూర ఉండేలా చూసుకోండి. గర్భవతులుగా ఉన్నప్పుడు చేపలు ఎక్కువగా తినేవారికి కలిగే సంతానానికి ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు పరిశోధకులు. వారి సిఫార్సుల మేరకు గర్భవతులు వారంలో కనీసం 250 గ్రాముల నుంచి 340 గ్రామల వరకు చేపలు తినాలి. వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేపలు తినడం కూడా మంచిదే. అనేక కీలక సంస్థల్లోని డాక్టర్లు, అధ్యయనవేత్తల పరిశోధనల ఫలితాలను పొందుపరిచిన ‘ద జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ’ మ్యాగజైన్లో నమోదు చేసిన వివరాల ప్రకారం గర్భవతులుగా ఉన్నప్పుడు ఆహారంలో విరివిగా చేపలు తినేవారి పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. అమెరికన్ అత్తున్నత ఔషధాల అనుమతి సంస్థ ‘ద ఫుడ్ అండ్ గ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ కూడా గర్భవతులు చేపలు తినడం మంచిదని సిఫార్సు చేస్తోంది. -
జ్ఞాపకాల దొంతర
ఒకప్పుడు నీళ్లు తోడే చేద బకెట్లు, కడవలు బావిలో పడిపోతే పెద్దవాళ్లు గాలం వేసి గాలించి దానిని వెలికి తీసేవారు. కాలక్రమేణా వస్తున్న మార్పులతో ఇప్పుడు బావులు పూడిపోతే వాటితోపాటు గాలాలు ఆ పూడికలో కూరుకుపోయాయి. నీళ్లు కాచుకునేందుకు రాగికాగులను ఉపయోగించేవారు. పదిమంది అతిథులు వస్తే వండి వార్చడానికి వీలుగా గాడిపొయ్యిలు, వాటిమీద పెట్టి వండేందుకు పెద్ద పెద్ద ఇత్తడి గుండిగలు, గంగాళాలు ఉండేవి. వాటర్ హీటర్లు, గీజర్లు రావడంతో రాగికాగులు కాస్తా చిలుం పట్టిపోయాయి. కిరోసిన్ స్టవ్వులు, గ్యాస్ స్టవ్‌లు, కుకర్లు, కరెంట్ కుకర్లు వచ్చి పొయ్యిల్ని పూడ్చేసి, గుండిగలను, గంగాళాలను ముందు అటకమీదికి, ఆ తర్వాత పాత ఇత్తడి సామాన్ల కొట్టుకు తరలించేశాయి. పెద్దవాళ్లు సేదతీరడానికి ఉపయోగించిన పడక్కుర్చీలను ఈజీచైర్లు, రివాల్వింగ్ చైర్లు పొయ్యిలోకి నెట్టేశాయి. నాయనమ్మ, తాతయ్యలు నడుంవాల్చిన నులకమంచాలు, గర్భిణులు, బాలింతలకు విశ్రాంతినిచ్చిన పట్టెమంచాలు, నవదంపతుల సల్లాపాల జోరుకు ఊతమిచ్చిన నగిషీలు చెక్కిన పాతకాలపు పందిరి మంచాలు పాత ఫర్నీచర్ షాపులకు ఎప్పుడో తరలి వెళ్లిపోయాయి. వాటిస్థానంలో కూర్చుంటే కూరుకుపోయేంత మెత్తగా ఉండే డన్లప్ పరుపులు, నడుం నొప్పి వాళ్లకు ఒకింత గట్టిగా ఉండే కాయిర్ పరుపులు, అత్యాధునిక హంగులుండే డబుల్ కాట్ మంచాలే ఇప్పుడు పల్లెటూళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. ఇళ్లముందు నలుగురైదుగురు అమ్మలక్కలు కూర్చుని కబుర్లు చెప్పుకునే అరుగులు, గ్రామకచేరీలు, గ్రామచావడిలు, గ్రామఫోన్లు ఎప్పుడో కనుమరుగై పోగా, లౌడ్ స్పీకర్లు, మైక్సెట్లు, పెద్దలు తీర్పులు చెప్పే రచ్చబండలు, జెండాచెట్లు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పప్పు రుబ్బురోళ్లు, కారం దంచుకునే రోళ్ల సంగతి సరేసరి! పైన చెప్పుకున్న వస్తువులన్నీ ఒకనాటి జ్ఞాపకాలు. మీ ఇంటిలో పెద్దవాళ్లుంటే వీలైతే వాళ్లున్నంత కాలం ఆ వస్తువులని కూడా ఉండనివ్వండి. కనీసం వాళ్లు ఆ వస్తువులతోనైనా తమ భావాలను పంచుకుంటారు. గోడు వెళ్లబోసుకుంటారు. ఊసులాడుకుంటారు. పాతరేసిన జ్ఞాపకాల తేగలను తవ్వుకుని, కమ్మటి అనుభూతులను పొందుతారు. నోట్లు, బంగారం, వెండి పాత బడినా వాటి విలువ తగ్గదు కదా. అలాగే పెద్దవాళ్లు, వాళ్లు వాడిన వస్తువులనూ గుర్తుంచుకుంటే చాలు. -
నీలినీడలు
మండపేట: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘అన్న అమృతహస్తం’ పథకానికి ప్రభుత్వం చెయ్యిస్తోంది. పథకం ప్రారంభించి మూడు నెలలైనా అమలుకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. అయినప్పటికీ అప్పోసొప్పో చేసి వండివార్చిన అంగన్వాడీ కార్యకర్తలు.. సుమారు రూ.84 లక్షల మేర బిల్లు బకాయిలు పేరుకుపోవడంతో ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. పాత బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వారు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ప్రారంభమైందిలా.. ఏజెన్సీలోని ఎనిమిదింటితోపాటు కోరుకొండ, శంఖవరం, తుని ప్రాజెక్టుల పరిధిలో చిన్నారులకు మాదిరిగానే బాలింతలు, గర్భిణులకు కూడా ఆయా కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి వడ్డిస్తుండగా.. మిగిలిన ప్రాజెక్టుల పరిధిలో గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు, నెలకు మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటరు నూనె చొప్పున పంపిణీ చేసేవారు. ఇంటికి ఇవ్వడం వలన బాలింతలు, గర్భిణులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదని గుర్తించి మిగిలిన ప్రాజెక్టుల మాదిరి గా అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా పాలు పంపిణీ చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కాకినాడ, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కపిలేశ్వరపురం, కోనసీమ తదితర ప్రాంతాల్లోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 3,934 అంగన్వాడీ కేంద్రాల్లో ‘అన్న అమృతహస్తం’ పథకం ప్రారంభించారు. మెనూ ఇచ్చారు.. నిధులు మరిచారు! ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 30,544 మంది గర్భిణులు, 25,539 మంది బాలింతలకు ఈ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నట్టు ప్రకటించారు. రోజూ అన్నం, గుడ్డు, పాలతోపాటు వారంలో రెండు రోజులు పప్పు, కూరగాయలతో చేసిన కూర, రెండు రోజులు సాంబారు, రెండు రోజులు ఆకుకూర పప్పు వండి పెట్టాలని మెనూ విడుదల చేశారు. బియ్యం, నూనె రేషన్ ద్వారా అందిస్తుండగా.. కూరగాయల ఖర్చు నిమిత్తం ఒక్కొక్కరికి రోజుకు రూ.1.40, పోపు సామగ్రి కోసం 40 పైసల చొప్పున రూ.1.90 అందించనున్నట్టు ప్రకటించారు. పంచాయతీల ద్వారా వంట సామగ్రి సమకూర్చనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. జూలై ఒకటో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికీ ఆయా కేంద్రాలకు వంట సామగ్రి, గర్భిణులు, బాలింతలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లను అందజేయలేదు. పైగా నిధుల కేటాయింపు కూడా లేదు. అధికారుల ఒత్తిళ్లతో మూడు నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పథకం అమలుకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సుమారు రూ.84 లక్షలు మేర బిల్లులు విడుదల కావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా బిల్లులు విడుదల కాకపోవడంతో పథకం అమలు చేయలేక అంగన్వాడీ కార్యకర్తలు చేతులెత్తేస్తున్నారు. సర్కారు వైఖరితో గర్భిణులు, బాలింతలకు రేషన్ నిలిచిపోగా, పౌష్టికాహారం అందని దుస్థితి నెలకొంది. -
పొజిషన్ ఎలా ఉండాలి?
గర్భిణి స్త్రీల ‘స్లీపింగ్ పొజిషన్’ ఎలా ఉండాలి? పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఏదైనా సమస్య ఎదురవుతుందా? కొన్ని స్లీపింగ్ పొజిషన్లు బేyట హార్ట్‌పై ప్రభావం చూపుతున్నాయని అంటుంటారు. ఇది ఎంత వరకు నిజం? – జి.సుమన, పొద్దుటూరు ప్రెగ్నెన్సీ సమయంలో, గర్భాశయంలో బిడ్డ పెరిగే కొద్దీ బరువు మొత్తం వెన్నుపూస మీద, వెన్నుపూస పైన ఉండే పెద్ద రక్తనాళాల పైన పడుతుంది. పక్కకు పడుకోవడం వల్ల, ఒత్తిడి వల్ల రక్తనాళాలు కొద్దిగా మూసుకున్నట్లయ్యి, బిడ్డకి, తల్లికి రక్తసరఫరా తగ్గుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల బిడ్డ సరిగా పెరగలేకపోవటం, ఉమ్మనీరు తగ్గటం, తల్లిలో బీపీ తగ్గటం, కళ్లు తిరిగినట్లు అనిపించడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి మొదటి మూడు నాలుగు నెలలు ఎలా పడుకున్నా ఫర్వాలేదు కానీ, ఐదవ నెల నుంచి పెరిగే బిడ్డ పొత్తికడుపుపై కనిపించడం జరుగుతుంది. అలానే బరువు వెన్నుపూస మీద, రక్తనాళాలపైన పడటం మొదలవుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఐదవ నెల నుంచి ఎడమవైపు పడుకోవడం వల్ల, తల్లి నుంచి బిడ్డకి, అలాగే తల్లి గుండెకి రక్తసరఫరా సరిగా వెళ్లడం జరుగుతుంది. ఇన్ఫీరియర్ వీనాకేవా అనే రక్తనాళం తల్లిలోని చెడు రక్తాన్ని గుండెకి పంపించి, గుండె నుంచి మంచి రక్తాన్ని అయెర్టా అనే రక్తనాళం ద్వారా తల్లికి, బిడ్డకి చేరవేస్తుంది. చక్కగా నడుంపైన పడుకోవటం వల్ల చెడు రక్తం తల్లిలో నిలిచి, వ్యర్థ పదార్థాలు తొలిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి గర్భిణీలు వీలైనంతవరకు, మొదటి నుంచే ఎడమవైపుకి తిరిగి పడుకోవటం మెల్లగా అలవాటు చేసుకుంటూ, ఐదవ నెల నుంచి తప్పనిసరి ఎడమవైపుకి తిరిగి పడుకోవటం మంచిది. ఎడమవైపుకి తిరిగి పడుకుని, మోకాలు దగ్గర వంచుకుని పడుకోవటం మంచిది. ఇబ్బందిగా ఉంటే కాళ్ల మధ్యలో దిండు, నడుం పక్కకి దిండు, పొట్ట పక్కకి దిండు పెట్టుకుంటే కొద్దిగా సులువుగా ఉంటుంది. ఎక్కువసేపు పడుకోలేనప్పుడు, కొద్ది సమయానికి కుడివైపుకి తిరిగి పడుకోవచ్చు. ఒకవేళ చక్కగా నడుంపై పడుకున్నా, వీలైనంత త్వరగా పక్కకి తిరగడం, తల్లికి బిడ్డకి మంచిది. అవసరం అనుకుంటే మార్కెట్లో దొరికే ‘సి’ షేప్‌లో ఉండే మెటర్నిటీ పిల్లో (దిండు)ని వాడుకోవచ్చు. గర్భిణి స్త్రీలు రకరకాల సప్లిమెంటరీలు తీసుకోవాలనే విషయం గురించి విన్నాను. ఎలాంటి సప్లిమెంట్లు తీసుకుంటే మంచిది. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? lodine సప్లిమెంట్ గురించి తెలియజేయగలరు. – కె.రాగిణి, విశాఖపట్టణం గర్భిణీ సమయంలో, కడుపులో తొమ్మిది నెలలపాటు పెరిగే శిశువు అవసరాలకు, తల్లిలో జరిగే శారీరక మార్పులకు ఆహారం బలం, పోషక పదార్థాలు ఎంతో అవసరం. కడుపులో పెరిగే బిడ్డ... తల్లి నుంచి తనకు కావలసిన ఆహారం, పోషక పదార్థాలు మాయ ద్వారా, బొడ్డుతాడు ద్వారా తీసుకుంటుంది. అలా తీసుకునే క్రమంలో తల్లి సరైన పోషక పదార్థాలు తీసుకోనప్పుడు బిడ్డ సరిగా పెరగకపోవటం, అలానే తల్లిలో రక్తహీనత, క్యాల్షియం తక్కువ కావటం వల్ల కాళ్లనొప్పులు, నడుంనొప్పులు... ఇంకా ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. గర్భిణి అన్ని పోషక పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్నా గాని తీసుకున్న ఆహారంలో ఉన్న పోషక పదార్థాలతో, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కేవలం 20–30 శాతం మటుకే రక్తంలోకి చేరుతాయి. ఇవి బిడ్డ పెరుగుదలకి, తల్లిలో జరిగే మార్పులకు సరిపోకపోవచ్చు. దీనిని అరికట్టడానికి మంచి ఆహారంతో పాటు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్స్‌తో కూడిన సప్లిమెంట్స్‌ను విడిగా తీసుకోవటం తప్పనిసరి. వీటిని టాబ్లెట్, సిరప్, పౌడర్ వంటి రూపాలలో తీసుకోవచ్చు. దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి కూడా రక్తహీనత లేకుండా, నీరసం, ఎక్కువగా కాళ్లనొప్పులు, నడుంనొప్పులు వంటి ఇతర సమస్యలు లేకుండా, తొమ్మిది నెలల పాటు ఆనందంగా ఉంటూ, పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. చాలామంది ఈ సప్లిమెంట్స్ వల్ల బాగా లావు అవుతారని, బిడ్డ బరువు ఎక్కువగా ఉంటుంది అనే అపోహలో ఉండి ఈ మందులను వాడటానికి ఇష్టపడరు. ఈ సప్లిమెంట్స్ వల్ల కేవలం రక్తంలో హిమోగ్లోబిన్ సరిగా ఉండటం, ఎముకలు బలహీనపడకుండా ఉండటం, నీరసం లేకుండా ఉండటం, బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు పెరుగుతాయి. అంతేకానీ వీటివల్ల తల్లి, బిడ్డ మరీ బరువు పెరగటం జరగదు. సప్లిమెంట్స్‌లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల బిడ్డలో వెన్నుపూసలో లోపాలు, ఇంకా ఇతర విటమిన్స్ వల్ల ఇతర అవయవ లోపాలు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయోడిన్ అనేది మినరల్. తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ఎంతో అవసరం. ఈ మినరల్ వల్ల తల్లిలో థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ సరైన మోతాదులో విడుదలయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వల్ల బిడ్డ మానసిక ఎదుగుదల సరిగా ఉంటుంది. తల్లిలో కూడా అన్ని జీవ ప్రక్రియలకు థైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం. అయోడిన్, సముద్రపు ఆహారంలో, చేపలలో, ఉడకబెట్టిన గుడ్లు, పెరుగు, పాలు, స్ట్రాబెరీస్, చెరీస్లో, పొట్టుతో ఉన్న ఆలుగడ్డ వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. అలానే అయోడైజ్డ్ ఉప్పులో కూడా ఉంటుంది. అయోడైజ్డ్ ఉప్పు రోజుకు అర టీస్పూన్ ఆహారంలో తీసుకున్నా సరిపోతుంది. విడిగా అయోడిన్ సప్లిమెంట్ అందరికీ అవసరం లేదు. సప్లిమెంట్స్ అన్నీ అధిక మోతాదులో తీసుకోవడం కూడా మంచిది కాదు. డాక్టర్ సలహా మేరకు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని, బరువుని బట్టి, వారి అవసరాలను బట్టి, తినే ఆహారాన్ని బట్టి సప్లిమెంట్స్‌ను సరైన మోతాదులో తీసుకోవటం మంచిది. -
60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన
- నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో దారుణం పురిటి నొప్పులతోనే ఆందోళన - గైనకాలజిస్ట్లు లేక గర్భిణులను తిప్పి పంపిన ఆస్పత్రి సిబ్బంది సాక్షి, నాగర్‌కర్నూల్: 60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన.. నాగర్‌కర్నూల్ జిల్లాలో నరకయాతన అనుభవించిన దారుణమిది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చి పండంటి బిడ్డతో తిరిగి ఇళ్లకు వెళ్లాలనుకున్న వారి ఆశలపై అధికారులు నీళ్లుచల్లారు. డాక్టర్లు లేరు పొండి.. అంటూ వారిని ఆస్పత్రి నుంచి సిబ్బంది పంపివేయడంతో తీవ్ర మనోవేదనకు గురై.. పురిటి నొప్పులతోనే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఆస్పత్రుల్లో మహిళలకు ప్రసవాలు జరిపించడంలో విఫలమయ్యారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ గర్భిణులు, వారి బంధువులు రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు. గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వారికి రూ.12 వేల నజరానాతోపాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తోంది. దీంతో ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు లేకపోవడంతో నిండు చూలాలు నొప్పులు భరించలేక కష్టాలు పడుతున్నారు. మంగళవారం ఉదయమే నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది గర్భిణులు ప్రసవం కోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు కాన్పులు చేయాలంటూ అక్కడి సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. గైనకాలజిస్ట్లు విధులకు హాజరుకావడం లేదని వారు సెలవులో ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో గర్భిణి మహిళలు, వారి బంధువులు నిరాశ చెందారు. ప్రభుత్వం ఓ పక్క ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకోండంటూ ప్రచారం చేస్తుండగా.. మీరేమో ఇలా చెబుతున్నారంటూ సిబ్బందిపై మండిపడ్డారు. తమకేమీ తెలియదని అక్కడి సిబ్బంది చేతులెత్తేయడంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణులతో బంధువులు ఆస్పత్రి ముందు మహబూబ్‌నగర్ – శ్రీశైలం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇంత జరుగుతున్నా పరిస్థితిని సమీక్షించేందుకు డీఎంఅండ్‌హెచ్‌ఓ గానీ, జిల్లా ఉన్నతాధికారులుగానీ అక్కడికి రాకపోవడంతో చివరికి పోలీసులు కలుగజేసుకుని వారికి నచ్చజెప్పి పంపారు. చాలామంది మహిళలు నెలలునిండి నడవలేని స్థితిలో ఆస్పత్రికి రాగా.. వారికి కనీస వైద్యం అందించేందుకు నిపుణులైన వైద్యులు లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
వైద్యులు లేరని.. వెళ్లగొట్టారు
కోదాడ ప్రభుత్వాస్పత్రిలో పురిటినొప్పులతో గర్భిణుల యాతన కోదాడ: పురిటినొప్పులతో వచ్చి న ఇద్దరు గర్భిణులను డాక్టర్లు లేరని పంపించిన ఘటన సూర్యా పేట జిల్లా కోదాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మున గాల మండలం తిమ్మారెడ్డి గూడా నికి చెందిన రజని పురిటి నొప్పు లతో బాధపడుతుండగా బుధవారం రాత్రి కోదాడ వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. రజనీకి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో వెంటనే వేరొక వైద్యశాలకు వెళ్లాలని సూచించారు. ప్రైవేట్ అంబులెన్స్‌లో సూర్యాపేట వైద్య శాలకు తీసుకెళ్తుండగా ప్రసవించింది. అలాగే, గురువారం కోదాడకు చెందిన మొయిన్ తన భార్య నుస్రత్‌ను కాన్పు కోసం వైద్యశాలకు తీసు కొచ్చాడు. డాక్టర్లు లేరని సిబ్బంది చెప్పడంతో ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. -
‘సెన్సార్’తో గర్భిణులకు సీట్లు!
బుసాన్: గర్భిణి స్త్రీలకు ప్రయాణంలో సీటు దక్కేలా దక్షిణ కొరియాలోని బుసాన్ పట్టణంలో కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నారు. ఇందులో... బుగ్గలాంటి నిర్మాణంలోని వైర్లెస్ సెన్సార్ గర్భిణులకు కేటాయించిన సీటు సెన్సార్‌లోని గులాబీ వర్ణం లైటు వెలిగేలా చేస్తుంది. బీకన్ను మోస్తున్న మహిళ గర్భిణి అని తెలుసుకుని ఆ సీటును అప్పటికే ఆక్రమించుకున్న వారు ఖాళీ చేసి ఆమెకు అప్పగిస్తారు. దీన్ని కార్లు, బస్సు లాంటి ప్రజా రవాణా వ్యవస్థలో అమలు చేయాలని యోచిస్తున్నారు. -
మిషన్ ఇంద్రధనుష్ విజయవంతం చేయండి
సాక్షి,సిటీబ్యూరో: జిల్లాలో మిషన్ ఇంధ్రధనుష్ మూడవ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఇన్చార్జి ఏజేసీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీ 13 వరకు నాలుగు రోజుల పాటు ఇంద్ర దనుష్ మూడవ విడత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 0-2 ఏళ్ల వయస్సు పిల్లలతోపాటు గర్భిణి స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని సూచించారు.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మూడవ విడత ఇంద్రధనుష్ ఏర్పాట్లపై వివరించారు. సమావేశంలో అడిషనల్ డీఎంఅండ్ హెచ్ఓ పద్మజ, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చేపలు తింటే గర్భిణులకు మేలు
లండన్: గర్భిణులు చేపలను తింటే పుట్టే బిడ్డలకు ఉబ్బసం దరిచేరకుండా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ కాడర్ నేతృత్వంలో పరిశోధనలు జరిగాయి. కొంతమంది స్త్రీలకు వారానికి రెండు సార్లు చేపలను ఆహారంగా 19 వారాలపాటు ఇచ్చారు. మిగతా వారి పిల్లలతో పోలిస్తే చేపలను ఆహారంగా తీసుకున్న తల్లుల పిల్లలకు రెండేళ్ల వయస్సు తరువాత అలర్జీ తక్కువగా ఉందని పరిశోధకులు చెప్పారు. ప్రతికూల వాతావరణం లోనూ వ్యాధులు తక్కువగా వచ్చాయన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే.. ‘కడుపు’ కోతే
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి గర్భిణులకు కడుపుకోత మిగులుస్తోంది. పురిటి నొప్పుల తో ఆస్పత్రికి వచ్చిన వారికి సుఖ ప్రసవం చేయాల్సి న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు సిజేరియన్లు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సాధారణ ప్రసవాలు అయితే డబ్బులు తక్కువ వస్తాయని, సిజేరియన్లు చేసి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో సగం వరకు సిజేరియన్లే ఉంటున్నాయంటే వారి ధనదాహం ఏ మేరకు ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో ప్రసవాలు నిర్వహిం చే ప్రైవేటు ఆస్పత్రులు 72 ఉన్నాయి. 2013 -14 సంవత్సరంలో ఆ ఆస్పత్రుల్లో 11,173 ప్రసవాలు జరిగితే వాటిలో 5,181 సిజేరియన్లు కావడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు 59 ఉన్నాయి. వాటిలో 2013-14 సంవత్సరంలో 21,643 ప్రసవాలు జరగ్గా అందులో సిజేరియన్లు 4,234 మాత్రమే. కారణం ఇది సాధారణ ప్రసవం అయితే రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఆస్పత్రికి వస్తుంది. అదే సిజేరియన్ అయితే రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ముడుతుంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేస్తే ఆస్పత్రి మనుగడ కష్టమవుతుందని, అదే సిజేరియన్ అయితే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చన్నది వైద్యుల భావనగా తెలుస్తోంది. ఆస్పత్రికి వచ్చే గర్భిణుల్లో అధికశాతం మందికి సాధారణ ప్రసవం అయ్యే పరిస్థితి ఉన్నా పట్టించుకోకుండా బిడ్డ అడ్డం తిరిగింది, బిడ్డ ఉమ్మినీరు తాగేసింది అత్యవసరంగా సిజేరియన్ చేయాలంటూ గర్భిణులను, ఆమె వెంట ఆస్పత్రికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో బెదిరిపోతున్న వారు గత్యంతరం లేక సిజేరియన్ చేయడానికి అంగీకరిస్తున్నారు. సిజేరియన్తో అనర్థాలు సిజేరియన్ జరిగిన మహిళలు నడుం నొప్పి, తలనొప్పి వంటి సమస్యల బారిన పడతారు. మొదటి సారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిజేరియన్ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. ఒక్కో సమయంలో రక్తం ఎక్కించాల్సిన అవసరం కూడా రావచ్చు. నియంత్రణ కరువు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ లేకపోవడం వల్లే వాటి నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సిజేరియన్లు అవసరం లేకపోతే చేయకూడదని తెలిసి కూడా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు నియమనిబంధనలను అతిక్రమిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు లొంగిపోయి చోద్యం చూస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ప్రసవాలు నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు లేనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులను ఎలాగైనా తమదారికి తెచ్చుకోవచ్చనే భావనలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వస్తుందని పేద,సామాన్యతరగతి కుటుంబాల ప్రజలు వాపోతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులయ్యేలా చూడాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన ప్రసూతి సౌకర్యాలు కల్పించడంతో పాటు గర్భిణుల నమోదుతో పాటు రెండవ, నాల్గవ వైద్య పరీక్షలు నిర్వహించడంలో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను అభినందించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్పు కార్యక్రమం ద్వారా క్లస్టర్ పరిధిలో స్వయం సహాయక సభ్యులు, అంగన్వాడీ, ఆర్డబ్ల్యూఎస్, ఐకేపీ, ఐసీడీఎస్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమావేశాలు నిర్వహించడంతో పాటు గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైరిస్క్ ప్రసవాలను ముందే గుర్తించి గర్భిణుల పట్ల అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సీహెచ్‌సీలో ప్రత్యేకంగా డెడికేటెడ్ హై రిస్క్ కేంద్రం ఏర్పాటు చేసి సుఖై ప్రసవాలు జరిగేలా వైద్య సదుపాయాలు, స్త్రీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లను కలెక్టర్ ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా 46 మంది స్టాఫ్ నర్సులను నియమించామన్నారు. గతేడాది అక్టోబర్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు 1600 ప్రసవాలు జరగగా నవంబర్ నాటికి 2000 వేలకు పైగా నమోదవుతున్నాయన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేయడంలో ప్రత్యేక చొరవ చూపి మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 19న పల్స్ పోలియో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో 0 నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు 100 శాతం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ వీణాకుమారి, ఎన్ఆర్హెచ్ఎం పి.జగనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ పీపీ రాజేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శైలజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గర్భిణులను గెంటేస్తున్నారు
దేవునిపల్లి, న్యూస్‌లైన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లాలంటేనే గర్భిణులు జంకుతున్నారు. పురిటి నొప్పులతో ఆస్పత్రిలో అడుగు పెట్టగానే మత్తు వైద్యుడు లేడు.. స్త్రీ వైద్య నిపుణురాలు అందుబాటులో లేదు.. సిజేరియన్ చేయడానికి వైద్యులు అందుబాటులో లేరు.. బయట వేరే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లండి లేకపోతే, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ అస్పత్రికి రాసిస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ గర్భిణుల బంధువులు ఎవరైనా గట్టిగా నిలదీస్తే బయటకు గెంటి వేస్తున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లలో బుధవారం రాత్రి 10 గంటలకు కామారెడ్డి పట్టణానికి చెందిన సీహెచ్. రాధ అనే గర్భిణి, భిక్నూర్ మండలం, పెద్ద మల్లారెడ్డి గ్రామ పరిధిలోని, అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన వరాల్ల రేణుక పురిటి నొప్పులతో వచ్చారు. వీరిని చూసిన వెంటనే నర్సులు ఇక్కడ మత్తు మం దు డాక్టర్ లేడు నిజామాబాద్ ఆస్పత్రికి రాసిస్తామని అన్నారు. గర్భిణుల బంధువులు భర్త లు సతీష్, బాల్‌రాజు కలిసి నర్సులను గట్టిగా నిలదీయగా వారందరిని బయటకు గెంటి వేసారు. చేసేదేమీ లేక వారు చలికి ఆస్పత్రి బయట వణకుతూ గంటల తరబడి కూర్చున్నారు. ఆర్డీఓకు ఫోన్ చేస్తే వైద్యులు ఏలా చెప్తే అలా వినండి అంటూ సమాధానం చెప్పారని బాధితులు ‘న్యూస్‌లైన్’తో వాపోయారు. చేసేదేమి లేక రాధను బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రేణుకు మా త్రం అక్కడి నుంచి వెళ్లక పోవడంతో ఆస్పత్రిలో చేర్చుకున్నా ప్రసూతి గురించి మాత్రం బంధువలకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కామారెడ్డి పరిధిలోని 108 ఆంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా ఈ సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో తాము గ్రామాల నుంచి గర్భిణులను తీసుకుని వచ్చినా నర్సులు ఆపరేషనలు చేయలేమని చెబుతున్నారని తెలిపారు. బయటకు పంపించారు -సతీష్, గోసంగి కాలని, కామారెడ్డి. నా భార్య రాధను పురిటి నొప్పులతో తీసుకువచ్చాము. మత్తు డాక్టర్ లేడని, నిజామాబాద్‌కు రాసిస్తాము, వెళ్లమని నర్సులు సూచిం చారు. మేము గట్టిగా మాట్లాడితే గెంటేశారు.. నేను మేస్త్రి పని చేస్తాను. ఇలా సార్కారు దవాఖానాలో సౌకర్యాలు లేక పోతే మాలాం టి వాళ్లు ఎటు పోవాలే. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలే. ఇంత పెద్ద ఆస్పత్రి ఉండి ఏందుకు...అసలు మొత్తానికే కాన్పులు చేయమని బోర్డులు పెడితే సరిపోతుంది కదా మా సావు మేం సస్తాం. ఎందుకు సర్కారు ఆస్పత్రికి రమ్మంటున్నారు మరి. ఆర్డీఓకు ఫోన్ చేస్తే డాక్టరు ఎలా చెబితే అలా చేయాలి అంటూ పెట్టేసారు. అడ్మిటైతే చేసుకున్నారు.. -బాల్‌రాజు, అయ్యవారిపల్లి, భిక్నూర్ నేను ఐకేపీలో విధులు నిర్వహిస్తున్నాను. నాభార్యకు పురిటి నొప్పులు వస్తే కాన్పు కోసం తీసుకువచ్చాను. నర్సులు చూడకుం డానే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమన్నారు. నేను ఆర్డీఓకు ఫోన్ చేసాను. గట్టిగా మాట్లాడితే అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు. ఆపరేషన్ అంటే మరి భయంగా ఉం ది. మత్తు డాక్టర్ లేరని బయటకు పంపుతారో ఏమో.. -
గర్భిణులకూ గుర్తింపు సంఖ్య
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గర్భిణులకూ గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని ఫోగ్సీ (ఫెడరేషన్ ఆఫ్ అబెస్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా-జాతీయ ప్రసూతి మరియు గర్భకోశవ్యాధుల వైద్యుల సమాఖ్య) పేర్కొంది. ఫిగో (అంతర్జాతీయ ప్రసూతి, గర్భకోశవ్యాధుల వైద్యుల సమాఖ్య) ప్రతినిధులతో కలిసి ఫోగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ హేమ దివాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. దేశంలో సరాసరిన ప్రతి లక్షమంది గర్భిణుల్లో 212 మంది మృతి చెందుతున్నారని, ఇది అమెరికాలో 13గా ఉందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తనిల్వలు లేకపోవడం, శిక్షణ పొందిన వైద్యులు లేకపోవడం, రవాణా సౌకర్యాల లేమి తదితర కారణాల వల్ల మాతా మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అందుకే ఫాగ్సి, ఫిగో సమాఖ్యల ఆధ్వర్యంలో ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కేంద్రానికి ఇచ్చామని, 2 నెలల్లో ఇది అమల్లోకి రానుందని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులు, ఆశా కార్యకర్తలు గుర్తించిన గర్భిణులకు ఈ గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఆ గర్భిణి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఈ సంఖ్య ఆధారంగా ఆమెకు అందించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఎక్కడ పొరపాటు జరిగినా తెలిసిపోతుందని, దీనిద్వారా మాతా మరణాలను అరికట్టవచ్చునని ఆమె తెలిపారు. ఏపీలోనే ఎక్కువ మరణాలు: దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రసూతి మరణాలు చోటు చేసుకుంటున్నాయని హేమ దివాకర్ అన్నారు. ప్రతి లక్షమంది గర్భిణుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 144 మంది మృతి చెందుతున్నారని తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్యుల ఆధ్వర్యంలో మరో రెండ్రోజుల పాటు గర్భిణుల్లో వచ్చే వివిధ సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు.