
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గర్భిణులకు జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 20 లక్షల మంది తల్లులకు (ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు) వ్యాక్సిన్ వేశారు. అంతేకాదు రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
జూలై 30 రాత్రికి కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, 34,228 మందికి వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్ నోడల్ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment