Vaccination for pregnants
-
AP: ఆయుష్మాన్‌భవ: గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు
చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహిస్తోంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వాస్పత్రుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు కోసం ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన నాటి నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతోంది. అయితే వ్యాక్సినేషన్‌పై అవగాహన లేకపోవడంతో చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇమ్యూనైజేషన్ ప్రక్రియ గర్భిణులు, నవజాత శిశువుల మరణాలకు చెక్ పెట్టడంతో పాటు చిన్నారుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి వ్యాక్సినేషన్ రక్షణ కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్దేశించిన వాతావరణంలో భద్రపరిచి అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులకు వాక్సిన్లను అవసరం మేరకు సరఫరా చేస్తోంది. ప్రతి బుధ, శనివారాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో డాక్టర్లు, నర్సులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు లేని గ్రామాలకు ముందు రోజే ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలియజేసి బుధ, శనివారాల్లోనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 64 పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు, 8 సీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, మాతా శిశు వైద్యశాల, మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రి, ఒంగోలు జీజీహెచ్‌లో వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాదికి జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసులు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 20,603 డోసుల ప్రక్రియ పూర్తయింది. టీకాలు.. పది రకాలు గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు పుట్టిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు నిర్దేశించిన వయసు ప్రకారం ఆయా డోసులు వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్‌కు సంబంధించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ కార్డు ఇచ్చి అందులో వ్యాక్సినేషన్ వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్) ఈ టీకా గర్భం దాల్చిన తొలి రోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్ డోసు వేస్తారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ మొదటిగా పుట్టిన సమయంలో బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్ జీరో మోతాదుతో పాటు హెపటైటీస్ బీ పుట్టిన వెంటనే మోతాదు ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ–1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా–1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్‌ఐపీవీ–1 ఇంజక్షన్ (పోలియో రాకుండా), పెంటావాలెంట్ (డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్, రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్, రోటా మూడో డోసుతో పాటు ఎఫ్‌ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్‌తో పాటు విటమిన్ ఏ ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్, ఓపీవీ బూస్టర్‌తో పాటు ఎంఆర్ రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్సరాలకు డీపీటీ రెండో బూస్టర్ మోతాదు, 10–16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్ వేస్తారు. టీకాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డ వరకు సకాలంలో టీకాలు వేయించాలి. టీకాల కాల పరిమితి ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా తెలుసుకుని సకాలంలో పిల్లలకు టీకాలు వేయించాలి. టీకాల వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడవచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం నిర్దేశించిన రోజుల్లో క్రమం తప్పకుండా జరుగుతోంది. – ఏఎస్ దినేష్‌కుమార్, కలెక్టర్ ఇమ్యూనైజేషన్ ప్రక్రియ పక్కాగా పర్యవేక్షిస్తాం జిల్లాలో నిర్వహించే ఇమ్యూనైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్డులో నమోదు చేస్తున్నాం. ఆశాలు, అంగన్వాడీల ద్వారా వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా తల్లిదండ్రులకు ముందుగానే గుర్తు చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు టీకాలపై అవగాహనతో ఉండి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి పోలియో, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలి. – పద్మజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
గర్భిణులకు వ్యాక్సిన్‌లో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గర్భిణులకు జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 20 లక్షల మంది తల్లులకు (ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు) వ్యాక్సిన్ వేశారు. అంతేకాదు రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. జూలై 30 రాత్రికి కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, 34,228 మందికి వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్ నోడల్ అధికారి చెప్పారు. -
గర్భిణీలకు వ్యాక్సినేషన్.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై గర్భిణీ స్త్రీలు టీకాలు వేసుకోవడానికి కోవిన్‌లో నమోదు చేసుకోవచ్చునని.. లేదా సమీప టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలి?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో కరోనా సోకిన ఓ మహిళా పీడియాట్రియన్ చనిపోయారు. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశాక ఆమె మరణించారు. తాజాగా జరిగిన ఈ సంఘటన గర్భవతులకు కోవిడ్ టీకా ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. మరోవైపు టీకా వేసుకోవడం వల్ల గర్భవతులకు ఎలాంటి నష్టం జరగదని ఇటీవల వెల్లడైన ఓ పరిశోధన స్పష్టం చేసింది. గర్భవతులకు కరోనా వైరస్ సోకడం ద్వారా వారి గర్భంలోని ప్లాసెంటా (మాయ)పై దుష్ప్రభావం చూపుతున్నట్లు గతేడాది మేలో ఓ అధ్యయనంలో తేలింది. మాయ ప్రాధాన్యం కలిగిన ఈ మాయకు వైరస్ నష్టపరుస్తుందన్న విషయం తెలిసింది. అంటే కరోనా సోకిన వారిలో అత్యంత రిస్క్ ఉన్న వారు గర్భిణులే అని చెప్పొచ్చు. మరి ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో.. గత ఏప్రిల్‌లో అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఓ పరిశోధన ప్రచురితమైంది. వ్యాక్సినేషన్ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలి్చంది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ పరిశోధనతో గర్భిణులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులు, వ్యాక్సిన్ అపోహలను కేర్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డా.కావ్య ప్రియ వజరాల నివృత్తి చేశారు. ఫస్ట్‌వేవ్ అనుభవాలే స్ఫూర్తి.. కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో పాజిటివ్ వచ్చి డెలివ రీ అయిన మహిళలకు పుట్టిన పిల్లల్లో ఎలాంటి అవయవ లోపం కని్పంచలేదు. పుట్టిన శిశువుల్లో యాం టీబాడీలు కూడా కని్పంచాయి. అంతేకాకుండా యూకే, అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇన్‌ఫెరి్టలిటీ, సీడీసీ, ఫాగ్సీ గైడ్‌లైన్స్ కూడా గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే భారత్‌లో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అయినా కూడా టీకా లభ్యతను బట్టి కాబోయే తల్లులు కోరుకుంటే ఇవ్వొచ్చు. గర్భం దాలి్చన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిది. అయినా పరిస్థితులను బట్టి వైరస్ విజృంభణ స్థాయిని బట్టి ఏ నెలలోనైనా ఇవ్వొచ్చు. జ్వరం వచి్చనా.. వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో కొందరిలో జ్వరం వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది సాధారణ వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన మాత్రమే. కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే అందరికీ ఇచి్చనట్లే గర్భిణులకు కూడా పారాసిటమాల్ ఇస్తే సరిపోతుంది. నీరు ఎక్కువ తాగాలని సూచించాలి. ఫ్లూ వ్యాక్సిన్‌తో పాటు కలపకూడదు.. తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని గర్భం దాలి్చన తర్వాత సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తుంటా రు. కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే.. ఒకేసారి ఈ రెండూ ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడానికి, కోవిడ్ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. ప్రసవం తర్వాత కూడా టీకా తీసుకోవచ్చు. c -
ప్రతి చిన్నారికి టీకాలు వేయాలి
మహబూబ్‌నగర్ టౌన్ : మిషన్ ఇంద్ర ధనుస్సు కార్యక్రమంలో భాగంగా ప్రతి చిన్నారికి టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడతలో 1300మంది చిన్నారులు, 101మంది గర్భిణులకు టీకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుగాను 300 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మోరే, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి కృష్ణ పాల్గొన్నారు. జిల్లాను పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలపాలి జిల్లాను పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్ని ప్రొత్సహించే లక్ష్యంతో టీఎస్ఐ పాస్ చట్టాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల డీడీ శ్రీనివాస్, అశోక్‌కుమార్, రమాదేవి, సరిత, శ్యాంసుందర్, నర్సింహారెడ్డి, అంజూమ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కల పోషణ చూసుకోవాలి : కలెక్టర్ మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల పోషణను చూసుకోవాలని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో పారిశ్రామిక వేత్తలు, పెట్రోల్ బంక్ యజమానులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో అటవీ విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతుండడం విచారకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా 5.60కోట్ల మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. నాటేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇష్టం వచ్చిన మొక్కలను ఇండ్లతోపాటు, పరిసరప్రాంతాల్లో నాటుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, డీఎఫ్ఓ వెంకటేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.