మహబూబ్‌నగర్ టౌన్ : మిషన్ ఇంద్ర ధనుస్సు కార్యక్రమంలో భాగంగా ప్రతి చిన్నారికి టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడతలో 1300మంది చిన్నారులు, 101మంది గర్భిణులకు టీకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుగాను 300 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మోరే, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి కృష్ణ పాల్గొన్నారు.
జిల్లాను పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలపాలి
జిల్లాను పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్ని ప్రొత్సహించే లక్ష్యంతో టీఎస్‌ఐ పాస్ చట్టాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల డీడీ శ్రీనివాస్, అశోక్‌కుమార్, రమాదేవి, సరిత, శ్యాంసుందర్, నర్సింహారెడ్డి, అంజూమ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పోషణ చూసుకోవాలి : కలెక్టర్
మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల పోషణను చూసుకోవాలని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో పారిశ్రామిక వేత్తలు, పెట్రోల్ బంక్ యజమానులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో అటవీ విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతుండడం విచారకరమన్నారు.
జిల్లా వ్యాప్తంగా 5.60కోట్ల మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. నాటేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇష్టం వచ్చిన మొక్కలను ఇండ్లతోపాటు, పరిసరప్రాంతాల్లో నాటుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి చిన్నారికి టీకాలు వేయాలి
Published Sat, Jun 6 2015 12:21 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement