గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలి? | No Complications If Pregnant Women Are Vaccinated: Gynecologist | Sakshi
Sakshi News home page

గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలి?

Published Fri, May 14 2021 2:08 PM | Last Updated on Fri, May 14 2021 2:08 PM

No Complications If Pregnant Women Are Vaccinated: Gynecologist - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో కరోనా సోకిన ఓ మహిళా పీడియాట్రియన్‌ చనిపోయారు. సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీశాక ఆమె మరణించారు. తాజాగా జరిగిన ఈ సంఘటన గర్భవతులకు కోవిడ్‌ టీకా ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. మరోవైపు టీకా వేసుకోవడం వల్ల గర్భవతులకు ఎలాంటి నష్టం జరగదని ఇటీవల వెల్లడైన ఓ పరిశోధన స్పష్టం చేసింది. గర్భవతులకు కరోనా వైరస్‌ సోకడం ద్వారా వారి గర్భంలోని ప్లాసెంటా (మాయ)పై దుష్ప్రభావం చూపుతున్నట్లు గతేడాది మేలో ఓ అధ్యయనంలో తేలింది. మాయ ప్రాధాన్యం కలిగిన ఈ మాయకు వైరస్‌ నష్టపరుస్తుందన్న విషయం తెలిసింది. అంటే కరోనా సోకిన వారిలో అత్యంత రిస్క్‌ ఉన్న వారు గర్భిణులే అని చెప్పొచ్చు. మరి ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో.. గత ఏప్రిల్‌లో అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ అబ్స్‌టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీలో ఓ పరిశోధన ప్రచురితమైంది.

వ్యాక్సినేషన్‌ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలి్చంది. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ పరిశోధనతో గర్భిణులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులు, వ్యాక్సిన్‌ అపోహలను కేర్‌ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ డా.కావ్య ప్రియ వజరాల నివృత్తి చేశారు. 
   
ఫస్ట్‌వేవ్‌ అనుభవాలే స్ఫూర్తి.. 
కరోనా ఫస్ట్‌వేవ్‌ సమయంలో పాజిటివ్‌ వచ్చి డెలివ రీ అయిన మహిళలకు పుట్టిన పిల్లల్లో ఎలాంటి అవయవ లోపం కని్పంచలేదు. పుట్టిన శిశువుల్లో యాం టీబాడీలు కూడా కని్పంచాయి. అంతేకాకుండా యూకే, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ఇన్‌ఫెరి్టలిటీ, సీడీసీ, ఫాగ్సీ గైడ్‌లైన్స్‌ కూడా గర్భిణులకు వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చని ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే భారత్‌లో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అయినా కూడా టీకా లభ్యతను బట్టి కాబోయే తల్లులు కోరుకుంటే ఇవ్వొచ్చు. గర్భం దాలి్చన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిది. అయినా పరిస్థితులను బట్టి వైరస్‌ విజృంభణ స్థాయిని బట్టి ఏ నెలలోనైనా ఇవ్వొచ్చు. 

జ్వరం వచి్చనా.. 
వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిలో కొందరిలో జ్వరం వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది సాధారణ వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన మాత్రమే. కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే అందరికీ ఇచి్చనట్లే గర్భిణులకు కూడా పారాసిటమాల్‌ ఇస్తే సరిపోతుంది. నీరు ఎక్కువ తాగాలని సూచించాలి. ఫ్లూ వ్యాక్సిన్‌తో పాటు కలపకూడదు.. 
తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని గర్భం దాలి్చన తర్వాత సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్‌ ఇస్తుంటా రు. కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే.. ఒకేసారి ఈ రెండూ ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి, కోవిడ్‌ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. ప్రసవం తర్వాత కూడా టీకా తీసుకోవచ్చు.   c

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement