న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఏజీఐ) సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై గర్భిణీ స్త్రీలు టీకాలు వేసుకోవడానికి కోవిన్‌లో నమోదు చేసుకోవచ్చునని.. లేదా సమీప టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment