ఢిల్లీ: భారత్‌లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ.
కేంద్రం తాజాగా శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న(గురువారం) ఈ సంఖ్య 5,300గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక కేసుల సంఖ్య పోను పోను పెరుగుతుండంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవియా ఇవాళ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనల నడుమ గతంలో కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కూడా. అయినప్పటికీ వైరస్‌ను ప్రజలు తేలికగా తీసుకుంటుడడం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైలెవల్ మీటింగ్ జరగనుంది.
దేశంలో ఎక్స్‌బీబీ.1.16 వేరియెంట్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ తీవ్రత తక్కువే అయినా.. వ్యాప్తి వేగంగా ఉంటోంది. హైబ్రిడ్ ఇమ్యూనిటీ(వ్యాక్సినేషన్, ఇదివరకే ఇన్‌ఫెక్షన్ సోకి తగ్గిపోవడం) వల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రజలు వైరస్‌ను తేలికగా తీసుకోవడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయి. ఒకవేళ వేరియెంట్‌లో గనుక విపరీతమైన మార్పులు సంభవిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు సైంటిస్టులు.
తెలంగాణ గురుకులంలో 15 కేసులు
ఇదిలా ఉంటే.. తెలంగాణ మహబూబాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురుకుల పాఠశాలలో చదువుకునే 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు సూచించారు. జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలో పారిశుధ్య పనులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment