బాలల కోసం నటి విరాళాల సేకరణ | Dia Mirza to raise funds for underprivileged kids | Sakshi
Sakshi News home page

బాలల కోసం నటి విరాళాల సేకరణ

Published Fri, Oct 14 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

బాలల కోసం నటి విరాళాల సేకరణ

బాలల కోసం నటి విరాళాల సేకరణ

ముంబై: ఒకప్పటి సినిమా తారలు కేవలం నటనకే పరిమితమయ్యేవారు. ఆ తర్వాత తరంవారిలో కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో సినిమా తారలు పాల్గొనడం చాలా అరుదు. కానీ ఇప్పటి తరం తారలు మాత్రం నటనతోపాటు సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇటువంటివారిలో ముందుంటుంది దియా మీర్జా. తారగా, అందాల పోటీల్లో విజేతగా నిలిచిన దియా సామాజిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటోంది.

నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా దియా మాట్లాడుతూ.. ‘కెట్టో అనే ఆన్ లైన్ వెబ్‌సైట్‌ ద్వారా పేదల పిల్లల కోసం నిధుల సేకరించాలని జెనెసిస్‌ ఫౌండేషన్ నిర్ణయించింది. దానికి పెద్ద ఎత్తున ప్రచారం అవసరం. అందుకు ఎవరైనా సెలబ్రిటీలు కావాలని అడిగిన వెంటనే నేను ఒప్పుకున్నా. ఇవ్వడం, పంచుకోవడం, ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవడం వంటి పదాలంటే నాకెంతో ఇష్టమ’ని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement