Dia Mirza And Vaibhav Rekhi Blessed With Baby Boy Avyaan - Sakshi
Sakshi News home page

Dia Mirza: తల్లి అయిన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించిన నటి

Jul 14 2021 12:54 PM | Updated on Jul 14 2021 2:19 PM

Dia Mirza And Vaibhav Rekhi Blessed With Baby Boy Ayaan - Sakshi

బాబు అవ్యాన్‌ మే 14న పుట్టాడు. అనుకున్న సమయానికంటే చాలా ముందుగానే జన్మించాడు. కానీ అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడు..

Dia Mirza Welcome Baby Boy: బాలీవుడ్‌ భామ దియా మీర్జా తన అభిమానులకు శుభవార్త తెలిపింది. ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా పసివాడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బాబుకు 'అవ్యాన్‌ ఆజాద్‌ రేఖి' అని నామకరణం చేస్తున్నట్లు వెల్లడించింది. "మా బాబు అవ్యాన్‌ మే 14న పుట్టాడు. అనుకున్న సమయానికంటే చాలా ముందుగానే జన్మించాడు. కానీ అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడు. ఇప్పుడతడు క్షేమంగానే ఉన్నాడు. త్వరలోనే మా ఇంట్లోకి రాబోతున్న ఈ బుడ్డోడిని ఎత్తుకునేందుకు అవ్యాన్‌ అక్కతోపాటు, అతడి నానమ్మతాతయ్యలు కూడా తెగ ఎదురు చూస్తున్నారు" అని నటి చెప్పుకొచ్చింది. తల్లైన దియా మీర్జాకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా దియా మీర్జా గతంలో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లాడింది. ఐదేళ్ల ప్రయాణం తర్వాత విడాకుల ద్వారా అతడితో తెగదింపులు చేసుకుంది. అనంతరం ఆమె వైభవ్‌ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఫిబ్రవరి 15న ముంబైలో ఘనంగా జరిగింది. ఇక పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయాన్ని కూడా ఆమె నిర్మొహమాటంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే దియా మీర్జా ఇటీవలే కింగ్‌ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్‌ డాగ్‌' మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement