2000 సంవత్సరంలో మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకోవడానికి ముందు దియా మీర్జా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ కిరీటం అందుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయింది దియా. అయితే దీనికంటే ముందు ఆమె ఓ తమిళ సినిమాలో కూడా నటించింది. కాకపోతే ఎటువంటి ప్రాధాన్యత లేని ఓ చిన్న పాత్రలో! తాజాగా ఈ విషయాన్ని దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
'1999లో ఎన్ శ్వాస కాట్రే అనే తమిళ చిత్రం చేశాను. కేఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో జుంబలక్కా అనే పాటలో హీరోయిన్ ఫ్రెండ్‌గా, సైడ్ డ్యాన్సర్‌గా నటించాను. సరిగ్గా చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్స్‌ట్రాగా ఉన్నాను. నాకు డబ్బులవసరం కావడంతో ఈ సాంగ్ చేశాను. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగింది. షూటింగ్ అంతా ఎంతో బాగా జరిగింది.
నాకు బాగానే డబ్బులిచ్చారు. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు' అని చెప్పుకొచ్చింది. తర్వాతి ఏడాది మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకున్న తర్వాత దియా మీర్జా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెహనా హై తేరే దిల్ మే, దీవానాపన్, దమ్, లగే రహో మున్నా భాయ్ వంటి పలు చిత్రాలు చేసింది. తెలుగులో వైల్డ్ డాగ్ సినిమాలో నటించింది. ఇటీవల రిలీజైన భీద్‌లోనూ మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment