
సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వాళ్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతుంటాయి. మొన్నటికి మొన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలువురు హీరో, హీరోయిన్ల హోటల్ రూమ్ వీడియోలు బయటకు వచ్చాయి.
ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తాను. గతంలో హీరోయిన్స్ బాత్‌రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో భయపడ్డాను. అప్పటి నుంచి ఓ హోటల్‌కి వెళ్లినా అక్కడ రహస్య కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతాను. నేను వచ్చాకే రూమ్ కేటాయించమని చెబుతాను' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం దియామీర్జా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 2001లో రెహనా హై టెర్రే దిల్ మే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన దియా మీర్జా తెలుగులో వైల్డ్ డాగ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment