
దియా మిర్జా
బాలీవుడ్ నటి దియా మిర్జా త్వరలోనే టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా మిర్జాను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పరిణీతా, దస్, లగేరహో మున్నాభాయ్, క్యాష్, సంజు’ వంటి హిందీ సినిమాల్లో నటించారు దియా. ‘వైల్డ్ డాగ్’ ఆమెకు తొలి తెలుగు సినిమా. త్వరలోనే దియా మీర్జా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ‘‘దియా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్నది కావడంతో ఆమె న్యాయం చేస్తారనే నమ్మకంతో తీసుకున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఎన్.ఎమ్. పాషా, జగన్‌మోహన్ వంచ.
Comments
Please login to add a commentAdd a comment