ములాయంకు ఓటు వేయను: విద్యాబాలన్ | Vidya Balan , Dia Mirza appalled at Mulayam Singh Yadav's comment | Sakshi
Sakshi News home page

ములాయంకు ఓటు వేయను: విద్యాబాలన్

Published Fri, Apr 11 2014 5:09 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

ములాయంకు ఓటు వేయను: విద్యాబాలన్ - Sakshi

ములాయంకు ఓటు వేయను: విద్యాబాలన్

ముంబై: రేపిస్టులను సమర్ధిస్తూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ తారలు విద్యాబాలన్, దియా మీర్జాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ క్షమించరాని నేరమని విద్యాబాలన్ అన్నారు.
 
యువకులు తప్పు చేయడం సహజం అంటూ ములాయం వెనుకేసుకు రావడాన్ని విద్యాబాలన్ తప్పపట్టారు. శిక్ష విధించడంపై అనేక అభిప్రాయ భేదాలున్నప్పటికి రేప్ ఏమాత్రం క్షమించరానిదని ఆయన అన్నారు. మహిళ మనోభావాల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ములాయంకు ఓటు వేసేది లేదని విద్యాబాలన్ అన్నారు. 
 
అలాగే ములాయం సింగ్ వ్యాఖ్యలు అత్యంత శోచనీయం, విషాదకరమైనవని మరో బాలీవుడ్ తార దియా మిర్జా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఓ మహిళ, మనిషిగా ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement