రాజ్యాంగపరంగా సక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ ఓటర్లకు బాలీవుడ్ తారలు నేహా దూపియా, అదితిరావు, దియా మిర్జాలు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో దియా మిర్జాలు విజ్క్షప్తి చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైంది.
అనుపమ్ ఖేర్
ఓటు అనేది ఓ భద్రత. ఎవరికైనా ఓటు వేయండి. కాని ఓటు వేయకుండా ఉండకండి. మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓ చక్కటి అవకాశం. వెళ్లి ఓటేయండి.
సోహా ఆలీ ఖాన్
ఢిల్లీ ప్రజల్లారా ఓటు వినియోగించుకోండి. ఓ వాయిస్ ను వినిపించడానికి, మీకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటేయ్యడమే సరియైన మార్గం.
నేహ దూపియా
మంచైనా.. చెడైనా.. మీ నేతకు మీరే బాధ్యత వహించాలి. ఓటు వేసిన తర్వాత ఇంక్ తో కూడిన వేలిని గుర్తును ట్విటర్ లో పెట్టండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అంటూ ట్వీట్ చేశారు.
అదితిరావు
ఈ రోజు మీ రోజు. ఢిల్లీ ప్రజల్లారా ఓటు వేయడానికి వెళ్లండి. మీ దేశం. మీ నగరం కోసం ఓటు వేయండి
చేతన్ భగత్
మీ బాస్ ఎవరో చూపండి. హ్యపీగా ఓటు వేసిరండి
దియా మీర్జా
అతి ముఖ్యమైన హక్కును సక్రమంగా వినియోగించండి. ఓటు వేయండి.
కోయిల్ పూరీ
మీరు ఓటు వేశారా? నేను నా ఓటును సీక్రెట్ గా వేశాను. 15 సంవత్సరాలుగా పాలిస్తున్న షీలా నానీ(నానమ్మ) రిటైర్ కావాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అని ట్వీట్ చేశారు.
కునాల్ కోహ్లీ
ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలి. వెళ్లండి.. త్వరపడండి.
గుల్ పనాగ్
ఢిల్లీ ప్రజల్లారా ఓటు వేయడానికి కదలండి. రాష్ట్ర జరిగే సంఘటనలు తర్వాత నిందించకుండా సరియైన వ్యక్తికి ఓటు వేయండి