ఆప్ తరఫున పోటీ చేయను
Published Fri, Jan 17 2014 12:09 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: తాను రాజకీయాల్లోకి చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ కొట్టిపారేశారు. సినిమా రంగంలో తాను సంతృప్తిగానే ఉన్నానని, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున బరిలోకి దిగబోనని ఆయన గురువారం ట్విటర్‌లో స్పష్టం చేశారు. ఆప్ తరఫున బరిలోకి దిగుతారా అంటూ ఓ నిర్మాత తన ను అడిగాడని, అలా చేస్తే ఆయన సినిమా షూటిం గ్ మాటేమిటని అనుపమ్ ప్రశ్నించారు. సినిమా ప్రపంచంలో ఉండడం తనకు ఎంతో ఆనందం కలి గిస్తోందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గళం విప్పడం అవసరమే అయినప్పటికీ దాని కోసం రాజకీయ వేదిక అవసరమేమీ లేదన్నారు.
Advertisement
Advertisement