
Radhika Apte Shocking Comments On Heroines Cosmetic Surgerie: నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్‌నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ‘‘ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం హిందీలో ఫొరెన్సిక్, విక్రమ్‌వేదా చిత్రాల్లో నటిస్తుంది.
చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరోయిన్ల కాస్మొటిక్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకున్న హీరోయిన్స్ చాలామందిని చూశాను. చాలామంది సర్జరీలు చేయించుకొని వారి వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు.
చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం
అలాంటి వారిని చూసి నేను విసిగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్స్‌పై రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అలాగే తనకు బి-టౌన్ పార్టీస్, కల్చర్ పడదని చెప్పింది. ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావరణంలో ఏమాత్రం ఇమడలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివి నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ విరామ సమయాన్ని ఆస్వాదిస్తా’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment