cosmetic surgeries
-
ఊపిరి తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్
దొడ్డబళ్లాపురం: జట్టు రాలిపోయి అందం చెడిపోతోంది, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని బాగా కనిపించాలని అనుకున్న యువకుడు ప్రాణాలే కోల్పోయాడు. కాస్మెటిక్ సర్జరీలు వికటిస్తే ఫలితం ఘోరంగా ఉంటుందనేందుకు మరో ఉదంతం తోడైంది. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. స్థానిక అక్కరెకెరె నివాసి మహమ్మద్ మాజీన్కు జుట్టు రాలిపోయే సమస్య ఉంది. దీంతో మంగళూరు బెందోర్వెల్లో ఉన్న ఫ్లోంట్ కాస్మెటిక్ సర్జరీ– హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లో సంప్రదించాడు. అక్కడ నిపుణులు అతనికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేస్తుండగా మహమ్మద్ ఆరోగ్యం విషమించింది. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందాడు. నిపుణుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. -
అందం కోసం ఫిల్లింగ్స్, ప్లాస్టిక్ సర్జరీలు.. హీరోయిన్ ఏమందంటే?
అందంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు! సెలబ్రిటీలైతే మరీనూ.. అందంగా ఉండేందుకు, అందాన్ని నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అవసరమైతే సర్జరీలకు కూడా వెనుకాడరు. కానీ చాలామంది జనాలు.. సర్జరీలు చేయించుకునే సెలబ్రిటీలను తెగ విమర్శిస్తుంటారు. ఈ విషయంలో తారలకే సపోర్ట్ చేస్తానంటోంది మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్. ఈమె ఆపరేషన్ వాలంటైన్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ప్లాస్టిక్ సర్జరీలకు సపోర్ట్ చేస్తారా? ఇకపోతే శనివారం (ఫిబ్రవరి 10న) ఢిల్లీలో జరిగిన మిస్ వరల్డ్ 2024 ప్రీ లాంచ్ ఈవెంట్‌కు ఈ హీరోయిన్ హాజరైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానుషికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఫిల్లర్స్, కాస్మొటిక్ సర్జరీలను ఎంచుకోవడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అని ఒకరు అడిగారు. దీనికి మానుషి స్పందిస్తూ.. 'ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. కొత్తగా ఉంది కాదు, వేల ఏళ్ల క్రితం నుంచే.. మొదటిది.. మన దేశ చరిత్రను చూసినట్లయితే వేల సంవత్సరాల క్రితం కూడా సౌందర్య నిపుణులు ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే బ్యూటీని పెంపొందించుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రెండోది.. అందం విషయంలో ఎవరి ఇష్టం వారిది. వారికి ఎలా కనిపించాలనుకుంటే అలా రెడీ అవుతారు. అందుకోసం ఏం చేసినా తప్పు లేదు. అది వారి వ్యక్తిగత విషయం. సర్జరీనో, మరింకేదో చేయించుకున్నారని వారిని తప్పుపట్టడం సరికాదు. అయినా దాని గురించి అందరూ చర్చించాల్సిన అవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది మానుషి చిల్లర్. చదవండి: కళ్యాణ వైభోగమే నటి ఇంట బారసాల ఫంక్షన్ -
Pratibha Naithani: యాసిడ్ సమాజానికి సర్జరీ
పిల్లలను దృష్టిలో పెట్టుకొని టీవీ కార్యక్రమాల్లో అసభ్యత, హింస చూపడాన్ని వ్యతిరేకించడంలో పేరొందారు ముంబై వాసి డాక్టర్ ప్రతిభా నైతాని. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా కాస్మెటిక్ వైద్యం అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం జరగాలంటూ ఆయా మంత్రిత్వ శాఖల చుట్టూ తిరుగుతూ, దోషులకు శిక్ష పడేలా చేశారు, చేస్తున్నారు. డాక్టర్ ప్రతిభ కష్టానికి ఫలితంగా చట్టం మారింది, దోషులకు శిక్షలు పెరిగాయి. యాసిడ్ దాడి బాధితుల జీవితాలు కాస్త తేలికయ్యాయి. అయితే, గడిచిన ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రతిభా నైతాని ఎన్నో విషయాలను మీడియా ముందుంచారు. ‘‘పంతొమ్మిదేళ్ల క్రితం.. ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ అశోక్ గుప్తాతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. డాక్టర్ అశోక్ అప్పటికే తన పనితో పాటు సామాజిక సేవ కూడా చేస్తుండేవారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేద, గిరిజనులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తుండేవారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన నేను, ఈ సర్జరీలలో సహాయంగా ఉండేదాన్ని. యాసిడ్ దాడి కేసులు మొదట్లో ఒకటో రెండో వచ్చేవి. తర్వాత్తర్వాత వీటి సంఖ్య పెరుగుతుండటం గమనించాను. వీరికి ఉచితంగా సర్జరీలు చేయడమొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకున్నాను. వీటిని అరికట్టేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. దోషులకు శిక్షను పెంచాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ, లా కమిష¯Œ వరకు ప్రదక్షిణలు చేశాను. ముంబై నుంచి ఢిల్లీకి తరచూ ప్రయాణించేదాన్ని. గతంలో యాసిడ్ దాడి దోషులకు శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. నిందితులకు కేవలం ఆరు నెలలు మాత్రమే బెయిలబుల్ శిక్ష ఉండేది. కానీ అమ్మాయి జీవితమంతా నరకమే. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మరిన్ని ఇబ్బందులు తప్పవని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేవారు. దీంతో వారికి న్యాయం జరిగేది కాదు. కత్తి గాయం, యాసిడ్ మంట ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరి శరీరంపై యాసిడ్ పోయడం హత్య కంటే ఘోరమైన నేరం. ఈ విషయంలో చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 2013లో ఐపిసి లో 32-6A, 32-6B సెక్షన్లు చేర్చబడ్డాయి. దీని ప్రకారం, నిందితుడు దోషిగా తేలితే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అపరాధి నుండి జరిమానా కూడా వసూలు చేయబడుతుంది. దీంతో బాధితురాలి కోసం ఎంతో కొంతైనా చేయగలిగామనే ధీమా వచ్చింది. బాధితులకు పునరావాసం ‘‘యాసిడ్ దాడి బాధితులు సమాజంలో జీవించడం కష్టం. ఈ అమ్మాయిలకు పని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా సందర్భాల్లో చికిత్స ఖర్చులు పెరిగి, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు కూడా తెలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కేటగిరీలో చేర్చాలని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి వికలాంగుల కోటాలో వచ్చే అన్ని సౌకర్యాలు వారికి కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలోనూ విజయం సాధించాం’’. ఉచిత వైద్య చికిత్స ‘‘యాసిడ్ దాడి బాధితులకు ప్రతి నగరంలో ఉచితంగా చికిత్స అందించాలన్నది మరో డిమాండ్. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం లేదు. ఏ ఆసుపత్రి అయినా, ఎక్కడ ఉన్నా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ మేరకు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిష¯Œ దాఖలు చేశారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుబాటులో ఉండకూడదు బహిరంగంగా విక్రయించే యాసిడ్‌కు సంబంధించి, దాని విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశాం. సాధారణ దుకాణాల్లో యాసిడ్ ఉండకూడదు. ఎప్పుడు, ఎవరు కొన్నారు, దేనికి వినియోగిస్తున్నారనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విధానం వల్ల యాసిడ్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ప్రాణాలతో పోరాటం యాసిడ్ దాడి బాధను భరిస్తూ జీవితంలో ముందుకు సాగిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అలాంటి అమ్మాయిలలో లలిత ఒకరు. దాడి జరిగి, తీసుకువచ్చినప్పుడు, ఆమె గాయాల వాసనకు, జనం క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఏ అమ్మాయీ యాసిడ్ బారిన పడకుండా అందరూ ఆనందంగా జీవించాలి’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారీ వైద్యురాలు. -
ఆ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోయాను : రాధికా ఆప్టే
నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే యంగ్ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోతున్నట్లు తెలిపింది. లుక్స్ కారణంగా ఎప్పుడైనా సినిమాల్లో పాత్రలను కోల్పోయారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'హీరోయిన్స్‌కి ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ప్రధానమైన అంశం. అందుకే కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అంతేకాకుండా టాలెంట్‌ని కాకుండా లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఉంది. నేను మాత్రం అందం అనే మాయలో తాను ఎప్పుడూ పడలేదు. యవ్వనంగా కనిపించడం కోసం తాను ఎప్పుడూ సర్జీలను నమ్ముకోలేదు. అవకాశాల కోసం ఏనాడు అడ్డదారులు తొక్కలేదు. కానీ సక్సెస్ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చింది. -
అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే
Radhika Apte Shocking Comments On Heroines Cosmetic Surgerie: నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ‘‘ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం హిందీలో ఫొరెన్సిక్, విక్రమ్‌వేదా చిత్రాల్లో నటిస్తుంది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరోయిన్ల కాస్మొటిక్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకున్న హీరోయిన్స్ చాలామందిని చూశాను. చాలామంది సర్జరీలు చేయించుకొని వారి వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం అలాంటి వారిని చూసి నేను విసిగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్స్‌పై రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అలాగే తనకు బి-టౌన్ పార్టీస్, కల్చర్ పడదని చెప్పింది. ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావరణంలో ఏమాత్రం ఇమడలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివి నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ విరామ సమయాన్ని ఆస్వాదిస్తా’ అని తెలిపింది. -
సెల్ఫీలతో బుక్కవుతున్నారు..
లండన్ : సెల్ఫీలతో ప్రాణాలను పణంగా పెడుతున్న ఉదంతాలు కోకొల్లలుగా వెల్లడవుతుంటే తాజాగా సెల్ఫీలతో కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటూ ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తుండటంతో పెద్దసంఖ్యలో యువత కాస్మెటిక్ సర్జరీతో ముక్కు తీరును మార్చుకుంటోందని ఓ అథ్యయనం వెల్లడించింది. ముఖానికి 12 ఇంచ్‌ల దూరం నుంచి తీసుకున్న ఫోటోల్లో ముక్కు పరిమాణం 30 శాతం పెరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో కాస్మెటిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్న యువత తమ ఆరోగ్యాలను పణంగా పెడుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొంతమంది ఫేస్బుక్, ట్విటర్లలో తాము బాగా కనిపించాలనే తపనతో ముక్కు సర్జరీలకు ముందుకొస్తున్నారని అథ్యయనంలో పాల్గొన్న 42 శాతం మంది ప్లాస్టిక్ సర్జన్లు చెప్పారు. మీ ముఖ ఆకృతిలో సెల్ఫీ ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఫేషియల్ ప్లాస్టిక్స్, రీకన్స్ర్టక్టివ్ సర్జన్ డాక్టర్ బొరిస్ పషోవర్ చెప్పారు. తమ ముక్కు ఆకృతి సరిగా లేదని సెల్ఫీలను తీసుకొస్తున్న పేషెంట్లకు తాను వారి ముక్కు వాస్తవంగా అలా లేదన్న విషయం విడమరచి చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. -
చర్మం ఒలిచేస్తున్నారు!
-
చర్మం ఒలిచేస్తున్నారు!
వంద చదరపు అంగుళాల ధర లక్ష రూపాయలు..! ఇది చర్మం విలువ. మనిషి చర్మం, అందునా మహిళ చర్మం.. నేపాలీ మహిళ చర్మం విలువ!! భారతదేశంలోని ధనవంతుల సౌందర్య శస్త్ర చికిత్సలకు, కాలిన గాయాల సర్జరీలకు ఈ చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. భారత కాస్మొటిక్ సర్జరీ మార్కెట్లో ఈ చర్మానికి రోజురోజుకూ ధర పెరుగుతోంది. కానీ అందుకు ఆరోగ్యవంతమైన, తెల్లని చర్మం కావాలి. దీంతో నేపాలీ యువతులు, మహిళల చర్మాన్ని నిలువునా ఒలుచుకుంటున్నారు. ఇప్పటికే నేపాలీల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని అక్కడి మహిళలను వేశ్యలుగా మారుస్తూ అక్రమ రవాణా చేస్తున్న మాఫియా రాకెట్లు ఇప్పుడు ఈ కొత్తదందాకు వారినే బలిపశువులుగా వాడుకుంటున్నాయి. మహిళల చర్మాన్ని దౌర్జన్యంగా ఒలుచుకుని డబ్బు చేసుకుంటున్నారు. ఒళ్లు గగుర్పొడిపించే ఈ దారుణ దందా గుదించి సోమా బసు అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నేపాల్ ఇండియాల్లో పర్యటించి పరిశోధించి వెలుగులోకి తీసుకొచ్చారు. తాజాగా ఒకవెబ్సైట్లో ప్రచురించిన ఈ పరిశోధనాత్మక కథనంలోని ముఖ్యాంశాలు ఇవీ. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) నేపాల్ రాజధాని నగరం ఖట్మాండూలో థామెల్ ప్రాంతం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కళ్లు తెరుస్తుంది. అప్పుడిక అక్కడ ప్రతీదీ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. నైట్ క్లబ్బులు వెలుగులీనుతుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే భారత విలాస పురుషులకు ఇదో చిన్న లాస్ వేగాస్ లాంటిది. ఇక్కడ చాలామంది ఏజెంట్లు ఉంటారు. వాళ్లలో 14-15 ఏళ్ల బాలురు కూడా ఉంటారు. వీధుల్లో మగ పర్యాటకులకు ఇక్కడి నైట్‌క్లబ్బుల్లో లభించే సేవల గురించి చెబుతూ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ పార్లర్లలో నేపాలీ యువతులు, మహిళలు పురుషులకు కావాల్సిన సేవలు అందిస్తారు. నైట్ క్లబ్బులు, మసాజ్ పార్లర్లలో వేశ్యలుగా.. నేపాల్‌లోని గ్రామీణ ప్రాంతాల యువతులు మహిళలు చాలామంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెంట్లు వారిని వేశ్యలుగా మార్చి నైట్‌క్లబ్బులు, మసాజ్ పార్లర్లకు తీసుకొస్తారు. ఆ మహిళలు మొదటి మూడు నెలల జీతం ఆ ఏజెంట్లకు కమీషన్ కింద చెల్లించాలి. దక్షిణాసియా దేశాల నుంచి.. ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చే పురుషులు ఇక్కడ విటులు. యువతి కాస్త చక్కగా ఉంటే ఒక్కో 'సిటింగ్'కి రూ.5000 వరకూ చెల్లిస్తారు. కానీ కొంత కాలానికి చాలా మంది యువతుల శరీరాలు గాయాలతో మాసికలు పడిపోతాయి. ఇలా గాయాల మచ్చలున్నవారికి రూ.300 నుంచి రూ.500 దక్కడమే ఎక్కువ. ఇక ఆ మహిళలు కండోమ్ వాడాలని పట్టుపడితే అది కూడా ఇవ్వరు. అలాగే చాలా మంది నేపాలీ యువతులు మహిళలను భారతదేశంలోని కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాల్లో వేశ్యావాటికలకు తరలించడం షరా మామూలే. అధికారిక మార్గాల నుంచి కాకుండా దొంగదారుల్లో ఈ యువతులను అక్రమ రవాణా చేస్తారు. మాదక ద్రవ్యాల మత్తులో ముంచేసి.. ఈ పార్లర్లు, వేశ్యావాటికల్లో విటుల విపరీత పోకడలు, పైశాచిక కోరికలకు ఈ మహిళలు సహకరించడానికి వీలుగా మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఇచ్చి వారిని మంచానికి కట్టేస్తారు. ఆ మత్తు ప్రభావం నుంచి బయటపడి తెలివి వచ్చేసరికి ఈ మహిళల శరీరాలు గాయాతో నెత్తురోడుతూ ఉంటాయి. వీపు, పొత్తి కడుపు, తొడలు, అన్ని భాగాల్లో చర్మం లేకుండా గాయాలు తేరి ఉంటాయి. దీంతో వారు వెంటనే ప్రాణభయంతో పరుగులు పెడతారు. అవన్నీ విటులు వైశాచిక ఆనందం కోసం చేసిన గాయాలనే అనుకుంటారు. తమ కర్మకు తమనే నిందించుకుంటూ ఆ వృత్తిలోనే కొనసాగుతారు. కాకపోతే వారికి అంతకు ముందున్న డిమాండ్ ఉండదు. వారిలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. వారి శరీరం నుంచి చర్మం ఒలుచుకున్నారని, నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారని, దానిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటారని! తర్వాత తెలిసినా వారు చేయగలిగింది ఏమీ లేదు.. మౌనంగా రోదించడం తప్ప! తెల్ల చర్మానికి గిరాకీ ఎక్కువ మనుషుల చర్మానికి.. ముఖ్యంగా తెల్లని మేని ఛాయ గల మహిళల చర్మానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఓ 100 చదరపు అంగుళాల చర్మపు ముక్క ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ పలుకుతుంది. ఆ చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్ ల్యాబులకు అమ్ముతారు. అక్కడ చర్మం టిష్యూను శుద్ధి చేసి అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్సు ఉన్న పెద్ద ల్యాబులకు సరఫరా చేస్తారు. అందులో కొన్ని చాలా ప్రముఖ ల్యాబులు కూడా ఉన్నాయి. అమెరికాలో శుద్ధి చేసిన చర్మాన్ని అల్లోడెర్మ్ లేదా అలాంటి ఉత్పత్తులుగా అభివృద్ధి చేస్తారు. తిరిగి ఇతర దేశాలతో పాటు భారతదేశానికి ఎగుమతి చేస్తారు. వీటిని పురుషాంగ పరిమాణం పెంపు, మహిళల వక్షోజాల పరిమాణం పెంపు, పెదవులు సరిచేయడం, కాలిన గాయాలను సరిచేయడం వంటి శరీరాకృతి సౌందర్య, సౌష్టవాలను పెంపొందించే సర్జరీల్లో ఉపయోగిస్తారు. ఈ సర్జరీలకు ఇప్పుడు భారతదేశంలో గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. బాధితుల సమ్మతితోనూ చర్మం తీసుకుంటారు గిరాకీ ఉండటంతో ఈమధ్య ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషుల్లో చాలా మంది మద్యపానం, ధూమపానం చేస్తుంటారు కాబట్టి వారి కన్నామహిళల చర్మం, కిడ్నీలు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి మహిళలనే ఎక్కువగా ఇందు కోసం ఎంచుకుంటారు. పైగా నేపాలీ మహిళల చర్మం తెల్లగా ఉండటం వల్ల దాన్ని కాకాసియన్ జాతి వ్యక్తి చర్మంగా నమ్మించగలగడం సులభం. అందువల్ల కూడా వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. కొందరు మహిళల నుంచి వారి సమ్మతితోనే చర్మం తీసుకుంటారు. నిజానికి నేపాల్‌లో చాలా మంది పేదరికం, అప్పుల వల్ల కిడ్నీలు, చర్మం విక్రయించడం షరా మామూలుగా మారింది. మానవ అవయవాల విక్రయం నేపాల్‌లో చట్ట ప్రకారం నేరం. ఇండియాలో కూడా ఈ క్రయ విక్రయాలు నిషిద్ధం. అయితే రిజిస్టర్ చేసుకున్న అవయవ దాతల నుంచి మాత్రమే అవయవాలను, టిష్యూలను తీసుకోవచ్చు. దీంతో చర్మం తీసుకోవడానికి అటు నేపాల్‌లో ఇటు ఇండియాలో నకిలీ ధ్రువపత్రాలను కూడా తయారు చేస్తున్నారు. ఏజెంట్లకు కాసుల వర్షం కాస్మొటిక్ సర్జరీ కోసం చర్మం కాలసిన వారు ముందుగా ఇండియాలో లేదా నేపాల్‌లో ఒక ఏజెంటును సంప్రదిస్తారు. అవసరమైన చర్మపు రంగు, ఫొటో, సదరు వ్యక్తి రక్తపు గ్రూపు తదితర వివరాలతో పాటు నిజమైన కస్టమరో కాదో నిర్ధారించుకోవడానికి చికిత్సకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో శాంపిల్ చర్మాన్ని పంపిస్తారు. అడ్వాన్సుగా కొంత మొత్తం తీసుకుంటారు. "ఏ మహిళ చర్మం తీసుకుంటారో ఆ మహిళకు రూ.5,000 నుంచి రూ.10,000 చెల్లిస్తారు. ఆ చర్మం శాంపిల్‌ను పంపిన మొదటి ఏజెంటుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ లభిస్తాయి. ఆ మహిళను భారత్ - నేపాల్ సరిహద్దుల వరకూ తీసుకెళ్తారు. అక్కడి నుంచి మరొక ఏజెంటు వారిని సరిహద్దు దాటించి ఇండియాకు తీసుకెళ్లి మూడో ఏజెంటుకు అప్పగిస్తారు. ఆ మూడో ఏజెంటు ఆమె నుంచి చర్మం ఒలిపించే ఏర్పాట్లు చేస్తాడు. ఆ చర్మాన్ని తాము దానం చేశామని, అమ్మలేదని సదరు మహిళ ధ్రువపత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుందని 40 ఏళ్ల ట్రాఫికర్ ప్రేమ్ బాస్గాయ్ చెప్పాడు. నేపాల్‌లోని కాబ్రేపాలన్చౌక్ జిల్లాలో కిడ్నీలు విక్రయిస్తున్న కేసులో ఇతడిని గత ఏడాది అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. బాధితులే ఏజెంట్లగా మారుతున్నారు కుసుమ్ శ్రేష్ఠ అనే మహిళ వయసు 40 ఏళ్లు. ఆమె ఖట్మాండుకు 62 కిలోమీటర్ల దూరంలోని నుకాకోట్ గ్రామంలో నివసిస్తున్నారు. తన చర్మాన్ని ఒక ఏజెంట్‌కు అమ్మారు. ఆ ఏజెంట్‌కు బలమైన నెట్వర్క్ ఉందని, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాహసిస్తే వారి కుటుంబాన్ని హింసిస్తారని భయం భయంగా చెప్పారు. నిజానికి చాలా కుటుంబాల వారు జీవనాధారం కోసం చిన్న చిన్న పనులు చేయడానికి ఏజెంట్ల మీద ఆధారపడతారు. అలా కిడ్నీలు, చర్మం అమ్ముకున్న బాధితులు కూడా ఆ తర్వాత ఏజెంట్లుగా మారుతున్న ఉదంతాలున్నాయి. ప్రేమ్ బాస్గాయ్ ఇలాగే ఏజెంటుగా మారాడు. తొలుత అతడు, అతడి భార్య తమ కిడ్నీలు అమ్ముకున్నారు. ఆ డబ్బులు అయిపోయాక ఇతరులను కిడ్నీలు అమ్మడానికి ఒప్పించి కమీషన్ తీసుకునే ఏజెంటుగా మారాడు. ఎదురుతిరిగితే చంపేసి కాల్వలో తొక్కేస్తారు కాబ్రేపాలన్చౌక్ జిల్లా నేపాల్‌లో కిడ్నీ బ్యాంకుగా పేరుపడింది. ఇక్కడి జనంలో చాలామంది కిడ్నీలు అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 300 కిడ్నీలు అక్రమ రవాణా చేసినట్లు బయటపడినా కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. చర్మం విక్రయాల పరిస్థితి ఇంతే. ఈ రాకెట్ చాలా పకడ్బందీగా అనేక అంచెల్లో ఉండటం ఒక ఎత్తయితే ఆ విషయం ఎక్కడైనా బయటపెడితే తమతో పాటు తమ కుటుంబసభ్యులకు జరిగే ప్రాణహాని గురించిన భయం మరో ఎత్తు. దీంతో బాధితులు ఎవరూ ఎక్కడా నోరు విప్పడానికి ఇష్టపడరు. "ఎవరు ఫిర్యాదు చేస్తారు? అక్కడ ప్రాణానికి విలువ లేదు. కస్టమర్లను సుఖపెట్టడానికి నిరాకరించిన మహిళలను, పారిపోవడానికి ప్రయత్నించిన వారిని చంపేసి మురుగుకాల్వల్లో తొక్కేసిన ఘటనలు నా కళ్లతో చూశాను. ఒక కస్టమర్ నా రెండేళ్ల కుమారుడి నాలుకను సిగరెట్లతో కాల్చాడు. నా కుమారుడికి ఇప్పుడు ఐదేళ్లు. అయినా ఇంకా సరిగ్గా మాట్లాడలేడు. ఈ కూపాల నుంచి మమ్మల్ని రక్షించి పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు గతం గురించి మేం మాట్లడం. దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి భయానక సంఘటనలేవీ జరగలేదని మాకు మేము సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం" అని రేఖ అనే మహిళ వివరించారు. ఆమె వయస్సు 30 ఏళ్లు దాటింది. ఆమె కిడ్నీని విక్రయించారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికలకు ఆమెను పంపించారు.