అందం కోసం ఫిల్లింగ్స్‌, ప్లాస్టిక్‌ సర్జరీలు.. హీరోయిన్‌ ఏమందంటే? | Manushi Chhillar Opinion On Botox, Fillers And Cosmetic Surgeries, Deets Inside - Sakshi
Sakshi News home page

Manushi Chhillar On Plastic Surgeries: అందం కోసం ప్లాస్టిక్‌ సర్జరీ.. అందులో తప్పేముందన్న హీరోయిన్‌

Published Sat, Feb 10 2024 7:09 PM | Last Updated on Sat, Feb 10 2024 8:23 PM

Manushi Chhillar Opinion on Botox, Fillers and Cosmetic Surgeries - Sakshi

అందంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు! సెలబ్రిటీలైతే మరీనూ.. అందంగా ఉండేందుకు, అందాన్ని నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అవసరమైతే సర్జరీలకు కూడా వెనుకాడరు. కానీ చాలామంది జనాలు.. సర్జరీలు చేయించుకునే సెలబ్రిటీలను తెగ విమర్శిస్తుంటారు. ఈ విషయంలో తారలకే సపోర్ట్‌ చేస్తానంటోంది మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌. ఈమె ఆపరేషన్‌ వాలంటైన్‌ అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.

ప్లాస్టిక్‌ సర్జరీలకు సపోర్ట్‌ చేస్తారా?
ఇకపోతే శనివారం (ఫిబ్రవరి 10న) ఢిల్లీలో జరిగిన మిస్‌ వరల్డ్‌ 2024 ప్రీ లాంచ్‌ ఈవెంట్‌కు ఈ హీరోయిన్‌ హాజరైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానుషికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఫిల్లర్స్‌, కాస్మొటిక్‌ సర్జరీలను ఎంచుకోవడాన్ని మీరు సపోర్ట్‌ చేస్తారా? అని ఒకరు అడిగారు. దీనికి మానుషి స్పందిస్తూ.. 'ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి.

కొత్తగా ఉంది కాదు, వేల ఏళ్ల క్రితం నుంచే..
మొదటిది.. మన దేశ చరిత్రను చూసినట్లయితే వేల సంవత్సరాల క్రితం కూడా సౌందర్య నిపుణులు ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే బ్యూటీని పెంపొందించుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రెండోది.. అందం విషయంలో ఎవరి ఇష్టం వారిది. వారికి ఎలా కనిపించాలనుకుంటే అలా రెడీ అవుతారు. అందుకోసం ఏం చేసినా తప్పు లేదు. అది వారి వ్యక్తిగత విషయం. సర్జరీనో, మరింకేదో చేయించుకున్నారని వారిని తప్పుపట్టడం సరికాదు. అయినా దాని గురించి అందరూ చర్చించాల్సిన అవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది మానుషి చిల్లర్‌.

చదవండి: కళ్యాణ వైభోగమే నటి ఇంట బారసాల ఫంక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement