మరో నెలలో ఆపరేషన్‌ | Varun Tej Operation Valentine Releasing On March 1st | Sakshi
Sakshi News home page

మరో నెలలో ఆపరేషన్‌

Published Sun, Feb 4 2024 12:11 AM | Last Updated on Sun, Feb 4 2024 12:45 AM

Varun Tej Operation Valentine Releasing On March 1st - Sakshi

దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా, హీరోయిన్‌ మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు.

శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ఈ నెలలోనే విడుదల కావాల్సింది. అయితే మార్చి 1న రిలీజ్‌ చేయనున్నట్లు శనివారం యూనిట్‌ ప్రకటించింది. ‘‘ఈ చిత్రం టీజర్,పోస్టర్లు, రిపబ్లిక్‌ డేకి ముందు విడుదల చేసిన దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్‌ సింగిల్‌ ‘వందేమాతరం...’ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement