
మానుషీ చిల్లర్, వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి హిందీ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మించిన ఈ మూవీ తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘వందేమాతరం..’ అంటూ సాగే తొలి పాటని అమృతసర్‌లోని వాఘా సరిహద్దులో విడుదల చేశారు.
‘చూడరా సంగ్రామ శూరుడు.. మండె రా మధ్యాహ్న సూర్యుడు.. చావునే చెడాడు ధీరుడు.. నిప్పులు కురిశాడు.. వందేమాతరం..’ అంటూ ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ ఆలపించారు. ‘‘ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతమైన ‘వందేమాతరం..’ని వాఘా సరిహద్దులో విడుదల చేశాం. ఇక్కడ రిలీజ్ చేసిన తొలి పాటగా ‘వందేమాతరం..’ చరిత్ర సృష్టించింది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ పాట ఆవిష్కరణలో వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్‌తో సహా టీమ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment