Fillers
-
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకు చేస్తారంటే.. పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గతంలో ఇలానే యూఎస్‌కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
అందం కోసం ఫిల్లింగ్స్, ప్లాస్టిక్ సర్జరీలు.. హీరోయిన్ ఏమందంటే?
అందంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు! సెలబ్రిటీలైతే మరీనూ.. అందంగా ఉండేందుకు, అందాన్ని నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అవసరమైతే సర్జరీలకు కూడా వెనుకాడరు. కానీ చాలామంది జనాలు.. సర్జరీలు చేయించుకునే సెలబ్రిటీలను తెగ విమర్శిస్తుంటారు. ఈ విషయంలో తారలకే సపోర్ట్ చేస్తానంటోంది మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్. ఈమె ఆపరేషన్ వాలంటైన్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ప్లాస్టిక్ సర్జరీలకు సపోర్ట్ చేస్తారా? ఇకపోతే శనివారం (ఫిబ్రవరి 10న) ఢిల్లీలో జరిగిన మిస్ వరల్డ్ 2024 ప్రీ లాంచ్ ఈవెంట్‌కు ఈ హీరోయిన్ హాజరైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానుషికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఫిల్లర్స్, కాస్మొటిక్ సర్జరీలను ఎంచుకోవడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అని ఒకరు అడిగారు. దీనికి మానుషి స్పందిస్తూ.. 'ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. కొత్తగా ఉంది కాదు, వేల ఏళ్ల క్రితం నుంచే.. మొదటిది.. మన దేశ చరిత్రను చూసినట్లయితే వేల సంవత్సరాల క్రితం కూడా సౌందర్య నిపుణులు ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే బ్యూటీని పెంపొందించుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రెండోది.. అందం విషయంలో ఎవరి ఇష్టం వారిది. వారికి ఎలా కనిపించాలనుకుంటే అలా రెడీ అవుతారు. అందుకోసం ఏం చేసినా తప్పు లేదు. అది వారి వ్యక్తిగత విషయం. సర్జరీనో, మరింకేదో చేయించుకున్నారని వారిని తప్పుపట్టడం సరికాదు. అయినా దాని గురించి అందరూ చర్చించాల్సిన అవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది మానుషి చిల్లర్. చదవండి: కళ్యాణ వైభోగమే నటి ఇంట బారసాల ఫంక్షన్ -
కొంప ముంచిన కట్టెల పొయ్యి
గరికివలస గ్రామంలో రోజూలాగే గ్రామస్తులంతా పొలం పనులకు ఆదివారం ఉదయం వెళ్లిపోయారు. గ్రామంలో ఓ పూరింట్లో వెలిగించిన కట్టెల పొయ్యిను ఆర్పడం మరచిపోయారు. అది కాస్త గాలికి రాజి మంటలు చేలరేగాయి. దీంతో పొట్నూరు తవుడు ఇల్లు కాలిపోయింది. తరువాత పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఏడు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. జరిగిన సంఘటనతో బాధితులంతా గొల్లుమన్నారు. గుర్ల: మండలంలోని గరికివలసలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన పొట్నూరు తవుడు ఇంట్లో ఉన్న కట్టెల పోయ్యి బొగ్గులు అర్పకుండా వదిలేశారు. గాలికి బొగ్గులు నిప్పు రాజుకోని ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. తరువాత మంటలు పక్కనే ఉన్న పొట్నూరు ఆదిలక్ష్మి, పొట్నూరు లక్ష్మి, పొట్నూరు పాపినాయుడు, పెనుమజ్జి పైడమ్మ, పొట్నూరు తవిటినాయుడు, పొట్నూరు పాపినాయుడు ఇళ్లకు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఇళ్లల్లో సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు బోరుమన్నారు. గ్రామంలో అందరూ పోలం పనులకు వెళ్లిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నేత బెల్లాన వెంకటరమణ, వీఆర్వో మీసాల చిన్నారావు ఉన్నారు. పాతబగ్గాంలో... గజపతినగరం రూరల్: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన లెంక అప్పయ్యమ్మ మిద్దె ఇల్లు ఆదివారం కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే...కార్తీక మాసం పూజలు చేస్తున్న సందర్భంగా పలువురు ఇంట్లో దీపాలు పెట్టడంతో ఆ దీపం ద్వారా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లెంక అప్పయ్యమ్మ ఇంట్లో తినడానికి దాచుకున్న ధాన్యం, బట్టలు, తదితర వంట సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితురాలు కట్టుబట్టలతో మిగిలింది. ప్రమాదం జరిగినప్పుడు అప్పయ్యమ్మ వరి కోతలకు వెళ్లి పోయింది. ఆమె కుమార్తె వరలక్ష్మి ఇంటి వద్ద ఉంది. సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసిన వెంటనే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మహేశ్వరరావు గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నష్టాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజీవరావు అంచనా వేశారు. సర్పంచ్ లెంక పద్మావతి బాధితురాలిని పరామర్శించారు. -
బదిలీ ఫిల్లర్లు
శ్రీరాంపూర్, నూ్యస్లైన్ : సింగరేణి యాజమన్యం బదిలీ ఫిల్లర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించకుండా వెట్టిచాకిరీ చేయిస్తోంది. యాజమాన్యం ఫిల్లర్లపై ఒక విధంగా, కార్మికులపై మరో విధంగా డొల్లతనం కనబరుస్తోంది. దీనికి బదిలీ ఫిల్లర్ కార్మికులే ఉదాహరణ. కంపెనీ నిబంధనల ప్రకారం ఏడాదిలో 190 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేయాలి. కానీ, ఐదేళ్ల నుంచి చేయకుండా మొండికేస్తున్నది. 2009 నుంచి కంపెనీలో బదిలీ ఫిల్లర్ల పర్మినెంట్ నిలవడంతో సుమారు 1200 మంది పర్మినెంట్‌కు నోచుకోకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారు. గడిచిన నాలుగైదు ఏళ్ల నుంచి మెడికల్ అన్ఫిట్లు ఎక్కువ కావడంతో వారి స్థానంలో వచ్చే డిపెండెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఎవరు ఉద్యోగంలో చేరిన ముందు వారికి బదిలీ ఫిల్లర్ డిసిగ్నేషన్ ఇచ్చి తట్టమోయిస్తారు. విధుల్లో చేరిన తరువాత సంవత్సరంలో 190 మస్టర్లు నిండితే వారిని కోల్ఫిల్లర్లుగా పర్మినెంట్ చేయాలని కంపెనీ నిబంధనలో ఉంది. యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కారణం కంపెనీకి ఆర్థిక నష్టం జరుగుతుందనే దురుద్ధేశంతోనే. దీంతో బదిలీ ఫిల్లర్లు తీవ్ర వేతన నష్టం చవిచూస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం రాక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే 2009కి ముందు కూడా పర్మినెంట్ కాని వారు కొందరున్నారు. 2007, 2008లో కూడా కొంత మంది బదిలీ ఫిల్లర్లు 190 మస్టర్లు నిండక పర్మినెంట్ నోచుకోలేదు. వారు అలాగే మిగిలిపోతున్నారు. వేతనాల్లో తీవ్ర ఆర్థిక నష్టం పర్మినెంట్‌కు నోచుకోకపోవడంతో బదిలీ ఫిల్లర్లు వేతన నష్టం అవుతోంది. పర్మినెంట్ అయితే మైన్ ఆవరేజ్ కట్టి ఇవ్వాలి. మైన్ ఆవరేజ్ రాకపోవడంతో రోజు రూ.200 వరకు ఒక్కో బదిలీ ఫిల్లర్ నష్టపోతున్నాడు. ఇలా సంవత్సరానికి రూ. 2500 వరకు వేతన నష్టం జరుగుతున్నది. దీంతోపాటు పెరిగే వేతనం మీద వచ్చే ఇతర అలవెన్సులు కూడా నష్టం అవుతోంది. బదిలీ ఫిల్లర్లు చేసే యాక్టింగ్‌ను కూడా లెక్కలోకి తీసుకోరు. అదే సీఎఫ్‌గా అయ్యి ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఉన్న ఖాళీల్లో భ ర్తీ చేస్తారు. పర్మినెంట్ కార్మికులతో సమానమైన పని చేసిన కూడా బదిలీ ఫిల్లర్ వీటిన్నింటిని కోల్పోతున్నారు. దీనితోపాటు ఉద్యోగ భద్రత ఉండదు. ఇదేమని ప్రశ్నించే అధికారం కూడా వారికి ఉండదు. పని లేనప్పుడు అవసరమైతే బదిలీ ఫిల్లర్లను ఇంటికి తిప్పి పంపించవచ్చు. బదిలీ ఫిల్లర్లు ఏదేని చిన్నతప్పు చేసినాయాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా ఉంది. దీంతో బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. పట్టించుకోని సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా అన్ని యూనియన్లు వారి ఎన్నికల మెనిఫేస్టోలో తాము గెలిస్తే బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేస్తాం అని పేర్కొనడం గెలిచిన తరువాత మర్చి పోవడం షరామాములూ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణ వాదంలో ముందుకు వచ్చిన టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారు కూడా పర్మినెంట్ చేయించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. గెలిచిన తరువాత గ్రూపులు కట్టి పంచాయతీలు పెట్టుకోవడం ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యలపై లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం యాజమాన్యం కూడా బాధ్యతాయుతంగా వ్యహరించాలని కోరుతున్నారు. ఇకనైన ఆలస్యం చేయకుండా తమను పర్మినెంట్ చేయాలని కార్మికుడు డిమాండ్ చేస్తున్నారు.