శ్రీరాంపూర్, నూ్‌యస్‌లైన్ : సింగరేణి యాజమన్యం బదిలీ ఫిల్లర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించకుండా వెట్టిచాకిరీ చేయిస్తోంది. యాజమాన్యం ఫిల్లర్లపై ఒక విధంగా, కార్మికులపై మరో విధంగా డొల్లతనం కనబరుస్తోంది. దీనికి బదిలీ ఫిల్లర్ కార్మికులే ఉదాహరణ. కంపెనీ నిబంధనల ప్రకారం ఏడాదిలో 190 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేయాలి. కానీ, ఐదేళ్ల నుంచి చేయకుండా మొండికేస్తున్నది. 2009 నుంచి కంపెనీలో బదిలీ ఫిల్లర్ల పర్మినెంట్ నిలవడంతో సుమారు 1200 మంది పర్మినెంట్‌కు నోచుకోకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారు.
గడిచిన నాలుగైదు ఏళ్ల నుంచి మెడికల్ అన్‌ఫిట్లు ఎక్కువ కావడంతో వారి స్థానంలో వచ్చే డిపెండెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఎవరు ఉద్యోగంలో చేరిన ముందు వారికి బదిలీ ఫిల్లర్ డిసిగ్నేషన్ ఇచ్చి తట్టమోయిస్తారు. విధుల్లో చేరిన తరువాత సంవత్సరంలో 190 మస్టర్లు నిండితే వారిని కోల్‌ఫిల్లర్లుగా పర్మినెంట్ చేయాలని కంపెనీ నిబంధనలో ఉంది. యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కారణం కంపెనీకి ఆర్థిక నష్టం జరుగుతుందనే దురుద్ధేశంతోనే. దీంతో బదిలీ ఫిల్లర్లు తీవ్ర వేతన నష్టం చవిచూస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం రాక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే 2009కి ముందు కూడా పర్మినెంట్ కాని వారు కొందరున్నారు. 2007, 2008లో కూడా కొంత మంది బదిలీ ఫిల్లర్లు 190 మస్టర్లు నిండక పర్మినెంట్ నోచుకోలేదు. వారు అలాగే మిగిలిపోతున్నారు.
వేతనాల్లో తీవ్ర ఆర్థిక నష్టం
పర్మినెంట్‌కు నోచుకోకపోవడంతో బదిలీ ఫిల్లర్లు వేతన నష్టం అవుతోంది. పర్మినెంట్ అయితే మైన్ ఆవరేజ్ కట్టి ఇవ్వాలి. మైన్ ఆవరేజ్ రాకపోవడంతో రోజు రూ.200 వరకు ఒక్కో బదిలీ ఫిల్లర్ నష్టపోతున్నాడు. ఇలా సంవత్సరానికి రూ. 2500 వరకు వేతన నష్టం జరుగుతున్నది. దీంతోపాటు పెరిగే వేతనం మీద వచ్చే ఇతర అలవెన్సులు కూడా నష్టం అవుతోంది. బదిలీ ఫిల్లర్లు చేసే యాక్టింగ్‌ను కూడా లెక్కలోకి తీసుకోరు. అదే సీఎఫ్‌గా అయ్యి ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఉన్న ఖాళీల్లో భ ర్తీ చేస్తారు.
పర్మినెంట్ కార్మికులతో సమానమైన పని చేసిన కూడా బదిలీ ఫిల్లర్ వీటిన్నింటిని కోల్పోతున్నారు. దీనితోపాటు ఉద్యోగ భద్రత ఉండదు. ఇదేమని ప్రశ్నించే అధికారం కూడా వారికి ఉండదు. పని లేనప్పుడు అవసరమైతే బదిలీ ఫిల్లర్లను ఇంటికి తిప్పి పంపించవచ్చు. బదిలీ ఫిల్లర్లు ఏదేని చిన్నతప్పు చేసినాయాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా ఉంది. దీంతో బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు.
పట్టించుకోని సంఘాలు
గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా అన్ని యూనియన్లు వారి ఎన్నికల మెనిఫేస్టోలో తాము గెలిస్తే బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేస్తాం అని పేర్కొనడం గెలిచిన తరువాత మర్చి పోవడం షరామాములూ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణ వాదంలో ముందుకు వచ్చిన టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారు కూడా పర్మినెంట్ చేయించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. గెలిచిన తరువాత గ్రూపులు కట్టి పంచాయతీలు పెట్టుకోవడం ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యలపై లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం యాజమాన్యం కూడా బాధ్యతాయుతంగా వ్యహరించాలని కోరుతున్నారు. ఇకనైన ఆలస్యం చేయకుండా తమను పర్మినెంట్ చేయాలని కార్మికుడు డిమాండ్ చేస్తున్నారు.
బదిలీ ఫిల్లర్లు
Published Tue, May 6 2014 1:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement