sri rampur
-
కవితపై తరుణ్‌చుగ్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్‌చుగ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కోట్ల రూపాయల ఆదాయం గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సింగరేణిలో పెత్తనం చలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌లో పర్యటించిన ఆయన.. అక్కడి కార్మికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కవితపై విమర్శలు గుప్పించారు. సింగరేణికి కవిత యూనియన్ లీడర్‌గా మారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మికులు, కార్మిక నేతలపై ఆధిపత్యం చేలాయిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి అవినీతికి అడ్డాగా మారిందన్నారు. సింగరేణిలో అవినీతిని చూస్తూ ఊరుకోమన్నారు. సింగరేణి సీఎండీ సరిగా పనిచేయడం లేదని,, టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. కాగా తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి తరుణ్‌చుగ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీయే లక్ష్యంగా పెట్టుకుని విమర్శలు సందిస్తున్నారు. కుమ్రంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన చత్రపతి శివాజీ సంకల్ప సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ హజరయ్యారు. వీరి సమక్షంలో సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ పాల్వాయి హరీష్ బాబు పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పాల్వాయి హరీష్ బాబు, అయన అనుచరులను పార్టీలోకి అహ్వనించారు. ఈ సభకు పాల్వాయి అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. -
సమస్యల్లో సర్వే కార్మికులు
శ్రీరాంపూర్ : కొత్త గని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ దిశలో టన్నెల్ మొదలు పెట్టాలి? ఎంత దూరంలో బొగ్గు ఉంది? అన్న సమగ్ర సమాచారంతో సింగరేణి లో పని చేసేదే సర్వే డిపార్టుమెంటు. ఇందులో పనిచేసే కార్మికులే సింగరేణి అభివృద్ధి ముఖ చిత్రకారులు అని చెప్పవచ్చు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సర్వే డిపార్టుమెంట్ కార్మికులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే వీరి సమస్యలపై యాజమాన్యం, గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదు. సింగరేణి వ్యాప్తంగా సర్వే డిపార్టుమెంటులో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. సర్వే మజ్దూర్లు మొదలుకుని అసిస్టెంట్ చైన్మన్, చైన్మన్, హెడ్ చైన్మన్ ఆపై సర్వే అధికారి ఉంటారు. ఎగ్జిక్యూటీవ్‌ల సంగతి అటుంచితే కిందిస్థాయి కార్మికులు విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీలతో పెరుగుతున్న పనిభారం సింగరేణి వ్యాప్తంగా సర్వే డిపార్టుమెంటులో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 100 పోస్టులు కంపెనీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో వారి భారం మొత్తం ఉన్న వారిపై పడుతుంది. భూగర్భంలో, ఓసీపీల్లో ఇతర డిపార్టుమెంటుల్లో ఉన్న సర్వే ఉద్యోగులందరు పని భారంతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా భూగర్భంలో సర్వే కోసం ప్రత్యేక టీం ఉంటుంది. ఇందులో హెడ్ చైన్మన్ లేదా చైన్మన్ ఒకరు, ఇద్దరు అసిస్టెంట్ చైన్మెన్లు, ఒక సర్వే మజ్ధూరు ఉంటాడు. మొత్తం నలుగురు. పనిభారం తగ్గాలంటే మరో మజ్ధూరును ఇవ్వాలని వారు కోరుతున్నారు. అంతే కాకుండా చాలా గనులు జీవితకా లం పెరుగుతుంది. సింగరేణిలో చాలా గనులు పాత గనులు కావడం వల్ల భూగర్భంలో చాలా లోతుల్లోకి వెళ్లాల్సి వ స్తుంది. కొన్ని గనుల్లో ఒక్క టీంను మాత్రమే పెట్టారు. పని స్థలాలు రోజురోజు పెరగడం వల్ల నడక ఎక్కు వై ఇబ్బందులు పడుతున్నామని వా పోతున్నారు. ఇలాంటి గనుల్లో రెండు టీంలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఉపరితలానికి వచ్చిన తరువాత వారి వద్ద ఉండే పరికరాలు శుభ్రం చేసుకోవడానికి, మ్యాప్‌ల కోసం టేబుల్రెడీ చేసుకోవడం నుంచి మొదలుకొని పేపర్ పని చేయడానికి పైకి వచ్చిన టీంకు రెండు గంటలపాటు సమయం పడుతుందని దీంతో మద్యాహ్నం 1:30 గంటల ప్రాం తలో పైకి ఎక్కాల్సి ఉంటుందని ఈ సమయంలో ఆడిట్ వాళ్లు వచ్చి ముందే ఎందుకు ఎక్కారని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కొన్ని సందర్భాల్లో ఉన్నత అధికారులు పని ఒత్తిడిలో తాము చేసే చిన్నచిన్న తప్పులకు కూడా చార్జిషీట్లు, స స్పెండ్, రివర్షన్లు ఇస్తున్నారని వాపోతున్నారు. విధి నిర్వహణలో కిందిస్థాయిలో తప్పులు చేస్తే దాన్ని గని మేనేజర్ సర్వేయర్లకు చెప్పి లెటర్లు ఇవ్వాల్సి ఉంటుం ది. కానీ అలా చేయకుండా నేరుగా వారే సర్వేయర్లతో సంబంధం లేకుండా లెటర్లు ఇస్తు ఇబ్బందుకు గురి చేస్తున్నారు. సర్వేయర్‌కు తెలియకుండా గనుల్లో అండర్ మేనేజర్లు సర్వే మజ్ధూర్లలతో పనులు చేయిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధము. ప్రమోషన్ పాలసీ మార్చాలి.. సర్వే డిపార్టుమెంటులో ఉన్న ప్రమోషన్ పాలసీ బాగా లేదని కొత్త పాలసీని తయారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్వే మజ్ధూర్ అసిస్టెంట్ చైన్మన్ కావాలంటే అక్కడ ఖాళీ ఉండాలి, నిర్ణీత సర్వీసు చేసి ఉండాలి. మళ్లీ అంతర్గతంగా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైతేనే ప్రమోషన్లు ఇస్తున్నారు. ఈ నిబంధన వల్ల ప్రమోషన్లు ఆలస్యం అవుతుంది. ఖాళీలతో సంబంధం లేకుండా కొంత కాలం ఒకే కేటగిరీలో పనిచేస్తే ఆటోమెటిక్‌గా వారికి ప్రమోషన్ కల్పిస్తూ పైకేటగిరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హెడ్ చైన్మన్ తరువాత సర్వే సూపర్వైజర్లు పోస్టు పెట్టాలని డిమాండ్ వస్తుంది. ఇదిలా ఉంటే కేడర్స్కీంను సవరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం సర్వే మజ్ధూర్లకు 1వ కేటగిరీ కల్పిస్తున్నారని ఇది తాము చేసిన పనికి తక్కువ అని కనీసం డీ గ్రేడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వే డిపార్టుమెంటుపై ఐఈడీ లెక్క తప్పులుగా ఉంది. పెరిగిన పని ఒత్తిడి తగ్గట్లు మ్యాన్ పవర్‌ను లెక్కలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడో చేసిన ఐఈడీ లెక్క ప్రకారమే నడుస్తున్నారని వాటిని సరి చేయాలని కోరుతున్నారు. సర్వే డిపార్టుమెంటు విధులు.. గనికి ముగ్గు పోసి భూమి పూజ చేయడం నుంచి వీరి పని ప్రారంభం అవుతుంది. టన్నెల్ ఎంత దూరం చేయాలి? ఏటవాలు తనం ఎంత ఉండాలి? మ్యాన్ వే ఎంత దూరం నడిస్తే బొగ్గు దొరుకుతుంది? బొగ్గు నిక్షేపాల వద్దకు వెళ్లిన తరువాత భారత బొగ్గు గనుల చట్టం ప్రకారం లెవల్స్, డిప్లు ఎలా మార్కు చేయాలి? హాలేజీ వే ఎలా వెయ్యాలి? రూఫ్ బోల్టింగ్, లాంగ్వాల్ మార్కులు, సర్ఫేస్‌లో బోర్లు ఎక్కడ వేయాలో పూర్తిగా వీరు ఇచ్చే ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ చేయడం, అందులో ఉన్న ఇళ్లు, చెరువులు, చెట్టు, పుట్ట అన్ని రికార్డు చేసి యాజమాన్యానికి పంపిస్తారు. వీరి వద్ద గుండుదారం మొదలుకుని, అత్యాధునిక దుర్బిని వంటి పరికరాలు వినియోగిస్తారు. శాటిలైటు సహాయంతో కూడా కొలతలు కొలిచే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాగా, తమన ఎవరు పట్టించుకోవడం లేదని ఆ డిపార్టుమెంటు కార్మికులు వాపోతున్నారు. ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే గుర్తింపు సంఘం, యాజమాన్యం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇప్పటికైన తమ సమస్యలను గుర్తించాలని కోరుతున్నారు. -
టీబీజీకేఎస్‌లో పైసల లొల్లి
శ్రీరాంపూర్ : సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘానికి కార్మికులు చందా రాసి ఇస్తారు. చందా రాసిచ్చిన కార్మికుని నుంచి ప్రతి నెల రూ.20 వేతనం నుంచి కోత పెట్టి యాజమాన్యం ఆ మొత్తాన్ని యూనియన్‌కు అప్పగిస్తుంది. యూనియన్ సూచించిన ఖాతాలో పోగైన డబ్బులు జమ చేస్తుంది. ప్రస్తుతం ఈ డబ్బులను ఎవరు తీసుకోవాలన్న దానిపై వివాదం మొదలైంది. టీబీజీకేఎస్‌లో 42 వేల మం దికి సభ్యత్వం ఉంది. ఈ లెక్కన ప్రతినెల రూ.8.80 లక్షలు యూని యన్‌కు చందా వస్తుంది. జూన్ 28, 2012న ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి రెండేళ్లు కావస్తుంది. ఈ లెక్కన టీబీజీకేఎస్‌కు కార్మికుల నుంచి వచ్చిన రుసుం సొమ్ము సుమారు రూ.2 కోట్లపైగా ఉంటుంది. ఇందులో కొంత ఇప్పటికే ఖర్చవగా మిగిలిన డబ్బులు మాకే దక్కాలంటూ ఒకరినొకరు తగువులాడుకుంటున్నారు. ఖాతాల్లోనే డబ్బు యూనియన్‌కు వచ్చిన సభ్యత్వ రుసుం యూనియన్ ఖర్చుల కో సం వాడుకుంటారు. కార్యాలయాల నిర్వహణ, సభలు, సమావేశా లు, వాహనాల ఖర్చు ఇలా చందా డబ్బులు వాడుకోవడం జరుగుతుంది. ఈ సొమ్ము ముఖ్య నాయకుల ఖాతాలో ఉంటుంది. మల్ల య్య, రాజిరెడ్డిలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గోదావరిఖనిలోని ఎస్బీఐలో మల్లయ్య పేరు మీద ఖాతాలో జమ అయ్యాయి. మొదట్లో ఈ ఖాతాల నుంచి సుమారు రూ.30లక్షలు తీసి డివిజన్ కమిటీలకు, కేంద్ర కమిటీల ఖర్చుల కోసం వాడుకున్నారు. ఇంకా అందు లో సుమారు రూ.48 లక్ష లు జమై ఉంది. ఇంతలో యూనియన్‌లో కరస్పాండింగ్ చేసే అధికారం ఎవరికి ఉండాలనే దానిపై జూన్ 2013లో వివాదం మొదలైంది. దీంతో ఖాతాలో ఉన్న డబ్బులు మల్లయ్యకు ఇవ్వరాదని రాజిరెడ్డి వర్గం యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం, తరువాత కోర్టుకు పోవడంతో ఈ ఖాత సీజింగ్ అయింది. అప్పటి నుంచి అలాగే ఉంది. వివాదం కోర్టులో ఉన్నందున యాజమాన్యం నెలనెల రికవరీ చేస్తున్న సొమ్మును తన వద్దే ఉంచుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు సుమారు రూ.80 లక్షలు జమ అయ్యాయి. అంతర్గత ఎన్నికల ఖర్చును కూడా యూనియన్ రికవరీ అయిన డబ్బుల నుంచి చెల్లించడం జరిగింది. కోర్టుకు పోవడానికి సిద్ధం అవుతున్న నేతలు మల్లయ్య ఖాతాలో ఉన్న రూ.48 లక్షలు, యాజమాన్యం వద్ద రికవరీ అయిన రూ.80 లక్షలు మిగిలి ఉన్నాయి. ఇందులో ఆర్ఎల్సీ ఎన్నికల ఖర్చు పోను రూ.కోటికి పైగా ఫండ్ మిగిలి ఉంది. ఈ డబ్బుల కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు యూనియన్ నిర్వహణ మా ఆధ్వర్యంలో జరిగిందని, గుర్తింపు ఎన్నికలప్పుడు తెచ్చిన అప్పులు మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం తమ ఖర్చులకే ఇవ్వాలని కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేస్తోంది. వీరు కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే యూనియన్ పుట్టినప్పటి నుంచి సుమారు రూ. 2 కోట్లు వచ్చాయని, గెలిచిన తరువాత మల్లయ్య ఖాతాల్లోకి తీసుకున్న డబ్బులకు కూడా లెక్క చూపాలని రాజిరెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో తాము కూడా ఖర్చు పెట్టామని, సమావేశాలు నిర్వహించామని తెలిపారు. యూనియన్ పగ్గాలు పూర్తిగా తమకే ఇస్తు కోర్టు ఆదేశాలు ఇచ్చిందున యూనియన్‌కు వచ్చిన డబ్బులపై తమకే హక్కు ఉంటుందని అవసరమైతే తాము కూడా కోర్టు పోతామని రాజిరెడ్డి తెలిపారు. దీంతో యూనియన్ మరోసారి కోర్టు మెట్లేక్కె అవకాశం ఉంది. పనిచేయని కాలంలో పైసలెందుకు.. ఏడాది కాలంగా రెండు వర్గాలు కొట్లాటలతోనే సరిపుచ్చాయి. కార్మికుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. యూనియన్‌కు యాజమాన్యంకు స్ట్రక్చరల్ సమావేశాలు నిలిచాయి. గెలిచారు కాబట్టి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తారని చందా రాస్తే ఏడాది కాలంగా వారిలో వారు కొట్టుకుంటున్నారని కార్మికులు మండిపడుతున్నారు. తమ కోసం పని చేస్తారని నమ్మి చందా రాసామని పనే చేయనప్పుడు వారికి డబ్బులు వాడుకునే హక్కెక్కడిదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు నిలిచిన కాలంలో రికవరీ చేసిన డబ్బులు తిరిగి తమకే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
రెండంచెల విధానంలో మెడికల్ బోర్డు
శ్రీరాంపూర్ : మెడికల్ బోర్డులో కొత్త మార్పులు తెచ్చారు. ఇకపై రెండంచెల పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహిస్తారు. కొత్త విధానానికి సంబంధించి యాజమాన్యం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యూలర్ నంబర్ సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్‌అండ్‌పీఎం/సీ/81/2088 ననుసరించి మెడికల్ బోర్డు పని చేస్తుంది. గతంలో ఒకటే బోర్డు ఉంటే కొత్త సర్క్యూలర్ ప్రకారం కార్పొరేట్ మెడికల్ బోర్డు, అప్పిలేట్ మెడికల్ బోర్డు అను రెండు రకాలు బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతీ బోర్డులో ఆరుగురు సభ్యులు ఉంటారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు నెలకు రెండు సార్లు సమావేశం అవుతుంది. ఇందులో సీజీఎం(పీపీ), సీఎంవో, జీఎం(మైనింగ్), జీఎం(పర్సనల్), ఏజీఎం, నిపుణుడైన వైద్యుడు ఉంటారు. అప్పిలేట్ మెడికల్ బోర్డు మూడునెలలకోసారి సమావేశం అవుతుంది. ఇందులో నిమ్స్ నుంచి ఒక వైద్యుడితోపాటు ఐదుగురు కంపెనీ డెరైక్టర్లు, పర్సనల్ అండ్ వెల్ఫేర్, ఆపరే షన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, ఫైన్సాన్స్, ఈఅండ్ఎండ్ విభాగాలకు చెందిన వారు ఉంటారు. కొత్త సర్క్యూలర్ జూలై 1 నుంచి అమలు అవుతుంది. క్యాన్సర్, లెప్రసీ, పెరాలసిస్, గుండెపోటు, అంధత్వం, కిడ్నీల సమస్యలు, గని ప్రమాదాలు, బయటి ప్రమాదాలు, ఎముకలు విరగడం, శరీరాకృతిలో మార్పులు రావడం వంటి పలు వ్యాధులతో బాధపడేవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ధారుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా బోర్డుకు ఎప్పుడు హాజరుకావాలో మెస్సేజ్ వస్తుంది. కార్పొరేట్ బోర్డులో అన్‌ఫిట్ కాని వారు అప్పిలేట్ మెడికల్ బోర్డుకు 60 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ నెల 10న దరఖాస్తు చే సుకున్న వారి దరఖాస్తులను సీరియల్ నంబర్లు ఇచ్చి దాని ఆధారంగా పిలుస్తారు. పీఎంఈ, కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేయబడిన వారికి సీరియల్లో 50 శాతం ప్రాధాన్యతఇస్తారు. ఇంకా 24 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మెడికల్ బోర్డుకు హాజ రైన వారు అదే కారణంతో తిరిగి సంవత్సరం వరకు అనుమతించరు. ఇదిలా ఉంటే కొత్త విధానం వల్ల మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఫిట్ లేదా అన్ఫిట్లు త్వరగా అవుతాయని, గుర్తింపు సంఘంగా తాము ఒత్తిడి చేయడంతోనే యాజమాన్యం ఈ రెండంచెల విధానం ప్రవేశపెట్టిందని టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి గోవర్ధన్, నాయకులు పానుగంటి సత్తయ్య, ఏ సమ్మిరెడ్డి, గోపాల్, రమణారావు తెలిపారు. దీని కోసం తమ యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. -
బదిలీ ఫిల్లర్లు
శ్రీరాంపూర్, నూ్యస్లైన్ : సింగరేణి యాజమన్యం బదిలీ ఫిల్లర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించకుండా వెట్టిచాకిరీ చేయిస్తోంది. యాజమాన్యం ఫిల్లర్లపై ఒక విధంగా, కార్మికులపై మరో విధంగా డొల్లతనం కనబరుస్తోంది. దీనికి బదిలీ ఫిల్లర్ కార్మికులే ఉదాహరణ. కంపెనీ నిబంధనల ప్రకారం ఏడాదిలో 190 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేయాలి. కానీ, ఐదేళ్ల నుంచి చేయకుండా మొండికేస్తున్నది. 2009 నుంచి కంపెనీలో బదిలీ ఫిల్లర్ల పర్మినెంట్ నిలవడంతో సుమారు 1200 మంది పర్మినెంట్‌కు నోచుకోకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారు. గడిచిన నాలుగైదు ఏళ్ల నుంచి మెడికల్ అన్ఫిట్లు ఎక్కువ కావడంతో వారి స్థానంలో వచ్చే డిపెండెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఎవరు ఉద్యోగంలో చేరిన ముందు వారికి బదిలీ ఫిల్లర్ డిసిగ్నేషన్ ఇచ్చి తట్టమోయిస్తారు. విధుల్లో చేరిన తరువాత సంవత్సరంలో 190 మస్టర్లు నిండితే వారిని కోల్ఫిల్లర్లుగా పర్మినెంట్ చేయాలని కంపెనీ నిబంధనలో ఉంది. యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కారణం కంపెనీకి ఆర్థిక నష్టం జరుగుతుందనే దురుద్ధేశంతోనే. దీంతో బదిలీ ఫిల్లర్లు తీవ్ర వేతన నష్టం చవిచూస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం రాక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే 2009కి ముందు కూడా పర్మినెంట్ కాని వారు కొందరున్నారు. 2007, 2008లో కూడా కొంత మంది బదిలీ ఫిల్లర్లు 190 మస్టర్లు నిండక పర్మినెంట్ నోచుకోలేదు. వారు అలాగే మిగిలిపోతున్నారు. వేతనాల్లో తీవ్ర ఆర్థిక నష్టం పర్మినెంట్‌కు నోచుకోకపోవడంతో బదిలీ ఫిల్లర్లు వేతన నష్టం అవుతోంది. పర్మినెంట్ అయితే మైన్ ఆవరేజ్ కట్టి ఇవ్వాలి. మైన్ ఆవరేజ్ రాకపోవడంతో రోజు రూ.200 వరకు ఒక్కో బదిలీ ఫిల్లర్ నష్టపోతున్నాడు. ఇలా సంవత్సరానికి రూ. 2500 వరకు వేతన నష్టం జరుగుతున్నది. దీంతోపాటు పెరిగే వేతనం మీద వచ్చే ఇతర అలవెన్సులు కూడా నష్టం అవుతోంది. బదిలీ ఫిల్లర్లు చేసే యాక్టింగ్‌ను కూడా లెక్కలోకి తీసుకోరు. అదే సీఎఫ్‌గా అయ్యి ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఉన్న ఖాళీల్లో భ ర్తీ చేస్తారు. పర్మినెంట్ కార్మికులతో సమానమైన పని చేసిన కూడా బదిలీ ఫిల్లర్ వీటిన్నింటిని కోల్పోతున్నారు. దీనితోపాటు ఉద్యోగ భద్రత ఉండదు. ఇదేమని ప్రశ్నించే అధికారం కూడా వారికి ఉండదు. పని లేనప్పుడు అవసరమైతే బదిలీ ఫిల్లర్లను ఇంటికి తిప్పి పంపించవచ్చు. బదిలీ ఫిల్లర్లు ఏదేని చిన్నతప్పు చేసినాయాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా ఉంది. దీంతో బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. పట్టించుకోని సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా అన్ని యూనియన్లు వారి ఎన్నికల మెనిఫేస్టోలో తాము గెలిస్తే బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేస్తాం అని పేర్కొనడం గెలిచిన తరువాత మర్చి పోవడం షరామాములూ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణ వాదంలో ముందుకు వచ్చిన టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారు కూడా పర్మినెంట్ చేయించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. గెలిచిన తరువాత గ్రూపులు కట్టి పంచాయతీలు పెట్టుకోవడం ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యలపై లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం యాజమాన్యం కూడా బాధ్యతాయుతంగా వ్యహరించాలని కోరుతున్నారు. ఇకనైన ఆలస్యం చేయకుండా తమను పర్మినెంట్ చేయాలని కార్మికుడు డిమాండ్ చేస్తున్నారు. -
దుర్భరంగానల్లసూరీళ్ల జీవితాలు
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో డిస్మిస్ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. జీతాలు లేక వారి జీవితాలు x`గా మారాయి. సింగరేణి వ్యాప్తంగా 13 వేల మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు. హత్య చేసిన వారికి మరణశిక్ష విధించేటప్పుడు చివరి కోరిక ఏమిటి అని అడిగి తీరుస్తారు. కానీ, సింగరేణి యాజమాన్యం డిస్మిస్ కార్మికులపై ఆ మాత్రం జాలి చూపడం లేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా కనికరించడం లేదు. దీంతో చాలా మంది డిస్మిస్ కార్మికులు కూలినాలీ చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఫలితంగా నాటి బాయి దొరలు నేడు పాలేర్లుగా మారారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా పార్టీల అభ్యర్థులు కోల్‌బెల్ట్‌లో ప్రచారం చేసేటప్పుడు తాము గెలిస్తే డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఓట్లు దండుకుంటున్నారు తప్ప న్యాయం చేయడం లేదు. ఈసారి కూడా అవే హామీలు ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ, కార్మికులు మాత్రం నిశీతంగా పరిశీలిస్తున్నారు. హామీ నెరవేర్చని వారికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనైన చోటు దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చకపోవడం వారికి సమస్యపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. మస్టర్లు తక్కువగా ఉన్నాయనే నెపంతో.. మస్టర్లు తక్కువగా ఉన్నాయనే కారణంతో 1993 నుంచి కార్మికులను డిస్మిస్ చేశారు. సంవత్సరంలో 100 మస్టర్ల కంటే తక్కువగా చేసిన కార్మికులను కనికరం లేకుండా తొలగించారు. ఇలా 2010 వరకు డిస్మిస్ చేస్తూ సింగరేణి యాజమాన్యం వచ్చింది. దీంతో వేలాది మంది కార్మికులు డిస్మిస్ అయి రోడ్లపై పడ్డారు. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగడంతో దిగి వచ్చిన యాజమాన్యం 2000 సంవత్సరంలో హైపవర్ కమిటీ డిస్మిస్ అయిన వారిలో అనారోగ్య కారణాల వల్ల డ్యూటీలు చేయలేదని నిర్ధారించిన 66 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. తరువాత మే 2004లో 85 మందిని తీసుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున డిస్మిస్ కార్మికులు ఉండటంతో ఉద్యమం ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణ సంఘాలు వీరికి మద్దతుగా వచ్చాయి. అనంతరం యాజమాన్యం మళ్లీ ఏప్రిల్ 2012లో మళ్లీ హెపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. కఠిన నిబంధనలు పెట్టి మొత్తం 2,249 మందిని కౌన్సిలింగ్‌కు పిలిచి వారిలో 66 మందికే ఉద్యోగాలు ఇచ్చింది. అనంతరం లోకాయుక్తకు దీనిపై కేసు వెళ్లడంతో మరో 420 మందిని తీసుకున్నారు. కూలీలుగా మారిన కార్మికులు గతంలో సింగరేణిలో కొంత మద్యానికి వ్యసనంగా మారిన వారు, జులాయి తిరుగుడు వల్ల డ్యూటీలు చేయని వారు డిస్మిస్ బారిన పడ్డారు. మరికొంత మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకులు శారీరక శ్రమకు తట్టుకోలేక ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉండటం, మరి కొందరు అనారోగ్య కారణాల వల్ల నాగాలు ఎక్కువగా చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో వారు కూలీలుగా మారారు. జీతం లేకపోవడం చేసేది లేక అడ్డా కూలీలుగా, హోటళ్లలో పనోళ్లుగా, ఇటుక బట్టీలు, ఆటో నడుపుతూ, వ్యవయసాయ కూలీలుగా మారి చాలా మంది డిస్మిస్ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. తప్పు చేశాం పశ్చత్తాప పడుతున్నామని కనీసం ఒక్కసారి అవకాశం ఇస్తే మరోసారి ఇలా చేయకుండా చక్కగా డ్యూటీ చేసి బతుకుదామని మొర పెట్టుకున్న కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. డిమాండ్లు ఇవే.. ఎలాంటి ఆంక్షలు లేకుండా నాగాల పేరుతో డిస్మిస్ అయిన వారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తు ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. 50 ఏళ్ల వయస్సు దాటిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేదా రూ.8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. డిస్మిస్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా 8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం డిస్మిస్ రహిత సింగరేణిగా చేయాలి. -
రమణీయం రంగనాథుని ఆలయం
చెక్కు చెదరని శిల్ప సంపద.... ఆకాశాన్నంటే గాలి గోపురాలు...విలువ కట్టలేని చిత్ర లేఖలు...సువిశాలమైన చెరువు... భక్తి భావాన్ని పెంచి మానసిక ప్రశాంతత నిచ్చే ఆధ్యాత్మికత కేంద్రం...వెరసి ‘రంగాపూర్ రంగనాథుని ఆలయం. కోరిన కోరికలు తీరుతాయని ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది వరకు 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఒకసారి సందర్శిస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే ఈ క్షేత్రానికి వెళ్లొద్దాం ఇలా.... - న్యూస్‌లైన్, పెబ్బేరు ఆకట్టుకునే శిల్పసంపద రంగనాయకస్వామి ఆలయంలో ఉన్న అద్భుతమైన శిల్పసంపద భక్తులను కట్టిపడేస్తుంది. ద్వార పాలక శిల్పాలతో ఆకాశాన్నంటే గాలిగోపురాలతో భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతోంది. శేషాశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో లక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం పక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన సువిశాలమైన శ్రీరంగసముద్రం ఎంతో ఆకట్టుకుటోంది. చెరువు మధ్యలో రాజులు సాయంత్రవేళల్లో విడిది చేసే కృష్ణవిలాస్ భవనం కనిపిస్తుంది. ఆలయంలోని నేల మాళిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారు పూతతో పూసిన అపురూప అరుదైన వివిధ దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. అద్భుత అందాలకు నిలయమైన ఈ ఆలయంలో ఇప్పటికే అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా చేసి, సందర్శకులకు రంగ సముద్రం చెరువులో బోటింగ్ ఏర్పాటు, విడిదికి అవసరమైన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదీ రూట్... 44వ నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎంతో సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు 150 కిలోమీటర్లు, కర్నూలు నుంచి వచ్చే వారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెబ్బేరుకు రావాలి. అక్కడి నుంచి 12 కి.మీ.దూరంలో ఉన్న శ్రీరంగాపూర్ గ్రామానికి ప్రతిరోజు తిరిగే ఆటోల ద్వారా రంగనాయక స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. స్వామి వారి ఉత్సవాలు.. రంగనాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి వీధి ఉత్సవం, సూర్యవాహనసేవ, శేషవాహనసేవ, హనుమంత వాహనసేవ, మోహిని, గరుడ వాహన సేవ, రథోత్సవం నిర్వహిస్తారు. అనంతరం15 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఆలయ చరిత్ర కొర్విపాడు (నేటి శ్రీరంగాపూర్) గ్రామంలో సుమారు 340 సంవత్సరాల క్రితం సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు (క్రీ.శ.1670)కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. గ్రామంలో రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన ఈ రంగనాయక స్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. ఆలయం నిర్మాణంతో కొర్విపాడు ఉన్న ఈ గ్రామం పేరు శ్రీరంగాపూర్‌గా మారింది. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా ఉన్న శ్రీరంగంకు సమానంగా ఈ రంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామి వారిని దర్శించే శక్తి లేని భక్తులు శ్రీరంగాపూర్ లోని ఆలయాన్ని దర్శించి పుణ్యాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.