సమస్యల్లో సర్వే కార్మికులు | job vacancies in singareni survey department | Sakshi
Sakshi News home page

సమస్యల్లో సర్వే కార్మికులు

Published Fri, Jul 18 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

job vacancies in singareni survey department

శ్రీరాంపూర్ : కొత్త గని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ దిశలో టన్నెల్ మొదలు పెట్టాలి? ఎంత దూరంలో బొగ్గు ఉంది? అన్న సమగ్ర సమాచారంతో సింగరేణి లో పని చేసేదే సర్వే డిపార్టుమెంటు. ఇందులో పనిచేసే కార్మికులే సింగరేణి అభివృద్ధి ముఖ చిత్రకారులు అని చెప్పవచ్చు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సర్వే డిపార్టుమెంట్ కార్మికులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే వీరి సమస్యలపై యాజమాన్యం, గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదు.

సింగరేణి వ్యాప్తంగా సర్వే డిపార్టుమెంటులో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. సర్వే మజ్దూర్లు మొదలుకుని అసిస్టెంట్ చైన్‌మన్, చైన్‌మన్, హెడ్ చైన్‌మన్ ఆపై సర్వే అధికారి ఉంటారు. ఎగ్జిక్యూటీవ్‌ల సంగతి అటుంచితే కిందిస్థాయి కార్మికులు విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు.

 ఖాళీలతో పెరుగుతున్న పనిభారం
 సింగరేణి వ్యాప్తంగా సర్వే డిపార్టుమెంటులో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 100 పోస్టులు కంపెనీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో వారి భారం మొత్తం ఉన్న వారిపై పడుతుంది. భూగర్భంలో, ఓసీపీల్లో ఇతర డిపార్టుమెంటుల్లో ఉన్న సర్వే ఉద్యోగులందరు పని భారంతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా భూగర్భంలో సర్వే కోసం ప్రత్యేక టీం ఉంటుంది. ఇందులో హెడ్ చైన్‌మన్ లేదా చైన్‌మన్ ఒకరు, ఇద్దరు అసిస్టెంట్ చైన్‌మెన్‌లు, ఒక సర్వే మజ్ధూరు ఉంటాడు. మొత్తం నలుగురు.

 పనిభారం తగ్గాలంటే మరో మజ్ధూరును ఇవ్వాలని వారు కోరుతున్నారు.  అంతే కాకుండా చాలా గనులు జీవితకా లం పెరుగుతుంది. సింగరేణిలో చాలా గనులు పాత గనులు కావడం వల్ల భూగర్భంలో చాలా లోతుల్లోకి వెళ్లాల్సి వ స్తుంది. కొన్ని గనుల్లో ఒక్క టీంను మాత్రమే పెట్టారు. పని స్థలాలు రోజురోజు పెరగడం వల్ల నడక ఎక్కు వై ఇబ్బందులు పడుతున్నామని వా పోతున్నారు. ఇలాంటి గనుల్లో రెండు టీంలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనికి తోడు ఉపరితలానికి వచ్చిన తరువాత వారి వద్ద ఉండే పరికరాలు శుభ్రం చేసుకోవడానికి, మ్యాప్‌ల కోసం టేబుల్‌రెడీ చేసుకోవడం నుంచి మొదలుకొని పేపర్ పని చేయడానికి పైకి వచ్చిన టీంకు రెండు గంటలపాటు సమయం పడుతుందని దీంతో మద్యాహ్నం 1:30 గంటల ప్రాం తలో పైకి ఎక్కాల్సి ఉంటుందని ఈ సమయంలో ఆడిట్ వాళ్లు వచ్చి ముందే ఎందుకు ఎక్కారని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.

 కొన్ని సందర్భాల్లో ఉన్నత అధికారులు పని ఒత్తిడిలో తాము చేసే చిన్నచిన్న తప్పులకు కూడా చార్జిషీట్లు, స స్పెండ్, రివర్షన్లు ఇస్తున్నారని వాపోతున్నారు. విధి నిర్వహణలో కిందిస్థాయిలో తప్పులు చేస్తే దాన్ని గని మేనేజర్ సర్వేయర్లకు చెప్పి లెటర్లు ఇవ్వాల్సి ఉంటుం ది. కానీ అలా చేయకుండా నేరుగా వారే సర్వేయర్లతో సంబంధం లేకుండా లెటర్లు ఇస్తు ఇబ్బందుకు గురి చేస్తున్నారు. సర్వేయర్‌కు తెలియకుండా గనుల్లో అండర్ మేనేజర్లు సర్వే మజ్ధూర్లలతో పనులు చేయిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధము.

 ప్రమోషన్ పాలసీ మార్చాలి..
 సర్వే డిపార్టుమెంటులో ఉన్న ప్రమోషన్ పాలసీ బాగా లేదని కొత్త పాలసీని తయారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్వే మజ్ధూర్ అసిస్టెంట్ చైన్‌మన్ కావాలంటే అక్కడ ఖాళీ ఉండాలి, నిర్ణీత సర్వీసు చేసి ఉండాలి. మళ్లీ అంతర్గతంగా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైతేనే ప్రమోషన్లు ఇస్తున్నారు. ఈ నిబంధన వల్ల ప్రమోషన్లు ఆలస్యం అవుతుంది. ఖాళీలతో సంబంధం లేకుండా కొంత కాలం ఒకే కేటగిరీలో పనిచేస్తే ఆటోమెటిక్‌గా వారికి ప్రమోషన్ కల్పిస్తూ పైకేటగిరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

హెడ్ చైన్‌మన్ తరువాత సర్వే సూపర్‌వైజర్లు పోస్టు పెట్టాలని డిమాండ్ వస్తుంది. ఇదిలా ఉంటే కేడర్‌స్కీంను సవరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం సర్వే మజ్ధూర్లకు 1వ కేటగిరీ కల్పిస్తున్నారని ఇది తాము చేసిన పనికి తక్కువ అని కనీసం డీ గ్రేడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వే డిపార్టుమెంటుపై ఐఈడీ లెక్క తప్పులుగా ఉంది. పెరిగిన పని ఒత్తిడి తగ్గట్లు మ్యాన్ పవర్‌ను లెక్కలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడో చేసిన ఐఈడీ లెక్క ప్రకారమే నడుస్తున్నారని వాటిని సరి చేయాలని కోరుతున్నారు.

 సర్వే డిపార్టుమెంటు విధులు..
 గనికి ముగ్గు పోసి భూమి పూజ చేయడం నుంచి వీరి పని ప్రారంభం అవుతుంది. టన్నెల్ ఎంత దూరం చేయాలి? ఏటవాలు తనం ఎంత ఉండాలి? మ్యాన్ వే ఎంత దూరం నడిస్తే బొగ్గు దొరుకుతుంది? బొగ్గు నిక్షేపాల వద్దకు వెళ్లిన తరువాత భారత బొగ్గు గనుల చట్టం ప్రకారం లెవల్స్, డిప్‌లు ఎలా మార్కు చేయాలి? హాలేజీ వే ఎలా వెయ్యాలి? రూఫ్ బోల్టింగ్, లాంగ్‌వాల్ మార్కులు, సర్ఫేస్‌లో బోర్లు ఎక్కడ వేయాలో పూర్తిగా వీరు ఇచ్చే ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది.

కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ చేయడం, అందులో ఉన్న ఇళ్లు, చెరువులు, చెట్టు, పుట్ట అన్ని రికార్డు చేసి యాజమాన్యానికి పంపిస్తారు. వీరి వద్ద గుండుదారం మొదలుకుని, అత్యాధునిక దుర్బిని వంటి పరికరాలు వినియోగిస్తారు. శాటిలైటు సహాయంతో కూడా కొలతలు కొలిచే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాగా, తమన ఎవరు పట్టించుకోవడం లేదని ఆ డిపార్టుమెంటు కార్మికులు వాపోతున్నారు. ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే గుర్తింపు సంఘం, యాజమాన్యం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇప్పటికైన తమ సమస్యలను గుర్తించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement