టీబీజీకేఎస్‌లో పైసల లొల్లి | fighting in Telangana Boggu Ghani Karimka Sangham for money | Sakshi
Sakshi News home page

టీబీజీకేఎస్‌లో పైసల లొల్లి

Published Thu, Jul 17 2014 12:34 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

fighting in Telangana Boggu Ghani Karimka Sangham for money

శ్రీరాంపూర్ : సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘానికి కార్మికులు చందా రాసి ఇస్తారు. చందా రాసిచ్చిన కార్మికుని నుంచి ప్రతి నెల రూ.20 వేతనం నుంచి కోత పెట్టి యాజమాన్యం ఆ మొత్తాన్ని యూనియన్‌కు అప్పగిస్తుంది. యూనియన్ సూచించిన ఖాతాలో పోగైన డబ్బులు జమ చేస్తుంది. ప్రస్తుతం ఈ డబ్బులను ఎవరు తీసుకోవాలన్న దానిపై వివాదం మొదలైంది.

టీబీజీకేఎస్‌లో 42 వేల మం దికి సభ్యత్వం ఉంది. ఈ లెక్కన ప్రతినెల రూ.8.80 లక్షలు యూని యన్‌కు చందా వస్తుంది. జూన్ 28, 2012న ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి రెండేళ్లు కావస్తుంది. ఈ లెక్కన టీబీజీకేఎస్‌కు కార్మికుల నుంచి వచ్చిన రుసుం సొమ్ము సుమారు రూ.2 కోట్లపైగా ఉంటుంది. ఇందులో కొంత ఇప్పటికే ఖర్చవగా మిగిలిన డబ్బులు మాకే దక్కాలంటూ ఒకరినొకరు తగువులాడుకుంటున్నారు.

 ఖాతాల్లోనే డబ్బు
 యూనియన్‌కు వచ్చిన సభ్యత్వ రుసుం యూనియన్ ఖర్చుల కో సం వాడుకుంటారు. కార్యాలయాల నిర్వహణ, సభలు, సమావేశా లు, వాహనాల ఖర్చు ఇలా చందా డబ్బులు వాడుకోవడం జరుగుతుంది. ఈ సొమ్ము ముఖ్య నాయకుల ఖాతాలో ఉంటుంది. మల్ల య్య, రాజిరెడ్డిలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గోదావరిఖనిలోని ఎస్‌బీఐలో మల్లయ్య పేరు మీద ఖాతాలో జమ అయ్యాయి. మొదట్లో ఈ ఖాతాల నుంచి సుమారు రూ.30లక్షలు తీసి డివిజన్ కమిటీలకు, కేంద్ర కమిటీల ఖర్చుల కోసం వాడుకున్నారు.

 ఇంకా అందు లో సుమారు రూ.48 లక్ష లు జమై ఉంది. ఇంతలో యూనియన్‌లో కరస్పాండింగ్ చేసే అధికారం ఎవరికి ఉండాలనే దానిపై జూన్ 2013లో వివాదం మొదలైంది. దీంతో ఖాతాలో ఉన్న డబ్బులు మల్లయ్యకు ఇవ్వరాదని రాజిరెడ్డి వర్గం యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం, తరువాత కోర్టుకు పోవడంతో ఈ ఖాత సీజింగ్ అయింది. అప్పటి నుంచి అలాగే  ఉంది. వివాదం కోర్టులో ఉన్నందున యాజమాన్యం నెలనెల రికవరీ చేస్తున్న సొమ్మును తన వద్దే ఉంచుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు సుమారు రూ.80 లక్షలు జమ అయ్యాయి. అంతర్గత ఎన్నికల ఖర్చును కూడా యూనియన్ రికవరీ అయిన డబ్బుల నుంచి చెల్లించడం జరిగింది.

 కోర్టుకు పోవడానికి సిద్ధం అవుతున్న నేతలు
 మల్లయ్య ఖాతాలో ఉన్న రూ.48 లక్షలు, యాజమాన్యం వద్ద రికవరీ అయిన రూ.80 లక్షలు మిగిలి ఉన్నాయి. ఇందులో ఆర్‌ఎల్సీ ఎన్నికల ఖర్చు పోను రూ.కోటికి పైగా ఫండ్ మిగిలి ఉంది. ఈ డబ్బుల కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు యూనియన్ నిర్వహణ మా ఆధ్వర్యంలో జరిగిందని, గుర్తింపు ఎన్నికలప్పుడు తెచ్చిన అప్పులు మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం తమ ఖర్చులకే ఇవ్వాలని కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేస్తోంది. వీరు కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

 ఇదిలా ఉంటే యూనియన్ పుట్టినప్పటి నుంచి సుమారు రూ. 2 కోట్లు వచ్చాయని, గెలిచిన తరువాత మల్లయ్య ఖాతాల్లోకి తీసుకున్న డబ్బులకు కూడా  లెక్క చూపాలని రాజిరెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో తాము కూడా ఖర్చు పెట్టామని, సమావేశాలు నిర్వహించామని తెలిపారు. యూనియన్ పగ్గాలు పూర్తిగా తమకే ఇస్తు కోర్టు ఆదేశాలు ఇచ్చిందున యూనియన్‌కు వచ్చిన డబ్బులపై తమకే హక్కు ఉంటుందని అవసరమైతే తాము కూడా కోర్టు పోతామని రాజిరెడ్డి తెలిపారు. దీంతో యూనియన్ మరోసారి కోర్టు మెట్లేక్కె అవకాశం ఉంది.

 పనిచేయని కాలంలో పైసలెందుకు..
 ఏడాది కాలంగా రెండు వర్గాలు కొట్లాటలతోనే సరిపుచ్చాయి. కార్మికుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. యూనియన్‌కు యాజమాన్యంకు స్ట్రక్చరల్ సమావేశాలు నిలిచాయి. గెలిచారు కాబట్టి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తారని చందా రాస్తే ఏడాది కాలంగా వారిలో వారు కొట్టుకుంటున్నారని కార్మికులు మండిపడుతున్నారు. తమ కోసం పని చేస్తారని నమ్మి చందా రాసామని  పనే చేయనప్పుడు వారికి డబ్బులు వాడుకునే హక్కెక్కడిదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు నిలిచిన కాలంలో రికవరీ చేసిన డబ్బులు తిరిగి తమకే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement